Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 18.01.2021

దిన ధ్యానము(Telugu) 18.01.2021

ఏకాంతము ఇంపైనది.

"...రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును" - మత్తయి 6: 6

అశోక్ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా త్వరగా పనికి బయలుదేరుతున్నారు. కాని అశోక్ అయితే తన మొబైల్లో ఛార్జింగ్ తగ్గిపోకుండా చూసుకుంటున్నాడు. నాన్న అశోక్ తో ఒరే నాన్న బాధ్యత గలవాడిగా ఉండు, సమయాన్ని వృధాగా చెయ్యికు. ఈసారి అయిన ఐ.ఏ.ఎస్ ఎగ్జామ్స్ పాస్ అవ్వు.మేమంతా నీ మీదే నమ్మకం పెట్టుకొనియున్నాము  అని చెప్పి తన పనికి బయలు దేరిపోయారు. అశోక్ అయితే ఎప్పటి లాగానే ఏకాంతములో మొబైల్ ఫోన్లో ఇతరుల యొక్క స్టేటస్, వాట్సాప్, ఫేసుబుక్ యొక్క అప్డేట్ చూచి సమయము వ్యర్థముగా గడిపేవాడు. అతనికి తెలియకుండానే అతని సమయం అంత వృధాగా గడిచిపోయింది. స్కూల్ దినాల్లో చక్కగా తెలివి గలవాడిగా చదివినప్పటికి ఈసారి కూడా ఐ. ఏ.ఎస్ ఎగ్జామ్స్ లో ఓడిపోయాడు. ఇంటి బాధ్యత అంత మరిచిపోయి తనకు దొరికిన ఏకాంత సమయాన్ని చదువు మీద శ్రద్ద చూపించ వలసిన సమయంలో శ్రద్ద చూపించ కుండా వ్యర్థమైన కార్యముల వైపు ఆయన ఏకాంత సమయము గడిపేవాడు. 

రాజుగా ఉండిన దావీదు ఒక రోజు ఒంటరిగా భవనము మీద నడుస్తూ ఉండేటప్పుడు పాపములో పడిపోయాడు. బహిరంగముగా దావీదు దేవుని స్తుతించి రాజుగా హెచ్చించబడ్డాడు, అదే దావీదు ఏకాంతములో దేవున్ని చూడకుండా చుట్టూ చూసి పాపములో పడిపోయాడు. సమ్సోను ఏకాంతముగా ఒక స్త్రీ దగ్గర దొరికిపోయాడు. ఇలాగు మనము నేరుగా పాపములో చిక్కుకొనక పోయినను మొబైల్లో కనబడుతున్న ఒక మాయ లోకమునకు బానిసలుగా మారిపోతున్నాము. ఎక్కడో కంటికి కనబడని స్థలములో సృష్టించబడుతున్న మాయ దృశములకు బానిసలుగా మారిపోతున్నాం. కాని యోసేపు అయితే ఏకాంతములో చూపించిన పౌరుషము ఆయనను గొప్ప విజయము వైపు నడిపించింది.

స్నేహితులరా ఏకాంతములో మీ యొక్క గుర్తు 10 అంకెలు గల ఒక సెల్ ఫోన్ గా మారిపోకూడదు. ఏకాంతములో మనము దేవుని వైపు చూచి ప్రార్ధించుటను అలవర్చుకోవాలి. అంతరంగంలో తండ్రి వైపు చూచి ప్రార్ధించండీ అని యేసు క్రీస్తు ప్రభువు చెప్పినట్లు ఏకాంతములో మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి తండ్రి వైపు చూచి ప్రార్దించి చూడండి, మీ యొక్క బాధ్యతలు మీరు గ్రహిస్తారు. మీ ఏకాంత జీవితము దేవునితో నిండనివ్వండి. దేవుని లేని ఏకాంత జీవితము పాపమునకే మీ హృదయాన్ని నడిపిస్తుంది. మన యొక్క ఒంటరి సమయము దేవునితో గడుపుటకు తీర్మానించుకుందాం అప్పుడే మన ఏకాంతము ఇంపైనదిగా మారుతుంది. కాబట్టి ఈ దినమే తీర్మానం తీసుకుందాం. ఏకాంతములో దేవునితో ఉండుటకు ఆశిద్దాం. 
-    బ్రదర్. టి. శంకర్ రాజన్

ప్రార్థన అంశం:-
మన యొక్క పరిచర్యలో నూతనంగా కలిసిన మిషనరీలు దర్శనంతో కలిసి పనిచేసేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)