
దిన ధ్యానము(Telugu) 04.01.2021
దిన ధ్యానము(Telugu) 04.01.2021
దేవుడు అనుగ్రహించిన బైబిల్
"నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను" - కీర్తనలు 119:97
సంఘ చరిత్ర యొక్క సంస్కరణ కర్తగా పిలవబడుతున్న మార్టిన్ లూథర్ ఒక మారు విశ్వవిద్యాలయంలో గల లైబ్రేరికి వెళ్లారు. అక్కడ లాటిన్ భాషలో ఒక బైబిల్ చూసారు. అప్పుడు వరకు సువార్తలు అయిన మత్తయి, మార్కు, లుకా, యోహాను మాత్రమే దేవుని మాట అని తలంచే వారు. కాని అక్కడ ఉన్న పూర్తి బైబిల్ చూసిన వెంటనే మిక్కిలి ఆశ్చర్యంతోను ఆ బైబిల్ చదివి ఆనందించారు. తరువాత విటన్ బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా బాధ్యతా తీసుకున్న తరువాత బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి, కీర్తనలు, సువార్త బాగములు, పత్రికలు అని అన్ని బాగములలో నుండి ప్రసంగించడం ప్రారంభించారు. ఆయన యొక్క ప్రసంగం అనేకులను ఆకర్షించింది. సత్యాన్ని సత్యముగా బోధించారు. పాపా క్షమాపణ పత్రాన్ని కొనకుండా రక్షకుని వైపు మాత్రమే తెరి చూడాలి అని బెల్జియం, ప్రాన్స్, జర్మనీ, స్విజార్లాండ్, హలాండ్ , స్పైన్, ఇంగ్లాండ్, వంటి దేశాల్లో సత్యాన్ని ప్రకటించి వచ్చారు. దీని ద్వారా లూథర్ గొప్ప సంస్కరణను ప్రజల మధ్యలో ఏర్పరిచారు. ప్రజలు సంపూర్ణ బైబిల్ ను చదవడం ప్రారంభించారు.
దేవుని వాక్యమే మన జీవితంలో నిజమైన విడుదలను తీసుకురాగలదు. అవును వాక్యమే మన జీవితంలో గల భయము నుండి, వ్యర్థమైన మూఢనమ్మకముల నుండి మనలను విడిపిస్తుంది. కాని బైబిల్ వాక్యము ధైర్యముగా అగ్నిలో విసిరివేసిన రాజు గురించి యిర్మీయా గ్రంధంలో యిర్మీయా 36:23 లో చూడగలం. రాజునకు బైబిల్ వాక్యము చదివి వినిపించినప్పుడు హృదయము నొచ్చుకున్న వాడిగా తన వస్త్రములను చింపుకొని మారుమనస్సు పొందిన వాళ్ళు కూడా కలరు.
ప్రియమైన వారాలరా! మనం బైబిల్ కి ప్రాముఖ్యత ఇద్దాం. ఈ నూతన సంవత్సరంలో బైబిల్ ను శ్రద్ధగా చదివి ధ్యానించడానికి తీర్మానం తీసుకుందాం. మనము కొన్ని పుస్తనములను రుచి చూడాలి, కొన్ని అలానే మింగివేయాలి, బైబిల్ ను మాత్రం మెల్ల మెల్ల గా నమిలి దానిని అరిగించుకొని లోపలకు తిసుకోవాలి. కచ్చితంగా దేవుని వాక్యములు మనలను ఆయన మార్గములో నడిపిస్తూ, ఆదరణ కలిగిస్తూ, సలహా చెబుతుంటుంది, మనలను ధైర్య పరుస్తూ , నిరీక్షణను ఇస్తుంది. బయములను వెళ్లగొట్టి మనలను నిత్యజీవితమునకు నడిపిస్తుంది. ఈ దినమే మీరు ప్రారంబించియున్న బైబిల్ ప్రయణములో ఈ సంవత్సరం అంత కొనసాగించుటకు నేను మిమ్మల్ని ప్రోత్సాహిస్తున్నాను.
- శ్రీమతి. సరోజా మోహన్ దాస్.
ప్రార్థన అంశం:
యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ అనే సోషల్ మీడియా ద్వారా వస్తున్నా అనుదిన ధ్యానము అనేకులకు చేరుకొనేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250