దిన ధ్యానము(Telugu) 08.06.2021
దిన ధ్యానము(Telugu) 08.06.2021
నీకు కలిగిన వాటిని వాడుము:-
"...నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను" - మత్తయి 25:21
ఒక దేశపు రాజుకు ఒక కోరిక కలిగింది తన పొరుగు దేశపు రాజులను అధికారులను పిలిపించి గొప్ప విందు చేయాలని, వాళ్ళను సంతోష పరచాలని , ఆ ఉపచరాణ శ్రేష్ఠమైన దానిగా ఉండాలని విశేషముగా తాను ఇచ్చే టీ రుచి, దానిలో పాల్గొనే వాళ్ళందరూ తమ దేశమునకు తిరిగి వెళ్లినా కూడా దాని రుచిని తిరిగి గుర్తు చేసుకునేవారుగా ఉండాలి అని ఆశించారు. తమ భవనంలో గల టీ వాసన తక్కువగా ఉన్నట్లు తలంచి దేశంలోనే గొప్ప టీ కుండ తయారుచేస్తున్న వాళ్ళ ను కనుక్కోమని తమ సైనికులకు ఆజ్ఞాపించారు రాజుకుడా మారువేషంలో టీ కుండ కొరకు తమ సైనికులతో బయల్దేరారు. దీంట్లో కూడా తృప్తి లేకపోవడం వలన మిక్కిలి నిరుత్సాహముతో ఒక చిన్న గ్రామంలో చెట్టు కింద ఉన్న టీ కొట్టును చూచి టీ కొరకు అక్కడ ఆగారు.
ఆ యవనస్తుడైతే తనను వెతుక్కుంటూ వచ్చినది రాజభవనంలోని మనుష్యులే అని గ్రహించుకున్నాడు. కాని తనయొద్ద చాలినంతగా టీ కుండ లేకపోవడం చూచి ఆలోచించాడు. అయినప్పటికి ఈ అవకాశాన్ని వాడుకుంటే తాను జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలను అని గ్రహించినవాడుగా తమ తోటలోనికి వెళ్ళి కొన్ని వస్తువులను తీసుకొని వచ్చి టీ తయారుచేసి వచ్చిన వాళ్లకు ఇచ్చారు. దాని యొక్క రుచి, సువాసన శ్రేస్ట మైనదిగా ఉండుట రాజు గ్రహించి సంతోషించి ఆయనను అడిగినప్పుడు కొంతమాత్రమే ఉండునట్లు గులాబీ పువ్వులను ఆరెంజ్ తొక్కలను సరైన మోతాదులో కలిపి ఆ టీ తయారు చేసినట్లు చెప్పాడు. తనకు దొరికిన అవకాశాన్ని తన దగ్గరఉన్నవాటిని సరిగ్గా వినియోగించుకొనుట వలన విందులో మాత్రమే కాదు భవనంలోని ఆయనకు మంచి పని దొరికింది.
బైబిల్లో కూడా 5తలాంతులు పొందుకున్నవాడు, 2తలాంతులు పొందుకున్నవాడు వారికి ఎవ్వబనిన వాటిని వాడుకొని పొందుకొని బలమును పొందుకున్నారు. కాని ఒక తలాంతు తీసుసుకున్న వాడు ఏమి చేయకుండ ఉండుట చూచి ఉన్నవాటిని వాడుకోకుండ అశ్రద్ధ చేసి ఉంచేశాడు.
ప్రియమైన వారలారా! మనం కూడా అనేకసమయాలలో దేవుడు మనకిచ్చిన కుటుంబము, ధనము, పదవి, ఆస్థులు, తెలివితేటలు, తలాంతులు వీటన్నింటిగురించి సంతోషించకుండ, తృప్తి చెందకుండ , దేవునికొఱకు వాడకుండ, మనలో ఉన్న లోపాలను తలచుకుంటూ చింతిస్తూ ఉన్నాం. కొందరు దేవుడు నాకు ఇలాంటి మేలు చేసి ఉండి ఉంటే ఇంత ఇచ్చేవాడిని అంత ఇచ్చేవాడిని, దేవునికొఱకు గొప్పకార్యాలు చేసేవాడిని అని కూరగాయల బేరమాడుతూ ఉంటారు. అలాకాదు మనకు దేవుడిచ్చిన కొంచములో మనం యదార్ధముగా ఉండి యదార్ధముగా వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనలను దీవిస్తారు.
- శ్రీమతి.వసంతి రాజమోహన్,
ప్రార్థన అంశం:-
మన మోక్ష ప్రయాణము 8 బాషలలో ముద్రించబడు టకు సహాయం చేస్తున్న తర్జుమా దారులను దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250