Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 31.01.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 31.01.2021 (Kids Special)

సహాయములో  దీవెన:-

"మీ శత్రువులను ప్రేమించుడి." - మత్తయి 5: 44

హాయ్ పిల్లలు! ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? సరే మనము ఈ దిన ధ్యానంలో ఇద్దరు స్నేహితుల కథను విందమా?

రవి అనే బాబు స్కూల్లో చదువుతూ ఉన్నాడు. అతని యొక్క తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త. రవికి స్టీఫెన్ అనే ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. స్టీఫెన్ మంచి దైవభక్తి గలవాడు. కాని రవికి దాంట్లో నమ్మకం లేదు స్టీఫెన్ పిలుచుట వలన సండే స్కూల్ కి వెళ్తుండేవాడు కాని అక్కడ చెబుతున్న దానిని వినడు. ఈ ఇద్దరు స్నేహితులు కలిసి స్కూల్లో చదువుతున్నారు. ఆ క్లాసులో వీడితో పాటు మరియొక స్నేహితుడు కూడా ఉన్నాడు. వాడి పేరు యోసేపు. వీడు మంచిగా ప్రార్ధించే వాడు కాని చాలా పేద వాడు కనుక రవి వాడితో మాట్లాడడు. ఎప్పుడు స్టీఫెన్ రవికి యేసయ్య ప్రేమ గురించి చెబుతూవుంటాడు. కాని రవి ఎంత మాత్రం అంగీకరించలేదు. ఒక దినము రవి యొక్క నాన్న బలహీనమై హాస్పిటల్ కు వెళ్లారు. అతనిని పరీక్షించిన డాక్టర్ రవి యొక్క నాన్నకు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. దీనిని విన్న యోసేపు ఏదైన సహాయం చేయాలి అని ఆలోచించాడు. 

యోసేపు చాలా చక్కగా డ్రాయింగ్ చేస్తాడు. తరువాత వాళ్ళ స్కూల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ డ్రాయింగ్ పోటీలో అతని పేరు నమోదు చేసుకున్నాడు. దాంట్లో 1స్ట్ ప్రైజ్ యోసేపు వచ్చింది. మరియు ఆయనకు పెద్ద మొత్తంలో ధనము కూడా వచ్చింది. యోసేపు ఆ డబ్బును ఏమి చేసి ఉంటాడు అని ఆలోచిస్తున్నారు కదూ? యోసేపు తన తల్లిదగ్గరకు వెళ్లి రవి నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి చెప్పి ఆ డబ్బును రవి యొక్క నాన్నగారికి ఇవ్వనా అని అమ్మను అడిగిన వెంటనే అమ్మ దానికి అంగీకరించారు. యోసేపు త్వరగా హాస్పిటల్ కి వెళ్లి రవి చేతిలో ఆ డబ్బులు పెట్టి ఇవి నాకు ఇంటర్నేషనల్ డ్రాయింగ్ పోటీలో వచ్చిన బహుమానం దీనిని మీ నాన్నగారి యొక్క ఆపరేషన్ కు వాడుకోండి అని చెప్పి ఇంటికీ వెళ్లుటకు బయలుదేరాడు. అప్పడు రవి యోసేపు యొక్క చేతులు పట్టుకొని ఏడుస్తూ క్షమాపణ అడిగాడు. అందుకు యోసేపు యేసయ్య నాకు ఈ బహుమానం ఇచ్చారు అని చెప్పారు. రవి యొక్క నాన్నగారు ఆపరేషన్ బాగా జరిగింది. సహాయం చేయుట వలన యోసేపు కు దొరికిన దీవెన ఏమిటో తెలుసా? యోసేపు వేసిన డ్రాయింగ్ లీడర్స్ అందరికి నచ్చి దానిని నోట్ బుక్ ఫ్రంట్ పేజీలో వేయాలి అని నిర్ణయించారు. యేసయ్య యోసేపును దీవించి అతనిని హెచ్చించారు.

పిల్లలు కధ బాగుంది కదా! మీరు కూడా యేసేపు వలె ఎవ్వరు మిమల్ని ద్వేషించినను వాళ్ళ కొరకు ప్రార్దించి వాళ్ళకు అవసరం లేదా ఇబ్బంది వచ్చినప్పుడు సహాయం చేస్తే యేసయ్య మిమ్మల్ని దీవిస్తారు. మరి సహాయం చేస్తారు కదా?

-    సహోదరి. బేబీ. ఏ. దివ్య

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)


Loading...