Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 05.06.2021

దిన ధ్యానము(Telugu) 05.06.2021

 

అసాధారణమైన అద్భుతం:-

 

"దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు" - ప్రసంగి 3:11

 

వృద్ధాప్యం గల ఒక గొప్ప సేవకుడు తన కుమారుడు గురించిన సాక్ష్యాన్ని పంచుకున్నారు. తను ఏకైక కుమారుడు తన12వ ఏట ఇంటర్మీడియట్ చదువును పూర్తి చేసియున్నారు. చిన్న ప్రాయం నుండే చక్కగా చదువుతున్న వాడు కాబట్టి డాక్టర్ సీట్ దొరుకుతుందని ఎదురు చూశారు. యంబిబియస్ సీటు దొరకకపోవడం వలన ఆ బాబు చాలా నిరుత్సాహముతో నా తల్లిదండ్రులు మిషనరీలుగా ఎంత కష్టపడి ప్రభు పరిచర్య చేస్తున్నారు. నాకెందుకు ఈ మెడికల్ సీట్ దేవుడు ఇవ్వలేదు అని మిక్కిలి చింతించాడు. తండ్రి అయితే ప్రభు ఏది చేసినా మేలు కొరకే చేస్తారు అని చెప్పారు. కాబట్టి మందులు పరిశోధన చేసే రంగంలో ఆయనకు సీటు దొరికింది. తన చదువును పూర్తిచేసుకుని పనిలో చేరారు. అంచలంచలుగా పరీక్షలు వ్రాస్తూ ప్రస్తుతం విదేశమునుండి భారత దేశమునకు దిగుమతి అయ్యే మందులకు అనుమతిని ఇచ్చి సంతకం చేసే పెద్ద అధికారిగా ఢిల్లీ లో పనిచేస్తున్నారు. ప్రతి ఆదివారము ఒక ఇంటిలో ఆరాధనను నడిపించే గుంపును ఏర్పాటు చేసి పరిచర్య చేస్తున్నారు. ఒకరోజు తన తండ్రి తో యం బిబియస్ సీటు దొరకకపోవడం దేవుడు నాకు చేసిన మేలు. ఆ సీటు దొరికి ఉంటే ఒక సాధారణమైన డాక్టర్ గా మాత్రమే నేను ఉండి ఉండేవాడిని. కాని ఇప్పుడైతే అనుభవము కలిగిన యండి,యమ్ యస్ చదివిన గొప్ప డాక్టర్లు నాయొద్ద పనిచేస్తున్నారు. అనేకులు ఇంటర్వ్యూ కొరకు వస్తున్నారు. దేవుడు ఎప్పుడు ఎవ్వరి జీవితంలో తప్పిదము చేయరు. మేలైన వాటిని మాత్రమే చేస్తారు అని అన్నారు.

 

మత్తయి సువార్త4వ అధ్యాయంలో నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలయ్యే టట్లు చేయుము ఇక్కడ నుండి దూకుము అని సాతానుడు యేసుని శోధిస్తున్నాడు. మనము ప్రభువుకి ఇష్టమైన వారంగా జీవిస్తున్నామే, పరిచర్య చక్కగచేస్తున్నామే కాని కార్యాలు మనం ఎదురు చూస్తున్నట్లుగా జరగట్లేదే అని మనలను సాతానుడు ఎప్పుడు నిరుత్సాహపరుస్తూ అడ్డదారులను చూపిస్తూ ఉంటాడు. అప్పుడు యేసు! మనుష్యుడు రొట్టె వలన కాదుగాని ( మనం ఎదురు చూస్తున్న కార్యాలు) దేవుని నోటినుండి వచ్చే ప్రతీ మాటవలన ( మనము ఎదురు చూడని ఆయన యొక్క కార్యాలద్వారా) అద్భుతాలు చేయగలరు. 

 

ప్రియ దేవుని పిల్లలారా! మనం ఎదురు చూస్తున్న కార్యాలు జరగనప్పుడు నా చిత్తముకాదు దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరుతూ వస్తుంది అనేదాన్ని దృఢంగా విశ్వసించి అంగీకరించండి. మన జీవితపు యజమానుడు ఆయనే, మనము మన సొత్తు కాదు మనము ఆయన సొత్తుఅయి ఉన్నాము. ఆయన ఎవ్వరి జీవితములో తప్పిదము చేయరు ఆలస్యము కూడా చేయరు. కాని మేలైన వాటిని ఖచ్చితంగా ఇస్తారు. నిరీక్షణ తో ముందుకు వెళదాం. హల్లేలూయ! 

- సహోదరుడు. యల్.అలగర సామి

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్యను ప్రార్ధనతోను, సహాయముతోను సహకరిస్తున్న కుటుంబాలను దేవుడు దీవించులాగున ప్రార్థిద్దాం.

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)