దిన ధ్యానము(Telugu) 07.06.2021
దిన ధ్యానము(Telugu) 07.06.2021
ప్రేమించే అగ్ని.
"క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు" - 2కోరింథీయులకు 5:14
రష్యా చెరలో క్రీస్తు సువార్త నిమిత్తముగా కట్టబడిన వారిగా తన జీవితములో 20 సంవత్సరాలు చీకటి గదిలో గడిపారు బిషప్ విక్టర్ ఫిలిక్స్. ప్రతి రోజు సాయంకాలము చిన్న ఎండి గడ్డితో చేయబడిన పరుపు ఆయనకు ఇవ్వబడింది. ఆ గదిలో 7 గంటలు మాత్రమే ఆయన పడుకోనుటకు అనుమతించబడ్డారు. మిగిలిన 17 గంటలు సమయం కూడా ఆయన ఆ చిన్న గదిలో తిరుగుతూ ఉండాలి ఒకవేళ కూర్చుంటే ఆ కాపలా వాళ్ళు వచ్చి కొట్టి హింసిస్తూ ఉంటారు. అలాంటి క్రూరమైన శిక్షను అనుభవించిన తరువాత మరియొక 4 సంవత్సరాలు ప్రపంచంలో బాగా మంచు గడ్డకట్టే స్థలమైన సైబీరియాలో -60 డిగ్రీల సెల్సీయస్ గల ప్రాంతంలో బట్టలు లేకుండా ఆయనకు అక్కడ శిక్ష విధించారు. తనను హింసించిన వాళ్ళ పైన అతనికి వచ్చిన చేదు అనుభవం, ద్వేషం అన్నింటిని కరిగించమని దేవునికి అప్పగించాను కాబట్టి నేను బ్రతికి యున్నాను అని అన్నారు. తన హృదయంలో యేసు మండించిన ప్రేమ అగ్ని వేడి వలనే అతి చల్లని ప్రాంతమైన సైబీరియాలో ఆయన ప్రశాంతంగా ఉండగలిగారు.
బైబిల్లో కూడా రాజైన నెబుకద్నెజరు నిలవబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించని వాళ్ళు మండుచున్న అగ్ని గుండంలో పడద్రోయబడ్డారు. దేవుని మీద పెట్టిన విశ్వాసముతో షద్రక్, మిషాక్, అబేద్నెగోలు అనే వాళ్ళు మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు, ఆయన విడిపించక పోయినను మేము ఆ బంగారు ప్రతిమకు నమస్కరించము అని చెప్పిన వాళ్ళ యొక్క విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. ఆ అగ్ని గుండములో వేయబడినప్పుడు తన వాళ్ళను విడిపించిన దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది.
బంగారము అగ్నితో పరిశోధించ బడుతుంది, దాని కంటే విలువ కలిగిన విశ్వాసము శోధించబడి యేసుక్రీస్తు ప్రత్యక్ష పరచబడినప్పుడు మీకు కీర్తిని, ఘనతను తీసుకువస్తుంది (1పేతురు 1: 7). అగ్నిలో వేయబడినప్పుడు లోహము శుభ్రపరచబడి బలము పొందుకుంటుంది. మనము కూడా శ్రమలలో శోధించ బడినప్పుడు మనము ఎలా ఉంటున్నాం? సమస్యలు, పోరాటాలు మన మీదికి వచ్చినప్పుడు మన మనస్సు విరిగిపోతుందా? లేదా క్రీస్తు ప్రేమలో అనుకోని మన హృదయంలో మండించబడి దేవుని అగ్నితో ప్రాకాశించబడి పరిశుద్ధ పరచబడి విడిపించబడుతున్నామా? ఆలోచించాలి. ఎంలాటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు మీదా గల ప్రేమను మనము విడవకుండా చూచు కోవాలి. క్రీస్తు ప్రేమ యొక్క జ్వాలను మనలో వెలిగింపనివ్వండి. అప్పుడు మనం ఇతరులకు ప్రయోజన కరముగా వెలుగునిస్తాం. ఆమెన్.
- శ్రీమతి. వసంతి రాజా మోహన్
ప్రార్థన అంశం:-
లాక్ డౌన్ కారణం వలన స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటున్న పిల్లల యొక్క భవిష్యత్ గురించి, వాళ్ళ యొక్క సంరక్షణ గురించి ప్రార్ధించండి.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250