Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 17.01.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 17.01.2021 (Kids Special)

త్యాగము యొక్క రూపము:

"అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది" - ఎఫెసీయులకు 6: 3

ప్రియమైన పిల్లలారా! మీకు గిఫ్ట్ అంటే చాలా ఇష్టమే కదా! అవును మీరు మీ తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టే మీరంటే వాళ్లకు చాలా ఇష్టం. అదే సమయంలో మీ తల్లిదండ్రులను మీరు ఎంచుకోలేరు వారిని దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసి ఇచ్చిన బహుమానం. అందుకని వాళ్ళు ఎలాగు ఉండినప్పటికి మీరు వాళ్ళను ఘనపరచినప్పుడు మీ యొక్క జీవితం దీవించబడుతుంది. సరే ఈ రోజు కథను చూద్దామా? 

విఘ్నేశ్ మంచి అబ్బాయి, అతని రెండు కన్నులు కూడా దీపముల వలె ఉంటాయి. మంచి తెలివిగలవాడు. టీచర్ కి మరియు తోటి విద్యార్థులకు ఆయన అంటే చాలా ఇష్టం కాని ఆయన జీవితంలో ఒక పెద్ద సమస్య అతని తల్లికి ఒక  కన్ను మాత్రమే ఉంటుంది కాబట్టి ఆమె యొక్క మొఖం చూడటం అతనికి ఇష్టం ఉండదు. అంత మాత్రమే కాదు ఆమెను ఎక్కువగా ద్వేసించే వాడు. ఆమె ప్రేమతో చేసిన భోజనము, సహాయం ఏవి కూడా అతనిని సంతృప్తి పరచలేదు. మధ్యాహ్నం ఆహారం ఇచ్చుటకు కూడా ఆమె స్కూల్ కి రాకూడదు అని అమ్మతో చెప్పేవాడు. ఆమె కష్టపడి అతనిని చదివించింది. ప్రతి రోజు అతని కొరకు దేవుని యొద్ద కన్నీటితో ప్రార్థన చేసేవారు. 10వ తరగతిలోను, 12వ తరగతిలోను 1st మార్కులు వచ్చాయి. అప్పుడు కూడా తన తల్లి పడిన కష్టమునకు ఘనపరచాలి అనే ఆలోచన కూడా రాలేదు. స్కూల్లో టీచర్ తోనే ఫోటో తీసుకున్నాడు. అతనిని పై చదువులు దేవుని సహాయం ద్వారా చదివించారు అమ్మ. దేవుడు అతని హృదయంతో మాట్లాడటం ప్రారంభించారు. ఒక దినము అతని తల్లి లేని సమయంలో సూట్ కేస్ తీసి అన్ని చూడటం ప్రారంభించాడు. దాంట్లో ఒక పేపర్ అతనిని చాలా కలవరపరచింది. అతని తల్లి తన ఒక కన్నును తన కుమారుడుకు దానం చేసిన మెడికల్ సర్టిఫికెట్ చూసాడు. కన్నీటితో ఏడ్చి దేవుని యొద్ద క్షమాపణ అడిగాడు. ఆ దినము నుండి తన తల్లిని దేవుడు తనకు ఇచ్చిన బహుమానముగా తలంచి ప్రేమించాడు. అంతగా నన్ను ప్రేమించిన అమ్మ ప్రేమకు బదులుగా నేను ఏమి చేయగలను అని చాలా బాధపడ్డాడు. తన తల్లి యొక్క చివరి దినము వరకు తనతో పెట్టుకొని ప్రేమగా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. 

ప్రియమైన తమ్ముడు, చెల్లి నీ కొరకు నీ తల్లి చేస్తున్న త్యాగము చాలా ఎక్కువ. నిన్ను కడుపులో మోసిన దినములు, నీ బాల్యము, నీవు శరీరము అనారోగ్యంతో బలహీనంగా ఉన్న దినములు ఇలా నీ కొరకు సుఖమును త్యాగం చేసి యున్నారు. కాబట్టి ఏ విధముగా కూడా వాళ్ళను ఆశ్రద్ద చేయకూడదు. రుచికరమైన మధ్యాహ్న బోజనము కొరకు మీరు కృతజ్ఞత చెప్పాలి , అమ్మ చేసిన అన్ని పనులకు మీరు కృతజ్ఞత చెప్పాలి. తల్లిదండ్రులను ఘనపరిస్తే  యేసయ్యకు నీవు చాలా ఇష్టమైన వాడిగా మారతావు. ఓకేనా.
-    సిస్టర్. దేబోరా

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)