దిన ధ్యానము(Telugu) 26.01.2021
దిన ధ్యానము(Telugu) 26.01.2021
నా దేశం:
"రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను" - 1తిమోతికి 2: 2
అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ అయిన జాన్ స్కడ్డర్ ఒక దినము రాత్రి రోగి ఒకరిని చూచుటకు అతని ఇంటికి వెళ్ళారు . అతని ఇంట్లో గల బల్ల పైన ఉన్న చిన్న పుస్తకమును తీసి చదవడం ప్రారభించారు . 60 కోట్ల ప్రజల యొక్క సునాదము అనే హెడ్డింగ్ తో ఇండియాలో కొన్ని లక్షల మంది ప్రజలు సాదారణ అత్యవసర వసతులు కూడా లేకుండా ప్రతి రోజు మరణిస్తూ ఉన్నారు అనే వార్త దాంట్లో ఉంది. ఇలాంటి ప్రజల కొరకు ఎవరు వెళ్తారు అనేదాన్ని జాన్ స్కడ్డర్ యొక్క హృదయాన్ని కదిల్చివేసింది. దేవుడు నన్ను పిలుస్తున్నారు అని ఎరిగి దానికొరకు ప్రయత్నములు చేయడం ప్రారంభించారు. అప్పుడు అతని తండ్రి నీవు ఇండియాకు వెళ్తే నా కుమారుడవు కాదు నా ఆస్తిలో నీకు ఎలాంటి భాగము ఉండదు అని అన్నారు. కాని జాన్ స్కడ్డర్ అయితే ఏమి పట్టించుకోకుండా భార్య హెరియట్ తన యొక్క 2 సంవత్సరాల శిశువుతో ఇండియా కు బయలుదేరారు. కొన్ని సంవత్సరాలు తరువాత ఆ శిశువు మరణించింది. దాని తరువాత జన్మించిన ఇద్దరు పిల్లలు కూడా మరణించారు. అయినప్పటికీ ఆయన ప్రయాసతో భారతదేశంలో వైద్య పరిచర్య చేస్తూ వచ్చారు. జాన్ స్కడ్డర్ కి తరువాత ఏడుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఏడుగురు మగపిల్లలు అందరిని కూడా తగిన వయస్సులో అమెరికా పంపించి అందరిని మెడికల్ చదువులు చదివించారు. చదువులు అయిపోయిన వెంటనే వాళ్ళను భారతదేశమునకు రప్పించి భారతదేశంలో అనేక ప్రాంతములకు పంపించి వైద్య పరిచర్య చేయించారు. ఆరవదిగా జన్మించిన బిడ్డే వెల్లూరులో సి.ఏం.సి హాస్పిటల్ స్థాపించిన హైడా స్కడ్డర్. జాన్ స్కడ్డర్ భారత దేశము వచ్చిన మొట్టమొదటి అమెరికా వైద్య మిషనరీ అయ్యారు. మోషే అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు ముళ్ళ పొదలలో మండుతున్న అగ్ని మధ్యలోనుండి దేవుడు మోషేతో నా జనులను ఐగుప్తులోనుండి విడిపించి తీసుకు రమ్మని చెప్పినప్పుడు మోషే అంగీకరించలేదు. దేవునితో చాలాసేపు మాట్లాడిన తరువాత అంగీకరించారు.
యవ్వనస్తుడా ఈ దినము నీ చుట్టు జరుగుతున్న సంఘటనలు చూస్తున్నప్పుడు పరిపాలన బాగోలేదు, నాయకులు బాగోలేదు అని చెప్తున్నారా? నా దేశము, నా ప్రజలు అనే తలంపు నీకు ఎందుకు రాలేదు. అమెరికాలో జన్మించిన జాన్ స్కడ్డర్ కు భారతదేశంపై అంత భారం ఉంటే మరి మీకు భారతదేశంలో ఉండే ప్రజలు నా ప్రజలు అనే తలంపు ఎందుకు రాలేదు. మీరు మీ దేశాన్ని ప్రేమిస్తున్నారా? దేశము కొరకు మీరు ఏమి చేశారు ఆలోచించి చూడండి. కనీసం దేశం కొరకు సమయం కేటాయించి ప్రార్థిస్తున్నారా? ప్రార్ధనే మన దేశములో మార్పులు తీసుకు రాగలదు.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్
ప్రార్థన అంశం:
డే కేర్ సెంటర్లో పిల్లల బాధ్యతలను తీసుకున్న కుటుంబాలను దేవుడు దీవించేతట్టు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250