దిన ధ్యానము(Telugu) 03.06.2021
దిన ధ్యానము(Telugu) 03.06.2021
సంపూర్ణ నిశ్చయత, సంపూర్ణ నిరీక్షణ:-
"దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను." - రోమీయులకు 4: 21
రాత్రి సమయంలో ఒక మనిషి కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా కాలుజారి కిందపడిపోయి దొర్లడం ప్రారంభించాడు. చాలా ప్రయాస తరువాత చేతికి దొరికిన చెట్టు యొక్క కొమ్మను పట్టుకొని వేలాడాడు ప్రభువా సహాయం చేయండి అని ప్రార్ధించాడు. దేవుడు చేయి విడివు సహాయం చేస్తాను అని అన్నారు. ప్రభువా ఎలాగు చేయి వదలగలను అని గట్టిగా పట్టుకున్నాడు. చేతలు నొప్పి పుట్టినయ్, చేతుల నొప్పి ఎక్కువైంది మరలా సహాయం చేయమని అడిగారు. నా మీద నిరీక్షణ ఉంచి పట్టుకున్న చేయి ని విడిచిపెట్టు అని జవాబు వచ్చింది. ఎంత లోతుగా ఉన్నదో ఏమవుతుందో అని తలంచి కొమ్మను వదులుటకు మనసు లేకుండా వేలాడుతూ ఉన్నాడు. సమయం దాటుతూ ఉంది చీకటి పోయి వెలుగు రావడం ప్రారంభించింది. అప్పుడు నెమ్మదిగా కిందకి చూసాడు. అతని కాలుకి నేలకి 3అడుగుల వ్యత్యాసము మాత్రమే ఉన్నది. దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ కొమ్మను విడిచిపెట్టి ఉంటే రాత్రి అంటాకుడా మరణభయముతో, వణుకుతో, నొప్పితో రాత్రంతా వేలాడ వలసిన అవసరం ఉండేది కాదు.
బైబిల్ ల్లో కూడా అబ్రాహాము గురించి (రోమీయులకు 4: 19-21) "మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,
అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను." అని చదువుకున్నాం.
క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి! మీరు ఎదురు చూస్తున్న ఏ కార్యమైన దేవునిని నమ్మి ఆయన హస్తాలకు విడిచిపెట్టి యున్నారా? లేద ఇలాగు జరగాలి, ఆలాగు జరగాలి అని కొమ్మను పట్టుకొని ఉన్నట్లు పట్టుకొని ఉన్నారా? దేవునిని నమ్మి ఆయన చేతులకి అప్పగించి మీ కార్యాలు ఏమైనప్పటికీ సరిగా సక్రమంగా చేసి ఉంచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అద్భుతం పొందుటకు మీరు సిద్ధమేనా?
- సహోదరుడు యల్.అలగర సామి
ప్రార్థన అంశం:-
మన మిషనరీ ఆల్విన్ యొక్క భార్య నిరోసా సుఖమైన ప్రసవం కొరకు ప్రార్ధించండి.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250