Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 06.06.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 06.06.2021 (Kids Special)

 

అందమా? ప్రేమా:-

 

"మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి." - మత్తయి 5:16

 

హలో! పిల్లలు పక్షులంటే మీకు చాలా ఇష్టమే కదా! మీరు ఏ ఏ పక్షులు చూచి యున్నారు చెప్పండి చూద్దాం. నెమలి, చిలుక, గ్రద్ద, కాకి, కొంకే, పావురము, బాతు, ఓహ్! వదిలితే మీరు చెప్తూ ఉంటారుకదా! అవును చిలుక,బాతు,పావురం వీటన్నింటిని ఇంటిలో పెంచుతూ ఉంటాము కదా! వాటితో ఆడుకొని ఉంటారుకదా! ఈ దినం కూడా రెండు పక్షుల మధ్య ఉండిన స్నేహం గురించిన కధ తెలుసుకుందాం.రెడీ యేనా?

 

ఒక అడవిలో చాలా చెట్లు పువ్వులు పూస్తూ చూచుటకు అందమైన పచ్చని రంగులో ఉండేవి. ఆ అడవిలో అనేకమైన పక్షులు జీవిస్తూ ఉన్నాయి. ప్రతి పక్షి కూడా ఒక అందమైన గూడుని కట్టుకొని జీవిస్తూ ఉండేవి. ఆ అడవిలో నీలము రంగులో అందమైన పక్షి ఉండేది. అది తన అందం గురించి ఎప్పుడు గర్విస్తూ ఉండేది. నా వలె మంచి రంగులో అందంగా ఎవ్వరు లేరు అని తరచుగా తన అందాన్ని నీటిలో చూసుకొని నేను ఎంత అందంగా ఉన్నాను అని తనంతట తానే మురిసిపోతూ ఉండేది. తన వలె ఉన్న అందమైన పక్షులతో మాత్రమే స్నేహం పెట్టుకొని సంతోషముగా ఉండేది. ఒక దినము కాకి వచ్చి నేను కూడా నీ స్నేహితుడుగా ఉంటాను అని అన్నది వెంటనే ఈ అందమైన పక్షికి వచ్చింది కోపం. నువ్వు నిన్ను ఎప్పుడైనా నీటిలో చుచుకున్నావా? నేను ఎంత అందంగా ఉన్నాను నీతో ఎలా స్నేహిం చేయగలను? అని చెప్పేసింది. కాకి చాలా బాదతో వెళ్ళిపోయింది. 

 

కొన్ని దినాల తరువాత ఆ అందమైన పక్షికి రోగము వచ్చింది. రెక్కలన్నీ కూడా పోయి చూచుటకు అంద విహీనంగా కనబడింది అందువలన పక్షి ఎగిరిపోయి ఆహారం తెచ్చుకోలేక పోయింది. తనకి స్నేహితులుగా ఉండిన అనేకమంది దగ్గరకు వెళ్లి సహాయం అడిగింది. ఏ పక్షి కూడా సహాయం చేయుటకు ముందుకు రాలేదు. కాకి వచ్చి పక్షి యొక్క పరిస్థితిని చూసి అర్ధంచేసుకుంది. దానికి అవసరమైన ఆహారాన్ని వెదకి తీసుకొని వచ్చి పెట్టింది. ఆ పక్షి ఇప్పుడు గుర్తుతెచ్చుకుంది. ఎవరిని నీకు అందంలేదు, నీవు నా స్నేహితుడు గా ఉండుటకు అర్హత లేదని అన్నానో తనే ఇప్పుడు నాకు సహాయం చేసి నన్ను ప్రేమిస్తున్నాడు . అందము ప్రాముఖ్యమైనది కాదు ప్రేమే ప్రాముఖ్యమైనది. అనేదాన్ని ఆ పక్షి అర్ధం చేసుకున్నది. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి కధ విన్నారు కదా మీరుకుడా అందాన్ని చూసి ఆస్థిని చూసి స్నేహిం చేయకూడదు. ఏ బేధములేకుండా ఏ తేడాలేకుండా అందరిని ప్రేమించి యేసయ్య ప్రేమను అందరికి మీ ద్వారా చూపించాలి.మాదిరిగా జీవించాలి ఓకేన ఓహో డబల్ ఓకే నా! వెరీ గుడ్ సూపర్. 

- శ్రీమతి. జాస్మిన్ పాల్ పాండితురై

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)