Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 24.01.2021

దిన ధ్యానము(Telugu) 24.01.2021

ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం.

కాపాడుతున్న దేవుడు.

"మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" - మత్తయి 5: 16

ఏటమ్మా చేస్తున్నావు? త్వరగా  బయలుదేరు మనము పొలమునకు వెళ్లి పంటను కోయాలి. 10 మందిని సిద్ధపరచి ఉంచాను, నేను ముందు వెళ్తాను నువ్వు భోజనం తీసుకొని త్వరగా వచ్చేయ్ అని    చెప్పి బయలు దేరారు రాజయ్య. ఆయన కుటుంబం అంతా దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని మాటకు లోబడుతూ వచ్చారు. దేవుడు అతనికి కలిగిన అన్నింటిని కూడా దీవించారు. అతని పంటలు అన్ని కూడా బహుగా దీవించబడ్డాయి.

ఆ సంవత్సరం కూడా వరి పంటను కోసి దానిని దుల్లగొట్టుటకు తీసుకు వచ్చినప్పుడు హఠాత్తుగా వర్షం,  కాబట్టి వరి కట్టలు అన్ని కూడా కుప్పగా వేసి వర్షంలో తడిసిపోకుండా కప్పివేసి వెళ్లారు. ప్రక్క పొలము వారు కూడా పంటను కోసి అలాగే కప్పి పెట్టేసి వెళ్లారు. తరువాత దినము పంటను దుల్లగొట్టుటకు వచ్చి చూస్తే వాళ్లకు భయం పుట్టించే కార్యం. ప్రక్కనే అడవిలో గల అడవి బాతులు ఎగురుకొని వచ్చి ఆ పంటను చెల్లాచెదురు చేసేసి ఉన్నాయి. అవి మిడతలు వలె గుంపులు గుంపులుగా వచ్చి రాత్రిమీద ఆ పంటను తినేసి వెళ్తుంటాయి. వాటి కాళ్ళ యొక్క ముద్రలు బట్టి అవే పంటను తినేసి ఉంటాయి అని గుర్తించారు. అయ్యో నా పంట అంతా కూడా పాడైపోయిందే అని రాజయ్య ప్రక్క పొలము వారు బాధతో ఉన్నారు. అప్పుడే రాజయ్య  వచ్చి  తన పొలమును చూసారు  అక్కడ ఒక్క గింజ కూడా చెదరి పోకుండుట చూసి ఆయనే ఆశ్చర్యపోయారు. ఆయన పొలములో ఒక్క బాతు యొక్క అడుగు జాడలు కూడా లేవు. ప్రభువా నన్ను మాత్రమే కాదు నాకు కలిగిన అన్నింటిని నీవు కాపాడి నందుకు మీకు వందనములు చెప్పి ప్రార్ధించారు. ప్రక్క పొలము వారు ఈ సంఘటనను చూసి ఆశ్చర్య పడి ప్రభువు మీద విశ్వాసముంచారు. రాజయ్య కుటుంబం యొక్క పరిమళించే జీవితము అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించింది. 

ప్రియమైన పిల్లలు! యేసయ్య తనను వెదుకు వారి జీవితంలో ఆశ్చర్య కార్యములు చేశారు అని చూసాము కదా అది మాత్రమే కాదు వారి ద్వారా అనేకులు క్రీస్తు ప్రేమను పొందుకొనేటట్లు చేస్తారు. నీవు కూడా యేసయ్య యొక్క పరిమళాన్ని పరిమళించే సాక్షిగా జీవించి అనేకులకు సంతోషాన్ని ఇస్తావా?
-    శ్రీమతి. జీవా విజయ్

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)