దిన ధ్యానము(Telugu) 09.06.2021
దిన ధ్యానము(Telugu) 09.06.2021
చేయగలమా? చేయగలము.
"...మీ శత్రువులను ప్రేమించుడి" - మత్తయి 5:44
ఒక ప్రసిద్ధి గాంచిన సేవకుడు తరుచుగా కలకత్తా వెళ్తుండేవారు. ట్రైన్ నుండి దిగిన వెంటనే ఆటోవాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు ఎక్కడకు వెళ్ళాలి అని ఆ బ్యాగును పట్టుకొని లాగుతూ ఉండడం ఇతనికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. దానిని దాటి వెళ్తే అడుక్కునే వాళ్ళను అస్సలు భరించలేము. ఈ రెండు గుంపులను చూస్తేనే ఇతనికి టెన్షన్ వచ్చేస్తది.
ఒకసారి ఆయన ట్రైన్ నుండి దిగిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన చేతిలో ఉన్న బ్యాగును పట్టుకున్నాడు. ఆయన అయితే కోపంతో అతని దగ్గర తీసుకొని ముందుకు వెళ్లడం ప్రారంభించారు. కొన్ని అడుగులు ముందుకు వెళ్ళగానే ఆయన కాలు జారి క్రింద పడిపోయి దవడలో దెబ్బ తగిలి రక్తం కారడం ప్రారంభం అయింది. బట్టలు అన్నీ కూడా రక్తంతో నిండి పోయాయి. ఎక్కడి నుండో ఒక చిన్న బాలుడు వచ్చి తన బాటిల్ నీళ్లు అతనికి ఇచ్చాడు. వాటితో అతను తన గాయమును కడుక్కొని చూస్తే ఆ బాలుడు ఒక అడుక్కునే బాలుడు. ఆ సేవకుడికి చాలా కష్టం అనిపించింది. కాదు అని చెప్పిన ఆ ట్యాక్సీ అతను కూడా వచ్చి ఆయనను లేవనెత్తి తన రక్తమును అంత కూడా తుడిచి ఆయన బ్యాగును తీసుకొని తన ట్యాక్సీ లో ఎక్కించు కున్నారు. ఆయన వెళ్ళవలసిన స్థలములోనికి వెళ్లే లోగా చాలా సార్లు సర్ నొప్పి ఎలాగు ఉంది అని అడిగాడు. అతని భార్య కూడా అన్నిసార్లు అడిగి ఉండదు. ఊరు పేరు తెలియని ఈయన ఇంతగా మనలను అడుగుతున్నడే అని తలంచి సేవకుడు కన్నీళ్ళు ఆగలేదు. ఆ దినము నుండి ఆ సేవకుడు కలకత్తా ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు , అడుక్కునే వాళ్ళ కొరకు ప్రార్ధించడం మార్చిపోలేదు.
దీనిని చదువుతున్న దేవుని పిల్లలారా! మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మనం కొందరి గురించి మనం చేదైన తలంపుతో జీవిస్తూ ఉండవచ్చు. అది మన దృష్టిలో న్యాయం అనిపించవచ్చు కానీ ప్రేమాస్వరూపి అయిన దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ఇస్తున్న ఆజ్ఞ లో మీరు, నేను మరియు మనము ద్వేషిస్తున్న వ్యక్తులు కూడా కలిసి పోతారు అని ఆలోచించి చూసారా?
బైబిల్లో అబీమెలేకు, ఇస్సాకును ఆయన కుటుంబాన్ని, తన మనుష్యులను, తన పశువులను తమ యొక్క ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపొమ్మని తరిమి కొట్టినప్పటికి (ఆదికాండం 26:16) అబీమెలెకును ఆయన అధికారులు మరల ఆయన వెళ్ళినప్పుడు విందు చేసాడు (ఆదికాండము 26:30) అని చదువుతున్నాం. ఇస్సాకు తనను తరిమి కొట్టిన వాళ్ళకే విందు చేసినప్పుడు మనలను ఇబ్బంది పెట్టిన వాళ్లని, కఠినంగా మాట్లాడిన వాళ్ళని , కన్నీరు కార్చుటకు కారణమైన వాళ్ళని మనము క్షమించి అంగీకరించకూడదా? మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్ములను హింసించు వారికొరకు ప్రార్ధించుడి అని మాటలతో కాదు చేతలతో జీవితాన్ని చూపించి పరమతండ్రి మాటలప్రకారం జీవిద్దాం అనేకులకు ఆదర్శంగా జీవిద్దాం.
- సహోదరుడు.యల్.అలగరసామి
ప్రార్ధనా అంశం:-
మన సంపూర్ణ మిషనరీలలో ప్రతి ఒక్కరినీ దేవుడు సంరక్షించి, పోషించి, అద్భుత రీతిగా నడిపించాలని ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250