Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 14.01.2021

దిన ధ్యానము(Telugu) 14.01.2021

విశ్వాస పరీక్ష.

"...అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును" - 1పేతురు 1:7

1831 వ సంవత్సరం మార్చి 7వ తారీఖు జార్జ్ ముల్లర్ యొక్క జీవితంలో ఆ దినము ఒక మహా శోధన వంటి దినమే. అదినము ఆయన యొక్క ఆశ్రమమునకు ఒక పెద్ద అవసరత వచ్చింది. ఆ అవసరత గూర్చిన కలత ఆయన యొక్క హృదయంలో ఉంది. ఆ గ్యాప్ లో దూరిన సాతాను జార్జ్ ముల్లర్ వైపు చూసి " ఇప్పుడు నీవు ఏమి చేయబోతున్నావు?  ఇది ఎలాగూ సాధ్యము?"  అని హేళనగా అడిగాడు. వెంటనే ముల్లర్ తనకు ఉన్న అవసరతలు దేవుని ఎదుట పెట్టి ప్రార్ధించి విశ్వాసముతో లేచారు. వెంటనే తన మనసులో గొప్ప సమాదానాన్ని పొందుకున్నారు. అదినమే సాయంకాలం అయ్యేలోపు దేవుని చేత ప్రేరేపించబడిన ఒక ధనవంతుడు బంగారు నాణెములను తెచ్చి అతనికి కానుకగా ఇచ్చారు. తన అవసరతలు అన్ని తీర్చబడే అంతగా అవి  సరిపోయింది. ఇది ఎలాగూ సాధ్యము అని సవాల్ చేసిన సాతానును తరిమికొట్టుటకు ఆయన వాడుకున్న ఆయుధము విశ్వాసమే.

పరిశుద్ధ బైబిల్లో మనం చూస్తునప్పుడు ఉజు దేశస్తుడైన యోబు యదార్ధ వంతుడుగాను, నీతిమంతుడుగాను, దేవునికి భయపడి పాపమును విడిచిపెట్టే వాడిగా దేవుని నుండి మంచి సాక్షము పొందుకుంటున్నారు. ఆ యోబును పరీక్షించుటకు ఆయన పిల్లలను, , పశువులను, గొర్రెలు, గాడిదలు అన్నింటిని కూడా సాతాను  తీసేసుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుని మీద విశ్వాసము పెట్టి దేవుడు ఇచ్చారు, ఆయనే తీసుకున్నారు అని చెప్పి తన విశ్వాసము యొక్క దృఢత్వము చూపించారు. దీని మూలంగా కోల్పోయిన అంతటిని  కూడా రెండంతలుగా యోబు పొందుకున్నారు.

మన జీవితంలో కూడా సాతాను అనేక సందర్భాల్లో శోధనలు పెట్టినప్పుడు అటువంటి శోధనలు మనము ఎలాగూ జయించగల్గుతున్నాం. విశ్వాసపు మాటలను చేత పట్టుకొని జీవిస్తున్నమా లేక నిరుత్సాహ పడిపోతున్నమా? మన సమస్యలు ఎంత అని దేవునీతో  చెప్పుకొనే దానికంటే మన దేవుడు ఎంత పెద్దవారో అని మనం సమస్యతో చెప్పాలి. అబ్రాహాము వలె, యోబు వలె, జార్జ్ ముల్లర్ వలె విశ్వాస యోధులుగా ఉండండి, విశ్వాసము వలన విజయం సాదించండి. అప్పుడు సమస్య మిమ్మల్ని విడిచి పారిపోవును.
-    శ్రీమతి. ఎస్తేర్ గాంధీ రాజన్

ప్రార్థన అంశం:-
మన పరిచర్య రక్షించబడిన చిన్నారులు, యవ్వనస్తులు ఈ నూతన సంవత్సరంలో దేవునిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో నిలిచి యుండేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)