దిన ధ్యానము(Telugu) 28.01.2021
దిన ధ్యానము(Telugu) 28.01.2021
నీవు లేకపోతే.
"హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే" - 1దినవృత్తాంతములు 29: 12
అగ్నితో వెలిగించబడుతున్న ఒక చెక్క ప్రారంభంలో బాగా మండుతుంది. సమయం గడుస్తున్న కొలది ఆ మంట తగ్గిపోయే సమయంలో ఒకరువచ్చి మరలా దానిని ఊదినప్పుడు మరలా మంట ఎక్కువ అవుతుంది. ఇంకా కొంత సమయం లో మంట ఆరిపోయి, నిప్పు ఆరిపోయి, బూడిద గా మారిపోతుంది. ఇలాగుననే ఒకని యొక్క ఆత్మీయ జీవితం మంట తోనే ప్రారంభం అవుతుంది. కాలం గడుస్తున్న కొలది ప్రార్థన లేకుండా దేవుని మాటను ఆశ్రద్ద చేయుట , అవిధేయతతో తెగించి చేసిన పాపము ఇవన్నీ కలిసి ఆత్మీయ జీవితం చల్లారిపోయే పరిస్థితికి తీసుకువస్తుంది. ఇదే బ్యాక్స్లేడ్ అనగా వెనకబడిపోవడం ఇలాగు బ్యాక్స్లేడ్ అయిన ఒకరిని పెట్టుకొని దేవుని ప్రణాళిక ఆటంకం కాకుండ వాళ్లకు బదులుగా చిన్నవాళ్లను దేవుడు వాడుకున్నదానిని బైబుల్లో చూస్తున్నాం.
ఏలి యొక్క యాజక పరిచర్య మంట లేకుండా పోయింది. ఆయన యొక్క ఇద్దరు పిల్లలు దుర్మార్గతను ఆయన ఖండించలేదు. హన్నా యొక్క కన్నీటిని తప్పుగా లెక్కగట్టాడు. దేవుడు మాట్లాడుతున్న మాటల్ని వినే హృదయము ఏలికి లేనందున దేవుడు బాలుడైన సమూయేలు యొద్ద తన భారాన్ని పంచుకుంటున్నారు.ఇశ్రాయేలు మొదటి రాజుగా దేవుడు ఏర్పరుచుకున్న సౌలు రాజు దేవునికి లోబడకపోవడం వలన ఆ స్థానమునకు యవ్వనుడైన దావీదును తీసుకువస్తున్నారు. దేవుడు దావీదును వాడుకొనుట ప్రారంభించిన వెంటనే సౌలు యొక్క జీవితం చేదుగా మారిపోయింది.
దేవుని యొక్క పరిచర్య చేస్తున్న ప్రియ స్నేహితులరా మీ యొక్క స్థానాన్ని మీరు ఆశ్రద్ద చేస్తున్నపుడు అదే స్థానములో మరియొక వ్యక్తిని దేవుడు ఏర్పరచగలరు. వారు మీకంటే వయస్సులో చిన్న వాళ్లుగా అయి ఉండ గలరు. వాళ్ళను దేవుడు వాడుకొనుటకు సమర్థుడు. అవును దేవుని యొక్క భారాన్ని మోయనివాడు దుఃఖం మోస్తాడు. ఆత్మల కొరకు భారము లేనివాడు చివరికి తనకొరకు తాను భారం మోయవలసి వస్తుంది. మనకు దేవుడు ఇచ్చిన బాధ్యాతల్లో ఆశ్రద్ద చూపిన యెడల ఆ గురిని చేరుకొనుటకు దేవుడు ఇతరులను వాడుకొంటారు. దేవుని యొక్క పిలుపును మరచినప్పుడు మనము మరియొక బ్రతుకును వెతకవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పొందుకున్న పరిచర్యను, అభిషేకాన్ని కోల్పోకుండా కాపాడుకుందాం. ఆమెన్
- బ్రదర్. అరుణ్ అబేల్
ప్రార్థన అంశం:-
బైబిల్ కాలేజ్ విద్యార్థులు ఉండుటకు కట్టబడుతున్న హాస్టల్ కట్టడ పనులు సక్రమముగా కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250