దిన ధ్యానము(Telugu) 19.01.2021
దిన ధ్యానము(Telugu) 19.01.2021
ఎంపిక:-
"...ఎవనిపేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా” - 1సమూయేలు 16:3
ఎంపిక అనేది ప్రతి మనిషికి భిన్నంగా ఉంటుంది. దాంట్లో ప్రాముక్యంగా దేవుడు ఏర్పరచుకున్న విధము వేరు. మనుష్యుని యొక్క ఎంపిక వేరు. పోలీస్ మరియు సైన్యమునకు ఎంపిక చేసినప్పుడు శరీర ఎదుగుదల మరియు వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడుతున్నారు. ఇది లోకపు ఎంపిక చేసుకున్న విధము. కాని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఎంపిక చాలా అద్బుతమైనది. మనిషి యొక్క ఆలోచనకు, తలంపులకు మించినది.
ప్రభువు సమూయేలుతో యెష్షయి ఇంటికి వెళ్లుము అతని కుమారులలో ఒకరిని నేను ఇశ్రాయేలు రాజుగా ఎంచుకున్నాను అన్నారు. సమూయేలు దేవుడు చెప్పిన ప్రకారము బేత్లెహేమునకు వెళ్ళాడు. అక్కడ సమూయేలు యెష్షయి పెద్ద కుమారుడైన ఏలీయాబును చూచి అతని రూపమును అతని కున్న ఎత్తును చూసి దేవుడు ఇతనినే రాజుగా చేయబోతున్నాడు అని అనుకున్నాడు. కాని దేవుడు అయితే సమూయేలుతో ఇతని మొకమును, శరీర ఎదుగుదలను చూడవద్దు నేను ఇతనిని ఎంచుకోలేదు మనుష్యులు చూసినట్లు నేను చూడను ప్రజలు బాహ్యరూపమును చూస్తారు కాని నేను అయితే అంతరంగ రూపాన్ని చూస్తున్నాను అని దేవుడు సమూయేలుతో అన్నారు. ఇలాగు యెష్షయి తన కుమారులైన 7గురును తన ముందు నిలబడబెట్టారు. కాని వీరిలో ఎవ్వరిని కూడా దేవుడు ఏర్పరచ కోలేదు. సమూయేలు యెష్షయితో మీ పిల్లలు వీరేనా అని అడుగగా అందుకు అరణ్యములో గొర్రెలు కాస్తున్న దావీదు రప్పించబడ్డాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో నీవు లేచి దావీదును రాజుగా అభిషేకించుము అన్నారు. చూడండి మన యొక్క ఎంపిక ఎంత భిన్నంగా ఉంటుంది. ఇంటి వాళ్ళందరితో, సహోదరులతో తిరస్కరించబడిన దావీదును దేవుడు రాజుగా ఎంచుకున్నారు.
ప్రియమైన సేవకులారా! దావీదు వలె లోకము ద్వారా తిరస్కరించబడిన మనలను దేవుడు ఏర్పరచుకొని ఆయన యొక్క మేళ్లను ప్రకటించుటకు ఉన్నత పతిచర్య కొరకు దేవుడు మనలను అభిషేకించి యున్నారు. లోకము ఒకరిపై బాధ్యతను అప్పగించాలి అంటే వారి యొక్క పై రూపము, అలంకరణ, నడవడికలు అన్నింటిని చూస్తుంది కాని దేవుడు అయితే వాడి యొక్క హృదయమును చూస్తున్నారు. దావీదు వలె మన హృదయము ఆయనకు ప్రియమైనదిగా మారనివ్వండి. ఆయన మన మీద పెట్టిన కృపను గ్రహించుకొన్నవారిగా ఉండి సాక్షిగా జీవించి, ఫలించి, యదార్థంగా పరిచర్య చేసి మన జీవితమును కొనసాగిద్దాం.
- శ్రీమతి. శక్తి శంకర్ రాజన్
ప్రార్థన అంశం:-
7000 మంది మిషనరీలను తయారుచేసి లక్ష గ్రామాలను దర్శించే ప్రయత్నంలో దేవుని హస్తం తోడుగా ఉండేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250