దిన ధ్యానము(Telugu) 09.01.2021
దిన ధ్యానము(Telugu) 09.01.2021
"మారుతున్న మనుష్యుడు"
"నరులను ఆశ్రయించి... తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు" - యిర్మియా 17: 5
ఆర్ధికంగా మిక్కిలి కష్టంలో ఉంటున్న చెల్లికి సహాయము చేస్తాను అని చెప్పారు అక్క. చెల్లి కుమార్తె యొక్క వివాహము కొరకు ఒక లక్ష రూపాయలు వడ్డీ లేకుండా సహాయము చేస్తాను దానిని నీవు ఎప్పుడైనా నాకు ఇవ్వవచ్చు అన్నారు. అద్భుతరీతిగా మంచి వరుడుతో వివాహము నిశ్చయించబడింది. పూర్తి నమ్మకంతో సహాయం కొరకు అక్క ఇంటి ముందు నిలబడ్డారు చెల్లి. అప్పుడు ఉన్న పరిస్థితిలో నేను అలా చెప్పాను ఇప్పుడు అంత డబ్బులు నా దగ్గర లేవు అని చేయి విడిచారు. కారణములు అనేకములు చెప్పినప్పటికి చెల్లి యొక్క హృదయంలో గొప్ప నిరుత్సాహం. కరోనా కాలము కాబట్టి ఎక్కువ మందిని పిలవకుండా సింపుల్ గా వివాహము జరిపించారు. అవును మనుష్యుల యొక్క ప్రేమ, వారి యొక్క ఆలోచన ఒక దినము మారిపోతుంది. ఎందుకు బైబిల్ లో కూడా ఒక గంటలో మారిపోయిన మనుష్యుల గురించి వ్రాయబడి ఉంది వాళ్ళు ఎవరో చూద్దామా!
పౌలు యొక్క నావ ప్రయాణములో ఏర్పడిన అసాదారణమైన పరిస్థితి వలన అనేక రాత్రి, పగలు నిద్ర, ఆహారం లేకుండా ఆ నావలో ఉన్న వారంతా నిరుత్సాహ పడిపోయి వారంతా కూడా మెలితా అనే దీవినకు వచ్చారు. మునుపు ఎన్నడు వెళ్లని, ఎరుగని ఆ దీవి ప్రజలు వాళ్లకు చూపించిన ప్రేమ ఇంత అంత కాదు. అదే సమయంలో కురిసిన వర్షం మరియు చలి వలన కట్టెలును సమకూర్చి మంట పెట్టి వాళ్ళను దరి చేర్చు కున్నారు. పౌలు కట్టెలును తీసి ఆ అగ్నిలో వేస్తుండగా ఒక సర్పము అతని చేతిని కరిచింది. దానిని చూచిన ఆ దీవి ప్రజలు వీడు హంతకుడు అనే దాంట్లో సందేహం లేదు ఎందుకంటే సముద్రం నుండి తప్పించుకోనినాకు విధి ఈయనను విడువలేదు అన్నారు. కాని పౌలునకు ఎలాంటి అపాయము కలుగకపోవడం చూచి ఈయనే దేవుడు అన్నారు. చూడండి ఇదే మనుష్యుని యొక్క ఆలోచన. మనలను వాళ్ళ తలపై పెట్టుకొని కొనియాడుతున్న ప్రజలే మనలను క్రింద వేసికూడా త్రొక్కిన అందులో ఎంత మాత్రము ఆశ్చర్య పడవలసిన పని లేదు.
ప్రియమైన వారలారా! మనుష్యుల యొక్క మనస్సు మారుతుంది కాబట్టి మనుష్యులను నమ్మి దేవున్ని రెండవ స్థానంలో పెట్టేయకండి. మనుష్యుడు మనలను వాడుకొని విడిచిపెడతారు నలగగొడతారు. కాని దేవుడు అయితే మనలను నలగగొట్టి వాడుకుంటారు. మనుష్యులు తమకు ఏదైనా మేలు దొరుకుతుందా అని ఇతరులతో సంభందం పెట్టుకుంటారు. కాని దేవుడు అయితే మనకు మేలు చేయుటకు మనలను వెతుకుతున్నారు. అర్హత గల వారిని మనుష్యుడు వెతుకుతూ ఉంటాడు కానీ దేవుడు అయితే అర్హత లేని వాళ్ళను వెతికి తన కృపను కుమ్మరించి వాళ్లను అర్హత కలిగిన వారిగా చేస్తారు. పరిస్థితుల బట్టి మనుష్యుడు మారిపోతాడు కాని దేవుడు ఎన్నడు మారని దేవుడుగా ఉంటున్నారు. మీరు ఎవరిని నమ్మబోతున్నారు? మారిపోయే మనిషినా? మారని దేవున్నా?
- బ్రదర్. అరుణ్ అబెల్
ప్రార్థన అంశం:-
బైబిల్ కాలేజీలో నేర్పించే ఉపాధ్యాయులను దేవుడు తన విశేషమైన జ్ఞానముతో నింపి వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250