Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 11.01.2021

దిన ధ్యానము(Telugu) 11.01.2021

లెమ్ము లెమ్ము

"ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున" - హెబ్రీయులకు 12: 1

నిరుత్సాహంతో తన జీవితంలో ఏర్పడిన అపజయములు, పడిపోయిన పరిస్థితిని ఆలోచిస్తూ కూర్చున్నారు తరుణ్. ప్రభువు కొరకు రోషంకలిగి జీవించాలి అనే తపన ఒక వైపు ఆయనకు ఉండినను ఏమి చేయలేని పరిస్థితి ఆయనను నిరుత్సాహ పరుస్తూ వచ్చింది. అప్పుడే ఇంటి ఒక మూలలో ఉండిన సాలిపురుగు మీద తన దృష్టి పడింది. ఆ సాలిపురుగు తన వలను తయారు చేయడంలో క్రింద పడి లేస్తు అల్లుతున్న ప్రయత్నం లో తాను పట్టుదలతో పనిచేస్తున్న దానిని చూసారు అరుణ్. ఎన్నో సార్లు క్రింద పడినప్పటికి నిరుత్సాహ పడిపోకుండా తన వలను అల్లుతూ ఉండటం చూసి ఇతను ప్రోత్సాహించబడ్డారు. 

మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా పడుట లేచుట అనే పరిస్థితులు రావచ్చు కాని కలత చెందవలసిన అవసరం లేదు. బైబిల్లో మోషే యొక్క జీవితమును చూసిన యెడల ప్రారంభంలో కోపంతో ఐగుప్తీయుడను చంపి పాతిపెట్టారు మోషే. హత్య చేసే అంత కొపిష్టిగా ఉండిన మోషేను దేవుడు అరణ్యములో 40సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించే గొప్ప బాధ్యతను దేవుడు మోషేకు ఇచ్చారు. ఇశ్రాయేలీయులు కూడా 40 సంవత్సరాలు అనుదినము మోషేను రెచ్చగొడుతూ కోపగించే విధముగా మాట్లాడారు. కాని మోషే అయితే సాత్వికముతో ప్రవర్తించారు. ఏ కోపము ఆయనకు బలహీనతగా ఉండేదో దాంట్లో జయము పొంది ప్రభువు యొక్క మెప్పును కూడా పొందుకున్నారు. భూలోకములో సాత్వికుడు అని దేవుడే అతనిని మెచ్చుకున్నారు కదా. 

అవును ప్రియమైన వారలారా!  మీరు కూడా తరుచుగా పడుతూ లేస్తూ ఆత్మీయ జీవితంలో దిగజరుతున్నారా. దానికి గల ప్రాముఖ్యమైన కారణం కోపము.  సాధారణంగా మనకు కోపము ఎందుకు వస్తుంది నేను చేసేదే సరి దానిని అందరూ అంగీకరించాలి అనే గర్వము మనలో దాగి ఉండుటయే కోపముకు గల కారణం. మనలో అనేకులు త్వరగా పడిపోయి తడబడతానికి ఈ కోపమే కారణముగా ఉంటుంది. దీనిని నేను మార్చుకో లేకపోతున్నానే అనే బాధపడుతున్నారా? చింతించవద్దు బైబిల్ చెబుతున్న సలహా ప్రకారము దీనత్వమును ధరించుకొనుడి. ప్రార్ధనతో సహనం కలిగి ఉండండి. మోషేను మార్చిన దేవుడు మిమ్మల్ని మారుస్తారు. మిమ్మల్ని తడబాటు చేసే బలహీనత ఏదైనా ఉండనివ్వండి దాంట్లో దేవుని సహాయముతో మీరు విజయాన్ని సాధిస్తారు. 
-    బ్రదర్. అరున్ అయ్యప్పన్

ప్రార్థన అంశం:-
ప్రార్థన గుడార కట్టడ పనులు త్వరగా పూర్తి అయ్యేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)