దిన ధ్యానము(Telugu) 16.01.2021
దిన ధ్యానము(Telugu) 16.01.2021
దేవుని యొక్క నీతి
"ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు" - రోమీయులకు 10: 3
ఒక కార్యము మనుష్యుల యొక్క దృష్టిలో నీతిగా అనిపించవచ్చు కాని దేవుని యొక్క నీతి దానికి భిన్నంగా ఉంటుంది. బైబిల్ ప్రకారము కొన్ని సంఘటనలు ఈ దినము ధ్యానిద్దాం.
బాబెలు గోపురము (అదికాండం 11:4): బాబెలు అనే ఆకాశమంత గోపురము కట్టాలి అని ప్రజలు నిర్ణయించారు. కారణం తమకు పేరు కలగాలి అని, చెదిరిపోకుండా ఉండుటకు, నాశనం వచ్చినప్పుడు ఒకరినొకరు కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క కోరిక, ఆశయాలను నెరవర్చుకోవడానికి ప్రణాళిక వేశారు. తాము చేస్తున్నది సరైనది అని తలంచారు. దేవుని యొక్క నీతి ప్రజలు ఒకే స్థలంలో ఉండకుండా భూమియందంతట కుడా వ్యాపించాలి అనేదే. కాబట్టి వారి యొక్క భాషలు తారుమారు చేసి వారిని చెదరగొట్టారు.
మందసము (2సమూయేలు 6:7): దావీదు మందసమును యూదా నుండి తీసుకువస్తున్న సమయములో ఎద్దులు బెదురుతున్నాయి వెంటనే మందసము పడిపోతుందేమో అని ఉజ్జా తన చేయి చాపి పట్టుకుంటున్నాడు. ఇక్కడ ఉజ్జా తాను చేస్తున్నది సరైనదేనని తలంచుతున్నాడు. కాని దేవుని యొక్క నీతి అధికాదు యాజకులు మాత్రమే మందసమును తాకాలి, దానిని మోసుకొని రావాలి అన్నదే దేవుని యొక్క ప్రమాణము. కాబట్టి ఆ స్థలములోనే దేవుడు ఉజ్జాను మొత్తెను ఆయన మరణించెను.
వ్యబిచారములో పట్టబడిన స్త్రీ (యోహాను8: 4): వ్యభిచారములో పట్టబడిన వాళ్ళను రాళ్లు రువ్వి చంపాలి అనే శాస్త్రులు , పరిసయ్యులు తలంచారు. వారు తమయొక్క స్వనీతి వలన ఆ విధముగా చేయాలి అని తలంచారు. కాని దేవుని నీతి అయితే వారి వలె కాక వ్యబిచారము చేత పట్టబడిన స్త్రీ క్షమించబడాలి అనేదే దేవుని నీతి. మీరు దేవుని నీతిని గ్రహించుట లేదు కాబట్టి వారు తమ స్వనీతి నెరవేర్చుటకు చూసి దేవునికి వ్యతిరేకముగా నిలబడుతున్నారు.
ఇలాగుననే మనము సమస్యలు వచ్చిన సమయములలో వారివారి యొక్క కార్యములే సరి అని సాదించుటకు పట్టు పడుతున్నాము. లేదా మన యొక్క అనుభవములను పెట్టి కార్యములు నెరవేర్చుటకు చూస్తున్నాము. కాని దీంట్లో దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క కార్యం ఎలావుంటుంది, దేవుని యొక్క నీతిని మనం గ్రహించలేదు. కాబట్టి కొన్నిసార్లు లోబడుటకు కుదరలేదు. దేవుని యొక్క నీతిని మనం బైబిల్ వాక్యముల నుండే నేర్చుకోవచ్చు. అవును బైబిల్ శ్రద్ధగా చదివి లోబడుతున్న వారి జీవితం స్వనీతితో కాదు దేవుని నీతితో నిండి ఉంటుంది.
- ఎస్. గాంధీ రాజన్
ప్రార్థన అంశం:-
వి.ఏం.ఏం పరిచర్యతో కలిసి పనిచేసే వాలింటీర్ సేవకుల గురించి ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250