
దిన ధ్యానము(Telugu) 01.01.2021
దిన ధ్యానము(Telugu) 01.01.2021
సంరక్షించే యేసు.
"కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు" - యెషయా 25: 4
అమెరికా దేశమునకు చెందిన ఒక గొప్ప కోటీశ్వరుడుకి మరణ భయము మొదలైంది. ప్రపంచ యుద్ధం ఏర్పడి తన పట్టణములో అణు బాంబులు వేసిన యెడల ఏమి చెయ్యాలి అని కలత చెందారు. కాబట్టి ఆ బాంబు నుండి తనను తన కుటుంబమును కాపాడు కొనుటకు భూమిలో అణు బాంబు కదల్చలేని ఒక ఇల్లు కట్టాలి అని నిర్ణయించుకున్నారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అందరూ కలిసి అణుబాంబు కూడా ఏమి చెయ్యలేని ఇంటిని భూమి లోపల కట్టి ముగించారు.
ఆ ఇంటిని ప్రతిష్టించుటకు దేవుని దాసుడైన మారిస్ సెలులో పిలిపించారు. ప్రతి గదిలోను వారు వాడిన సామాగ్రిని అణుబాంబు కూడా ఏమి చెయ్యలేదు అని ప్రతి గది కొరకు గొప్పగా గర్వంగా మాట్లాడుతూనే ఉన్నారు. బోధకుడు అన్నింటిని విని దీనికంటే మిక్కిలి తక్కువ ఖర్చుతో దాగుచోటును తయారు చేసియున్నాను దాంట్లో సంపూర్ణ సంరక్షణ కలదు అన్నారు. దానిని రెక్కలతో కట్టినట్టుగా చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగిన దృష్టితో ఆ కోటీశ్వరుడు అతని వైపు చూసారు. వెంటనే ఆ బోధకుడు (కీర్తనలు 91:4) తెరచి చూపించారు. ఎలాగు తాను మహోన్నతమైన చాటున దాక్కొని ఉండి ఆయన రెక్కల నీడలో ఎలాగు దాచబడి ఉన్నానో అన్నది ఆ బోధకుడు వివరించగా ఆ కోటీశ్వరుడు ఆశ్చర్యపోయాడు. బైబిల్ గ్రంధంలో కూడా యోబు అనే భక్తుడు గురించి చదివినప్పుడు ఆయన మార్గములు దేవునికి ప్రియముగా ఉండినందు వలన దేవుడు తనని తన కుటుంబాన్ని ఆయన సంరక్షిస్తున్నారు మరియు యోబు దేవుని మీద ఆనుకొనినందు వలన దేవుడు అతనికి ఉన్న సంపదను కంచ వేసి సంరక్షించారు అని వ్రాయబడి ఉంది.
ప్రియమైన వారలారా! క్రిందటి సంవత్సరం అంత కూడా అనేక విధములైన ప్రమాదములు, రోగముల చేత డబ్బులు అన్ని ఖర్చు చేసి నా కుటుంబానికి ఏమి చెయ్యలేకపోయానే అని నిరుత్సాహ పడుతున్నారా? మిమ్మల్ని చూసి యేసుక్రీస్తు చెబుతున్నారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమస్త కీడు నుండి, రోగములనుండి సంరక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఆయన హస్తములో మిమ్మల్ని సమర్పించుకోండి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా దేవుని సంరక్షించే హస్తం మీ కుటుంబం మీద కప్పబడి ఉంటుంది. దేనికి మీరు బయపడి కలత చెందవలసిన అవసరం లేదు.
- బ్రదర్. ఎస్. పి. సంతన పాండి
ప్రార్థన అంశం:
ఈ నూతన సంవత్సరంలో దేవుని హస్తం పరిచర్యలో, ప్రతి కార్యంలో ఉండి బలముగా ప్రత్య క్షమయ్యేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250