దిన ధ్యానము(Telugu) 02.06.2021
దిన ధ్యానము(Telugu) 02.06.2021
అర్హత కలిగిన నాయకత్వం:-
"ఆయన కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు." - దానియేలు 2: 21
ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు తన దేశాన్ని చక్కగా పరిపాలించి తన ప్రజలు సంతోషంగా జీవించేటట్లు చేసాడు. రాజుకి వృద్దాప్యం రావడం వలన తన ఇద్దరి భార్యలకు ఇద్దరు కుమారులు ఉండేవారు. ఇద్దరు భార్యలు కూడా తమ కుమారుడు అంటే తమ కుమారుడే రాజుగా రావాలని పోరాడుతున్నారు. నా తరువాత ప్రజలకు మంచి పాలన ఇచ్చే వాడే రాజుగా ఉండుటకు అర్హత గల వాడు నేను ఒక పరీక్ష పెట్టి దాని ఆధారముగా ఎంచుకుంటాను అని రాజు చెప్పారు.
ఆ దేశం నుండి 10కి.లో అవతల రెండు దీవులు ఉండేవి కొన్ని నెలలకు అవసరమైన మొక్కజొన్నను ఇద్దరు కుమారులకు ఇచ్చి పంపించారు. పడవ లేకుండా అక్కడ నుండి తిరిగి రాలేరు. అక్కడ ఎత్తయిన రిక్షాలు, దట్టంగా పెరిగిన గడ్డి పొదలు చూచారు. మన దగ్గర ఉన్న మొక్కజొన్న కాళీ అపోయిన వెంటనే అక్కడఉన్న మొక్కలను నరికి నిప్పంటించాలి. ఆ పొగను చూచిన వెంటనే అక్కడ ఉన్న కాపాలవాళ్ళు మిమ్మలను వెంటనే తీసుకు వస్తారు. 3నెలల్లో ఒక దీవినుండి పొగ రావడం ప్రారంభించింది. కాని మరొక దీవినుండి కొన్ని నెలలైన కూడా పొగ రాలేదు. గాబరపడిపోయిన రాజు అక్కడ సైనికులతో కలిసి వెళ్ళి అక్కడ చూచినప్పుడు ఆ మొక్కజొన్న పెద్ద తోటగా ఎదిగి ఉన్నది. రోజు అక్కడ ఉన్న పొదలను, మొక్కలను నరికి శుభ్రం చేసిన స్థలం లో తనకి ఆహారంగా ఇవ్వబడిన మొక్కజొన్న ను కొంత భాగాన్ని పంటగా పండిస్తూ ఉన్నాడు ఆ కుమారుడు , పంట పండిస్తూ, స్థలం చదును చేయబడి ఉన్నది. ఈయనే మా దేశానికి అవసరమైన రాజు ఈ కుమారున్నే నా సింహాసనం మీద కూర్చోపెడతాను. అవును ప్రజలను పరిపాలించేరాజు సమర్ధవంతంగాను, జ్ఞానము గల వాడుగాను ఉండుట అవసరము అని అన్నారు.
తమిళనాడు లో మన ప్రార్ధనకు జవాబుగా దేవుడు మంచి ముఖ్యమంత్రి ని దయచేసి యున్నారు. మిక్కిలి సవాలుగా ఉంటున్న ఈ కరోనా కాలములో కూడా అధికారంలో ఉంటున్న ఆయన ప్రతిపక్షాలతో మంచి సంబంధాలను పెట్టుకొని కఠిన ప్రయాసతో అధికారులతో కలిసి తనకు ఓటు వేసిన ప్రజలకు మంచి ప్రణాలికను అమలు పరిచి ప్రజల మేలుకొరకు పని చేయుట అందరిని సంతోష పెట్టియుంది. మన దేశము మంచిగా ఉండుటకు బాధ్యత గల మంచి పరిపాలకులను, జ్ఞానముతో పని చేయుటకు వాడుకొని ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో అవదులులేని మంచి పరిపాలన చేసి ప్రజలకు సహాయం చేయులాగున ప్రార్థిద్దాం. మిగిలిన అన్ని రంగాలలో గల అధికారులు, మినిస్టర్ లు చక్కగా పరిపాలించులాగున ప్రార్థిద్దాం. కరోనా లేకుండా మన దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించుటకు మనము తొర్పడదాం. ఆమెన్!
- శ్రీమతి.సరోజా మొహన్ దాస్.
ప్రార్థన అంశం:-
గెత్సమనే క్యాంపస్ రోజు వచ్చి మధ్యాహ్నం ఆహారం తీసుకొని వెళ్తున్న వ్యాక్తులు యేసు ప్రేమను గ్రహించేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250