Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 30.01.2021

దిన ధ్యానము(Telugu) 30.01.2021

మీరు ఎక్కడికి పరుగెడుతున్నారు.

"ఇరుకు ద్వారమున ప్రవేశించుడి... దాని కనుగొనువారు కొందరే" - మత్తయి 7: 13

మన అనుదిన జీవితపు ప్రయాణంలో మనము చాలా వేగంగా పరిగెడుతున్నాము. దేని వైపు పరిగెడుతున్నాం? చిన్నారులైతే విద్య వైపు... యవ్వనస్తులైతే వివాహము వైపు... మధ్య వయస్సు గలవారైతే ఆస్తులవైపు... ధనమువైపు, కుటుంబముల వైపు...వృద్ధాప్యంలో గలవారు ఎటు వెళ్ళాలో తెలియక  సమయాన్ని గడుపుతూ మరణము వైపు పరుగెడుతున్నారు. మొత్తానికి మనం అందరం ఆఖరి దినము వైపునకు పరిగెడుతున్నాము. సరే ఆ పరుగు ముగించిన పిమ్మట ఖచ్చితంగా ఒక ఫలితం కలదు అవి ఒకటి విజయము రెండవది అపజయము. ఒకడు ఒక నదిని దాటి అవతల ఒడ్డునకు చేరుకున్నట్టుగా మనం కూడా మరణమును దాటి నిత్య జీవమునకు లేదా నిత్య నరకమునకు వెళ్ళే తీరాలి. 

ఈ నిత్య నరకంలో చోటు దక్కించుకొనుటకు మనము ఏమి చెయ్యనవసరం లేదు. కాని నిత్య జీవము గలవారిగా పరలోకం వెళ్ళాలి అంటే అనుమతి ఈ భూమి పైన పొందుకోవాలి. ముందే మనము దానిని రిజర్వేషన్ చేసుకోవాలి. ఆ అనుమతి యేసుక్రీస్తు యొక్క రక్షణే. ఆయనే మనలను చివరి వరకు నిలిచి యుండేటట్లు చేసి అనుదినము మనలను రక్షణ వైపునకు నడిపించి మనలను పవిత్ర పరచి పరలోక జీవితము పొందుకొనుటకు సిద్ధపరుస్తున్నారు. ఈ సిద్దపాటు లేకుండా మనము మరణాన్ని దర్శించిన యెడల రక్షకుని నీతిగల న్యాయాధిపతిగా చూస్తున్నప్పుడు మనము భయపడి నిలబడిపోతాం. ప్రభువా ఇంకా ఒక అవకాశం నాకు ఇవ్వండి భూలోకమునకు వెళ్ళి మిమ్మల్ని నమ్ముకుంటాను, విశ్వసించి అంగీకరిస్తాను అని ఎంత బ్రతిమలాడినను ఆ అవకాశము మనకు దొరకదు. సాతాను కొరకును ఆయన దూతల కొరకును సిద్ధము చేయబడిన అగ్ని గుండములో త్రోసివేయబడుదము. నిత్యాము మండుతున్న ఆ అగ్ని గుండము ఎంత వేదన కరమైననదిగా ఉంటుంది. 

ప్రియ సహోదరి, సహోదరులారా! మరణము తరువాత ఉంటున్న జీవితాన్ని ఎంచుకునే అవకాశము మన ప్రతి ఒక్కరికి ఈ లోకంలో అనుగ్రహించబడి ఉంది. మీరు ఏ మార్గాన్ని ఏంచుకోబోతున్నారు? ప్రేమ, సంతోషం, సమాధానంతో నిండి ఉన్న ఇరుకైన మార్గం కలిగిన పరలోకాన్ని లేదా విశాలముగా ఉండి ఏడుపును, పళ్ళు కొరుకుట మార్గముగా కలిగిన నరకమా? ఒక వేళ తప్పిదమైన ఎంపికను ఎంచుకొని పరిగెడుతుంటే ఈ దినమే నీ మార్గాన్ని మార్చుకోవచ్చు. మీరు 11వ తరగతిలో తీసుకున్న గ్రూప్ ని 12వ తరగతిలో మార్చుకోలేరు. కాని మీరు ప్రాణముతో ఉండేటప్పుడు ఈ దినమే మీ పాపపు మార్గములను విడిచి పరిశుద్ధ మార్గమునకు మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. ప్రభువు మీకు సహాయము చేస్తారు. 
-    శ్రీమతి. భువన ధన బాలన్

ప్రార్థన అంశం:-
చైల్డ్ పాట్నర్స్ ప్లాన్ లో కలిసి యున్న పిల్లల యొక్క భవిష్యత్ ను దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)