Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 10.01.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 10.01.2021 (Kids Special)

అవసరమైనది ఒక్కటే.
 
"మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొ నెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను" - లూకా 10: 42

కొత్త రాజు ఒకాయన దేశమును పరిపాలించుటకు బాధ్యతను స్వీకరించారు. తన రాజ్యంలో అన్ని కార్యములను క్రమముగా ఏర్పరిచారు. తన మనస్సులో ఒక నిర్ణయం చేసుకున్నారు. నాకు సమయం దొరికినప్పుడల్లా దేశంలో ప్రాముఖ్యంగా వీధుల్లో ఉన్న పేద వారికి నేనే స్వయంగా సహాయము చేస్తాను అని నిర్ణయం తీసుకున్నారు. ఆలాగు వెళ్తున్నప్పుడు చినిగిపోయిన వస్త్రముతో, నూనెను ఎన్నడు చూచి ఉండని తల, ఆహారం లేకపోవడం వలన శరీరం సన్నబడిపోయి, చేతులు, కాళ్ళ పైన పుండ్లుతో నిండిపోయి చేతులు చాపి కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఆయన దగ్గరకు వెళ్లి నేను నీకు ఏమి సహాయం చేయాలి అని అడిగారు రాజు. 

ఆ మనిషి ఆ మాట విన్న వెంటనే ఒక్క నిమిషం తన పరిస్థితి గ్రహించిన వాడిగా అయ్యా మీతోనే నేను ఎప్పుడూ ఉండాలి అని అడిగాడు. వెంటనే రాజు అతనిని తన రధములో కూర్చుండబెట్టి తన భవనమునకు తీసుకు వచ్చి పనివాళ్లను పిలిపించి ఈయన యొక్క తల వెంట్రుకలను కత్తిరించి, స్నానం చేయించి అతనికి ఉన్న పుండ్లుకు మందులు రాయమన్నారు. రాజుగారి భవనంలో ఈయన ఉండుటకు ఒక స్తానం సిద్ధపరచండి అని ఆజ్ఞపించారు. 

పనివాళ్ళు అందరికి ఒకటే ఆశ్చర్యం ఏమిటి ఇతనికి ఇంత ఘనత ఎలా వచ్చింది అని అందుకు ఆ వ్యక్తి నన్ను వెతుకుతూ ఇప్పటివరకు ఎవరు రాలేదు. నేను అనేకులు యొద్దకు వెళ్లి మోసగించబడి తిరిగివచ్చాను. కాబట్టి నన్ను వెతుకుతూ వచ్చిన ఈయన యొక్క హృదయాన్ని నేను అర్ధం చేసుకొన్నాను అందుకొరకే నేను ఆయనతో ఉండాలి అని అడిగాను ఆయన నన్ను అంగీకరించారు అని అన్నారు. అందుకు పనివాళ్ళు మనము కూడా రాజ భవనంలోనే పని చేతున్నాం కాని ఎన్నడు మనము రాజుతో ఉండాలి అని అడగలేదే కాని ఇతనికి ఆ భాగ్యం దొరికిందే అని పరిస్థితి గురించి చింతిస్తున్నారు. 

ప్రియమైన పిల్లలు! మనము చర్చ్ కి వెళ్ళవచ్చు, ప్రార్ధించ వచ్చు, బైబిల్ చదవ వచ్చు కాని యేసయ్యతో ఉండుటకు ఇష్టపడి ఆయనను అడిగిన యెడల తన రక్తంతో మనలను కడిగి, రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేసీ మన పాపము అంతటిని కూడా తీసివేసి ఆయనతో ఉండుటకు అర్హతగలిగిన వ్యక్తిగా మార్చుతారు. కాబట్టి ఈ దినమే అడుగుదామా?
-    సిస్టర్. దేబోరా

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)