దిన ధ్యానము(Telugu) 13.01.2021
దిన ధ్యానము(Telugu) 13.01.2021
అప్డేట్ అయ్యారా?
"...మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను" - రోమీయులకు 16: 19
మనం జీవిస్తున్న ఈ కాలములో ట్రెన్డింగ్ అనే పదము చాలా ఎక్కువుగా వింటున్నాం. ఒకసారి నేను కొడైకెనాల్ చలి గల ప్రాంతమునకు వెల్లియున్నాను. అక్కడ ఒకాయన ఐస్ ముక్కలతో నిండిన బకెట్ ను తీసుకొని తన తలపై పోసుకొని ఆ కొడైకెనాల్ చలిలో వణుకుతున్నారు. దానిని ఆయన యొక్క స్నేహితులు ఉత్సాహంగా వీడియో తీస్తున్నారు. ఏమిటి అని అంటే అది ఐస్ బకెట్ చాలంజె (ice bucket challenge) అనియు ప్రస్తుతం ఇది ట్రెండ్ ఇది మీకు తెలియదా అని హేళనగా చూసారు.
కాని నిజం ఏమిటి అంటే ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటే నరముల రోగములకు అవగాహన (మేల్కొలుపు) గురించి ఏర్పరచబడింది. ఆ రోగము చేత బాధింపబడుతున్న వాళ్ళ కోసం డోనేషన్ కొరకు 6 సంవత్సరాలు ముందు వాడబడిన విధానం అది. కాని ప్రస్తుత కాలంలో అది ఒక ఆటగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు దేనికొరకు చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుత కాల యవ్వనస్తులు. వాళ్ళ దృష్టికి వారు అన్నీ ఎరిగిన అప్డేటెడ్ జ్ఞానులు అని అనుకుంటున్నారు. దానిని ఎరుగని వారు మూర్ఖులు అనే మాట మనలను కూడా నిరుత్సాహ పరచవచ్చు. కాని నా ప్రియ యవ్వన తమ్ముడు చెల్లి మీరు లోకంతో కలిసి జీవించుటకు పిలువబడలేదు. మారుగా మేలుకు జ్ఞానిగాను, కీడుకు అమాయకునిగాను ఉండాలి అని బైబిల్ చెబుతుంది. అయినప్పటికీ దేవుని పిల్లలైన మనము అనేక కార్యముల గురించి అప్డేట్ అవ్వలేదే అని బాధపడవద్దు. పరిశుద్దత్మ దేవుని సహాయంతో బైబిల్ ను దివారాత్రులు ధ్యానించిన వ్యక్తిగా మీరు ఉంటున్న పక్షంలో ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులు మాత్రమే కాదు సృష్టి మొదలుకొని ముగింపు వరకు జరగబోయే వాటిని మీరు గ్రహించే జ్ఞాని అని మార్చిపోవద్దు.
ఈ లోకం తీవ్రతతో వెంబడిస్తుంది, మోడ్రన్, ట్రెండ్, స్టైల్ అని తమ యొక్క నడక, వస్త్రధారణ, మాట విధానము అని అన్నింటిలో నూతన విధానము చేస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న కార్యములు అన్నీ కూడా ఇప్పుడు ఫ్యాషన్ అని పిలువబడుతుంది. మనమైతే ఈ లోకనుసారమైన మార్గములో కాదు మేలైన దేవుని భక్తిలో దేవున్ని ఇష్టపరిచే కార్యములలో జ్ఞానులుగా ఉందాం. ఈ 2021వ సంవత్సరంలో, నశించిపోతున్న లోకానికి కాదు ఎప్పుడు అప్డేటెడ్ గా ఉంటున్న దేవుని మాటకు ప్రాధాన్యత ఇద్దాం.
- శ్రీమతి. జెస్సి అలెక్స్
ప్రార్థన అంశం:
ఒడిశాలో నూతనంగా కట్టబడియున్న అలయములో గల విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం గురించి ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250