Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 23.01.2021

దిన ధ్యానము(Telugu) 23.01.2021

పురుగులను చంపుదాం.

"తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను" - 1కోరింథీయులకు 10: 12

నేను చాలా పెద్ద వృక్షము, అనేక సంవత్సరాలుగా బలముగా పచ్చని వృక్షముగా ఉన్నాను. నేను అనేక పక్షులకు గూళ్ళు కట్టుకొని నివసించే నివాస స్థలంగా ఉన్నాను. చిన్న పిల్లలు ఆడుకునే మైదానముగా నా నీడ ఉండేది. మార్గంలో నడుస్తూ వెళ్లేవారు అనేకమంది నా నీడలో విశ్రాంతి తీసుకొనే స్థలంగా నేను ఉన్నాను. గాలి, వర్షము, ఎండ, తుఫాను అనే అన్ని పరిస్థితులు తట్టుకొని నిలబడగలిగాను. నేను అందరికి సంతోషాన్ని ఇచ్చే వృక్షముగా ఉన్నాను. కొంత కాలం గడిచింది నేను నా బలమును కోల్పోయినట్లు అనిపించింది. ప్రారంభంలో నేను దానిని పట్టించుకోలేదు. నెమ్మనెమ్మదిగా నా బలాన్ని కోల్పోయి నేను ఒక రోజు హఠాత్తుగా పడిపోయాను. నేను ఎందుకు పడిపోయాను అని ఆలోచింప సాగాను. తరువాత నాకు అర్ధం అయ్యింది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే నేను చిన్న పురుగు వలనే పడిపోయాను అని గ్రహించాను. మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా అవును కొన్ని చిన్న పురుగులే ఆ పెద్ద వృక్షమును పాడుచేసి బలము లేకుండా చేసేశాయి.

అవును ఇది చిన్న కార్యమే కదా అని విడిచిపెడుతున్న కొన్ని కార్యములే మన ఆత్మీయ జీవితమును బలహీన పరుస్తుంది. బైబిల్లో కూడా ఇస్కరియోతు యూదా గురించి మనము చదువుతున్నాం. ఆయన యొక్క పతనం ఒకే దినములో జరిగినది కాదు. ధనాపేక్ష అనే పురుగు ఆయనను కొంచము కొంచముగా బానిసగా చేసి క్రిందకు పడదోసింది. ముగింపులో సాతానుడు ఆయనలో సంపూర్ణముగా నిండిపోయాడు. కారణము ప్రారంభంలో ఆయనలో గల ధనాపేక్షను సరిచేసుకోకపోవడమే. చివరికి నిష్కలంకమైన రక్తమును అప్పగించానే అని తన మనస్సులో బాధపడి తన జీవితమును ముగించుకున్నాడు.

అవును ప్రియమైన వారాలరా! ఆ వృక్షము పురుగు తనను పాడు చేస్తున్న దానిని అపలేకపోయింది. కాని మనము అయితే దేవున్ని ఎరిగినవారము, వాక్యము ద్వారా వచ్చే విడుదలను గ్రహించినవారము. అయినప్పటికీ ఇది నా యొక్క చిన్న బలహీనతే కాబట్టి దేవుడు దీని గురించి ఏమి అనుకోరు అని సాకులు చెప్పే వారుగా ఉండవద్దు. ఇటువంటి చిన్న చిన్న కార్యములే మన ఆత్మీయ జీవితమునకు పెద్ద పతనం తీసుకువస్తుంది. మనలను పడగొట్టే ఆ చిన్న పురుగులను నాశనం చేద్దాం. దేవుని బలముతో సాక్షిగా ఆయనలో జీవిద్దాం. 
-    బ్రదర్. పాల్ జబాస్టిన్

ప్రార్థన అంశం:
మీడియా మినిస్ట్రీ కొరకు,  ఇంకను అనేక పరికరాలు అవసరమై యున్నది సహాయము చేసే హస్తములు లేచేటట్లు ప్రార్దిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)