దిన ధ్యానము(Telugu) 21.01.2021
దిన ధ్యానము(Telugu) 21.01.2021
మోషే యొక్క కర్ర.
"యెహోవానీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడుకఱ్ఱ అనెను" - నిర్గమకాండము 4: 2
దేవుడు మోషే జీవితములోనికి వచ్చినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నతో వచ్చారు. నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగారు.
అలాంటి ప్రశ్నను ప్రభువు ఒక వ్యక్తిని చూచి అడిగారు. అందుకు ఆయన నా యొద్ద ఉన్నది ఒక పెన్ను మాత్రమే అందులో మీరు కల్వరి సిలువలో కార్చిన రక్తాన్ని నింపి ఇవ్వండి దాని ద్వారా మీ యొక్క మహిమ కార్యములను, మీ కనికరమును నేను వ్రాస్తాను అని చెప్పారు. ఆయన ద్వారా దేవుడు వందల కొలది పుస్తకాలను వ్రాయుటకు, వాటి ద్వారా లక్షలాది ప్రజలు దీవెనను పొందుకున్నారు. ఆయన ఇప్పుడు లేరు కాని ఆయన వ్రాసిన పుస్తకములు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని బలమును నింపుతుంది. ఆత్మీయ జీవితంలో బలము పొందుకొనుటకు ఆ పుస్తకములు సహాయకరంగా ఉంటున్నాయి. ఆయన ఎవరో తెలుసా? అనుదిన మన్నా పతిచర్య స్థాపకులైన అయ్యా సామ్ జగతురై.
ఫరో భవనంలో ఉన్నత స్థానంలో ఉండిన మోషే చేతిలో ఇప్పుడు గొర్రెల కాపరుల చేతిలో పట్టుకొంటున్న సాదారణ కర్ర మాత్రమే ఉంది. ప్రభువు దాని గురించే అడుగుతున్నారు. ప్రభువుకు తెలియదా మోషే చేతిలో ఉన్నది కర్ర అని. ఆలాగుననే ఏదేను తోటలో ఆదామా నీవు ఎక్కడున్నావు? అని అడుగుతున్నారు. ఆదాము చెట్ల వెనుక దాగుకొని ఉండుట దేవునికి తెలియదా ఏమిటి. దేవుడు ప్రశ్నలు అడుగుతున్నప్పుడెల్లా మనలను ఆలోచింపజేసి మనలను ముందుకు నడిపిస్తున్నారు అనే దాన్ని గ్రహించుకోవాలి.
మోషే యొక్క చేతిలో కర్ర ఉండేది, దావీదు చేతిలో సితార, వడీసె ఉండేవి, గిద్యోను చేతిలో కుండలు, బూర ఉండేది, సమ్సోను చేతిలో దవడ ఎముకలు ఉండేవి, యేసు క్రీస్తు యొక్క ప్రసంగాన్ని వినుటకు వచ్చిన బాలుని చేతిలో 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. పేద విధవరాలు చేతిలో రెండు నాణెములు ఉన్నాయి. వారి వారి చేతుల్లో గల వస్తువులు చిన్నవైన వాటిని ప్రభువు చేతికి అప్పగించినప్పుడు దేవుడు వాటి ద్వారా బలమైన అద్భుత కార్యములు చేశారు. ఒక వేళ మీ యొద్ద మంచి పాటలు పాడే తలాంతు ఉండవచ్చు, వ్రాయగలిగిన తలాంతు ఉండవచ్చు, మాట్లాడ గలిగే తలాంతు ఉండవచ్చు, ఇతరులకు సహాయం చేయ గలిగే మంచి మనస్సు ఉండవచ్చు, కష్ట పడి పనిచేసే స్వభావము ఉండవచ్చు. దేనిని ప్రభువు నీకు ఇచ్చియున్నారో వాటిని మనము ప్రభువుకు సమర్పించినప్పుడు దానిని ప్రభువు దీవించి అనేక వేల కొలది, లక్షలాది ప్రజలకు దానిని వాడుకుంటారు. మీ చేతుల్లో ఉన్న దానిని ఆయనకు ఇస్తే చాలు.
- బ్రదర్. ఎస్. పి. సంతన పాండి.
ప్రార్థన అంశం:
ఆంధ్ర ఫీల్డ్ లో రేగా పుణ్య గిరి కొండ పైన గల గ్రామంలో కట్టబడుతున్న దేవుని మందిరం త్వరగా కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250