Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 29.01.2021

దిన ధ్యానము(Telugu) 29.01.2021

అవకాశము:

"చూడుము; నేడు నేను జీవమును మేలును మరణ మును కీడును నీ యెదుట ఉంచియున్నాను" - ద్వితియోపదేశకాండము 30:15

బిల్గేట్స్ ప్రపంచ ధనవంతుల పట్టికలో ప్రధమ స్థానంలో ఉన్నారని నాకు తెలుసు. ఆయనను ఇంటర్వ్యూ తీసుకొనుటకు విలేకర్లు ఆయన యొద్దకు వచ్చారు. వారిలో ఒకరు మీరు ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రధమ స్థానంలో ఉన్నారు కదా మరి మీ యొక్క విజయమునకు గల కారణము ఏమిటి అని అడిగారు. వెంటనే బిల్గేట్స్ ఒక పేపర్ ను అతని చేతికి ఇచ్చి మీకు ఎంత డబ్బులు కావాలో ఆ పేపర్లో వ్రాసి ఇవ్వండి నేను ఇస్తాను అన్నారు. అందుకు ఆ విలేకరి నాకు ఏమి వద్దు అన్నారు. అందుకు బిల్గేట్స్ నీవు ఎంత వ్రాసియున్న నేను ఇచ్చేవాడిని అని అన్నారు. కాని మీరు అడగలేదు మీకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. నేను అయితే మీ వలె నాకు వచ్చిన అవకాశాన్ని కోల్పోలేదు. చిన్న అవకాశమైన నేను విడిచిపెట్టలేదు అదే నా విజయమునకు గల కారణం. 

బైబిల్లో ఏశావు దేవుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయాడు. అందువలన ఆయన పొందుకోవలసిన జేష్ఠపుత్ర భాగమును కోల్పోయాడు. జేష్ఠ పుత్ర భాగము అన్నది రెండంతల దీవెన. ఆయనకు ఉండిన ఆకలి వలన సాదారణమైన ఆహారము కొరకు ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. ఇందువలన తన ఆస్తిని కోల్పోయాడు, తరువాత ఆయన బిగ్గరగా ఏడ్చినను ఆయనకు అది దొరకలేదు. కాని తన సహోదరుడైన యాకోబు మాత్రం ఏమి లేని వాడిగా వట్టి చేతి కర్రతో తన మామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు దొరికిన అవకాశలన్నింటిని వాడుకొని సైన్యము వంటి రెండు ఆస్తులను సంపాదించాడు. ఈ దినము వరకు ఆయన సంతతి వారు భూమిపై దీవెన కరముగా వుంటున్నారు. వాళ్ళ కొరకు ప్రత్యేకమైన దేశమే ఏర్పడించి. వారి సంతానములోనే యేసు క్రీస్తు జన్మించారు. 

ప్రియమైన యవ్వనులారా! మీకు వచ్చే ఎలాంటి అవకాశాన్ని విడిచి పెట్టవద్దు. ఇవ్వబడిన చిన్న అవకాశమైన, పెద్ద అవకాశమైన విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకున్న వారు దీవించబడ్డారు. కళాశాలలో, కుటుంబంలో, మీకు దొరికిన ఎలాంటి అవకాశమైన ఆలోచించి ఆలస్యం చేసి వదలకుండా అంగీకరించి ప్రార్దించి వాడుకొనండి. దొరికే అవకాశమును వాడుకొనినప్పుడు దేనిని మీరు చేయలగలరో దానినే దేవుడు మీకు దయచేస్తారు. మీ యొద్ద ఏ తలాంతు కనుగొనుటకు ఇదే మంచి సమయం. సోమరితనం, ధనాశ ఇవన్నీ మీ యొక్క కఠిన ప్రయాసను వృధా పరుస్తుంది. ప్రాముక్యంగా మీకు కలిగిన తలాంతు దేవుని నామ మహిమ కొరకు వాడబడుటకు జాగ్రత్తపడండి. యేసు కొరకు దేనినైనా విడిచిపెట్టవచ్చు కాని దేని కొరకు యేసయ్యను విడిచిపెట్టకండి. 
-    బ్రదర్. జె . డేవిడ్

ప్రార్థన అంశం:-
బైబిల్ కాలేజ్ విద్యార్థులు కూర్చొని చదువుటకు కుర్చీలు కొనబడులాగునా ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)