దిన ధ్యానము(Telugu) 04.06.2021
దిన ధ్యానము(Telugu) 04.06.2021
విశ్వసించు భయపడకుము:-
"సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు.. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును." - 1కోరింథీయులకు 10:13
ఈ మధ్యలో నేను ఒక ప్రవేట్ బ్యాంకుకు వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసిన బంగారమును వెలకట్టే ఆఫీసర్ మేడమ్ ఏ రోగము ఎప్పుడుతగ్గుతుందో ఏమో ఎప్పుడు బాధగాను, భయంగాను, ఆందోళనగాను ఉంటుంది. నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్ధించండి అని చాలా దుఖ్ఖః ముతో చెప్పాడు. ఆయనకు కొన్ని నిమిషాలు ఆదరణ కరమైన మాటలు చెప్పి ధైర్య పరచి వచ్చాను.
అవును ఈ కరోనా రెండవ దశలో మిక్కిలి భయంకరంగా క్రూరముగా అనేక దేవుని పిల్లలను , మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన వాళ్ళ ను, వైద్యులను , నర్సులను, పోలీసులు, మన స్నేహితులను, ఇంకా బంధువులను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయింది ఈ రోగము విస్తారముగా విస్తరిస్తూ వస్తున్న నేపథ్యంలో హాస్పిటల్లో స్థలము లేక , మందులు లేక ఆక్సిజన్ దొరకక పోవడం ఇలా అనేక ఇబ్బందులు కనబడుతున్నాయి. ఈ రోగము కంటే భయంకరమైన విషయము ఏమిటంటే మన యొద్ద కనిపిస్తున్న భయము టెన్షనే నేను దీనిని వ్రాస్తున్నప్పుడు కర్ణాటక సిక్మళూర్ అనే ఊరులో జరిగిన విని చాలా దుఖ్ఖఃపడ్డాను. రిటైడ్ తాసీల్ధార్ ఒకతనికి ఈ కరోనా వచ్చింది అని గ్రహించిన వెంటనే తన వలన తన కుటుంబానికి ఈ రోగము వాస్తదేమో అనే భయముతో లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత దుఖ్ఖః కరము దేవుడు మనకి భయపడుతున్న ఆత్మ ను ఇవ్వక బలమును, ధైర్యమును, ప్రేమను, తెలివిగల ఆత్మ ను ఇచ్చియున్నారు. ( 2తిమోతికి 1: 7) "దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల (స్వస్థబుద్ధియుగల ఆత్మనే) ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు." భయము, టెన్షన్, చింత అవసరమే లేదు.
మన బైబిల్ ల్లో కూడా అబ్రాహాము వృద్ధాప్యం లో తన వాగ్దాన పుత్రుడైన కుమారుణ్ణి బలి ఇమ్మని దేవుని వలన ఆజ్ఞ పొందుకున్నాడు. ఉదయాన్నే లేచి అవసరమైన వాటిని తీసుకొని తెలివి గలవాడైన ఇస్సాకుతో అబ్రాహాము బయలుదేరాడు. ఈ విధేయత మనల్ని ఆశ్చర్య పరుస్తుందికదూ! మనము ఇలా చేయగలమా? కానీ అబ్రాహాము యొద్ద కనబడిన తిరిగి వస్తాము అనే విశ్వాసము దహనబలి కొరకైన గొర్రెను దేవుడు చూచుకుంటారు అని నిరీక్షణ తో చెప్పిన మాటలు అన్నింటికి పైగా నేను నీ సంతతిని విస్తరింపజేస్తాను అని దేవుని యొక్క వాగ్దానాన్ని చక్కగా గ్రహించి యున్నారు. విజయముతో తన కుమారుడ్ని వెంటబెట్టుకొని వచ్చారు.
ప్రియమైన వారాలరా! లోకములో మీకు శ్రమలు కలవు అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించాను (యోహాను 16:33) అని ధైర్యం చెబుతున్న జయక్రీస్తు మీతో వుంటున్నారు. అంత గొప్ప బలమైన ధైర్యాన్ని విడిచి పెట్టకండి. బైబిల్లో అనేక మంది దేవుని దాసులను దేవుడు ఇరుకు మార్గంలో నడిపించి వాళ్ళను రక్షించిన దానిని చూస్తున్నాం. ఆ దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తారు. కరోనా సంరక్షణ విధానములను పాటించండి. అందరం సంరక్షణలో ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయును గాక! ఆమెన్.
- శ్రీమతి. సరోజా మోహన్ దాస్
ప్రార్థన అంశం:-
త్రాగుడుకు బానిసలైన ప్రజలను విడిపించాలి అని ప్రారంభించిన పీస్ సెంటర్ కొరకు ప్రార్ధించండి.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250