Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 15.01.2021

దిన ధ్యానము(Telugu) 15.01.2021

బ్లాక్ కాఫి:

"ఈమె తన శక్తికొలదిచేసెను" - మార్కు 14:8

కోన్ని సంవత్సరాల క్రితము శివగంగై జిల్లాలో వ్యాన్ మినిస్ట్రీ కొరకు టీమ్ గా వెళ్లి యున్నాము. ప్రతి గ్రామానికి చేరుకున్నప్పుడు కరపత్రికలు ఇచ్చి చిన్నపిల్లల పరిచర్య చేస్తువున్నాము. పరిచర్య ముగించి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో చిత్ర అనే ఒక సహోదరి తన ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని కోరారు. మాలో కొందరు తన ఇంటికి వెళ్లి ప్రార్ధించాము. మాకు ఆ ఇంటి వాళ్ళు ఇచ్చిన ఆతిధ్యం ఎన్నడు మరువలేనిది. దాంట్లో ప్రముక్యంగా కాఫీ, జంతికలు ఎక్కువగా మాకు ఇచ్చారు. మేము బయలుదేరినప్పుడు నాతో ఈ మార్గంలో వచ్చినప్పుడల్లా  మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని సహోదరి చిత్ర ఇంటి వాళ్ళు నాతో అన్నారు. మేము తరుచుగా ఆ గ్రామాన్ని ఫీల్డ్ గ్రామముతో కలుపుకొని ప్రతి వారం వెళ్లే వాళ్ళము. అక్కడ ఒక సుందరమైన దేవుని మందిరము ఇప్పుడు కట్టబడియుంది.

యేసు క్రీస్తు పరిచర్యకు వెళ్లే మార్గములో బేతనియలో సీమోను ఇంటికి వెళ్లిన దానిని చదువుతున్నాం. అక్కడ ఒక స్త్రీ విలువగలిగిన అత్తరును యేసయ్య కొరకు ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరి కంటే తన యొద్ద ఉన్న విలివకలిగిన దానిని దేవుని కొరకు ఖర్చు పెట్టిన ఆ స్త్రీ గురించి యేసుక్రీస్తు మంచి సాక్ష్యం ఇస్తున్నారు.

పైన చెప్పబడిన రెండు సంఘటనలో కూడా ఆ సహోదరీలు తమ యొక్క కొరతలోనుండి కూడా తాము చేయగలిగిన కార్యములను చేసి దేవున్ని మహిమపరిచారు. దానిని మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ చేతిలో మిగిలియున్న  దానిని దేవునికి ఖర్చు పెట్టమని కాదు. సారెపతి విదవరాలు ఇంటికి వెళ్లి తన యొద్ద ఉన్న చివరి పిండితో చేసిన అప్పము కూడా దేవుని కోరకు అనగా పరిచర్య కొరకు ఇచ్చుటయే దేవుడు కోరుకుంటున్నారు. "ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను" (మార్కు 14: 8) అనే మరియొక సాక్ష్యం మీరు పొందిన వారిగా ఉండవచ్చుకదా.
-    బ్రదర్. పి.జాకబ్ సంగర్

ప్రార్థన అంశం:-
గడిచిన నెల అంతా క్రీస్తు జన్మ సువార్తను ప్రకటించాము విన్న ప్రతి ఒక్కరి హృదయంలో క్రీస్తు జన్మించేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)