Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 31.12.2020

దిన ధ్యానము(Telugu) 31.12.2020

సణుగుకొనవాద్దు:-

"మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి" - 1కోరింథీయులకు 10: 10

గడచిన 2020వ సంవత్సరాన్ని కొంత వెనక్కి తిరిగి చూద్దాం. వాతావరణం మారుతున్నట్లు ఎన్నెన్నో మార్పులు. చదువులు నేర్చుకునే విధానంలో, కుటుంబ ఆర్ధిక పరిస్థితులలో, పరిచర్యలో, పనిలో, వ్యాపారం లో జీవితవిధానంలో ఎన్నో విధాలయిన మలుపులతో సంవత్సరం నిండినది కదా!  జీవించుటకు అత్యవసరమైన నీరు, గాలి, ఆహారం ఈ వరసలో మాస్కు ను కూడా చేర్చ వలసిన పరిస్ధితి. హమ్మయ్య! వివాహము, బంధువుల ఇళ్ళు, స్కూల్,  కాలేజీలకు వెళ్లకుండా ఒక సంవత్సరాన్ని గడిపేసామ్.

సంతోషమైన కార్యాలు, మనము అనుకున్నవన్నీ నెరవేరని కార్యాలు, అనుకున్నవన్నీ జరిగిన కార్యాలు ఇవన్నీ దేవుని యొద్ద నుండి వచ్చినవి. మనం ఆశించని ఈ కాలాలు సాతాను తెచ్చినవి అని సులువుగా చెప్పలేము. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏ అణువు కూడా కదలదు అని గ్రహించి యున్నాం. భిన్నమైన పరిస్థితుల ద్వారా కూడా దేవుడు తమ పిల్లలను నడిపిస్తున్నారు. ఈ కరోనా రాకుండ ఉండి ఉంటే ఈ సంవత్సరం ఎంత ప్రశాంతంగా ఉండియుండేది. నా బిడ్డ యొక్క వివాహము చక్కగా జరిగి ఉండి ఉండేది. నా కుమారుడు 10వ తరగతి పరీక్షలు వ్రాసి మంచి మార్కులు తెచ్చుకొని ఉండి ఉంటాడు అని, అన్నీ సరే! ఒకటి మాత్రం మర్చిపోకూడదు మన తలంపులు దేవుని తలంపుల వంటివి కావు, కాబట్టి దుఃఖమైనా , సంతోషమైనా   ఏదైనా దేవుడు మనలను నడిపించే మార్గంలో సహనంతో నడుద్దాం. ఎలాంటి పరిస్థితిలోనైన మనం ఓపికతో నడుచుకుందాం. 

ప్రియమైనవారలారా! ఆ దినము ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునిని అర్ధం చేసుకొనక అన్ని విషయాల్లో సణుగుకొని దేవున్ని  దుఃఖ పెట్టారు. ఈ దినం మనము ఎలా ఉంటున్నాం. దేవుడు మనలను నడిపించే మార్గం మంచిదే అని గ్రహించి నడుస్తున్నామా? లేదా ఈ సంవత్సరం వ్యర్థంగా ఇలా గడచిపోయిందే చదువు ఇలా పాడైపోయిందే అని మంచి, చెడ్డ తెలుసుకోలేకపోయామే  అని సణుగుకుంటున్నామా?

మీరు అనుకుంటున్నట్లు ఈ సంవత్సరం అంతా కొంత కఠినముగా ఉన్నప్పటికీ  ఇంకను మనం ప్రాణముతోనే ఉన్నాముకదా! ఈ దినం వరకు భుజించుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రమును, విశ్రాంతి తీసుకొనుటకు విశ్రాంతి స్థలము ఇచ్చియున్నారు కదా! ముందుకంటే అత్యధికముగా బైబిల్ ను చదివియున్నాము కదా! ఇతర దేశముల కొరకు ప్రార్ధించి యున్నాం. కాబట్టి  మనము ఎన్నడును దేవున్ని సణుగుకొనకూడదు, సణుగుకొనుట అనే శోధన సాతానుడు తెచ్చి పెడుతూ ఉంటాడు. దాన్ని మన తలంపుల నుండి దూరం చేద్దాం. రాబోయే నూతన సంవత్సరంలో గడచి వచ్చిన దినాలను చూచి కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుణ్ణి స్తుతిద్దాం. 
-    శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్

ప్రార్థన అంశం:
దేవుడు మన వి.యమ్.యమ్ ద్వారా చేయదలచిన కార్యాలను చేసి ముగించుటకు అర్హతగల సమర్పించబడిన సేవకులని ఇచ్చేటట్లు ప్రార్ధిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)