Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 01.06.2021

దిన ధ్యానము(Telugu) 01.06.2021

 

ప్రార్ధనా అంశం:-

 

శిఖరము పైకి ఎక్కుదాము:-

 

"ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను." - లూకా 6:12

 

చీకటి ఖండము అని పిలవబడుతున్న ఆఫ్రికా ఖండము నుండి ఐరోపా దేశమునకు వెళ్తున్న విమానం లో విషపూరితమైన పాములు పెట్టబడిన పెట్టెలను మూయకుండా మరచిపోయి పెట్టేసారు. విమానము కిందనుండి పైకి లేచినప్పుడు హఠాత్తుగా పెట్టెలు తెరచుకున్నాయ్. వాటిలో ఉంటున్న పాములు బయటికి వచ్చి ఆ ప్రయాణికులు ఉంటున్న ప్రాంతంనకు వచ్చి బయట తిరగడం ప్రారంభించింది. హఠాత్తుగా ప్రయాణికులదగ్గర నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. కొందరు భయపడి కిందపడిపోయారు, కొందరిని పాము కాటువేసింది వారు ప్రాణములతో కొట్టుమిట్టాడుతున్నారు. పాములను గూర్చిన సందేశం పైలెట్ కు తెలియజేసిన వెంటనే ఆయన మిక్కిలి భయపడిన వాడిగా కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి విషయాలు చెప్పి విమానమును ఎక్కడ దించాలి అని గాబరాతో అడిగారు. అందుకు కంట్రోల్ రూమ్ లో ఉన్న వ్యక్తి తొందరపడి క్రిందకు దిగవద్దు అని చెప్పి మీరు ఎంత ఎత్తులో ఎగురుతున్నారు అని అడిగారు. అందుకు ఆ పైలెట్ 4000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నాము అని అన్నారు. ఇంకా ఎత్తుకు వెళ్ళండి అని చెప్పారు అందుకు ఆ పైలెట్ ఇంకా ఎత్తుకు వెళ్లారు కాని ఏమి జరగలేదు. ఇంకా ఇంకా ఎత్తుకు వెళ్ళమని చెబుతూనే ఉన్నారు. చివరికి ఉన్నతమైన ఎత్తులో ఎగిరినప్పుడు ఆ పాములు ఆక్సిజన్ లేక ఊపిరి ఆడక పడిపోయాయి. ఆ పాములన్నింటిని తీసి ఆ పెట్టిలో వేసి మూత పెట్టి . దాని తరువాతఆ పెట్టికి తాళం వేశారు. వెంటనె అందరికి ఫట్ ఎయిడ్ చేశారు. అందులో కొందరు తప్ప అందరూ కాపడబడ్డారు. 

 

ప్రియామైన వారలారా ! సాతాను యొక్క తంత్రం నుండి తప్పించబడాలి అంటే మనము కూడా ఎత్తయిన ప్రాంతమునకు వెళ్ళాలి. ఈ లోకపు నాయకుడైన సాతాను మనము ఈ లోకంలో ఉంటున్న అంత వరకు మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాని మనము ముందు ప్రార్ధనలో దేవుని వైపు చూస్తూ ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే అయన పని చేయకుండా పోతాడు. దేవుని వైపు వెళ్తున్నా వాళ్ళను ఆయన ఎమి చెయ్యలేడు.

 

ఆ దినములలో యేసుక్రీస్తు ప్రార్ధించుటకు ఒక కొండ పైకి ఎక్కి రాత్రి అంత తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారు. ఆయన క్రింద ఉండి ప్రార్ధించ వచ్చు కదా? ఎందుకు కొండ పైకి ఎక్కారు? ఎందుకు అంటే అక్కడ ఎవ్వరు ఇబ్బంది లేకుండా రాత్రి అంత దేవునికి మొఱ్ఱపెట్టవచ్చు అని. మనము కూడా పతనం అవ్వకుండా కొండ అయిన క్రీస్తు వైపునకు వెళ్లి ఆయనను పట్టుకొని ప్రార్ధించినప్పుడు లోకంలో ఎలాంటి కార్యములకు, రోగములకు, సాతాను యొక్క శోధనలకు దొరకకుండా మనము తప్పించ బడతాం. మనము ఈ సంవత్సరం అంత ఎంత ప్రార్ధించాము అని లెక్కపెడితే ఒక ఆయన ఇలా రాసారు ఒక దినమునకు 5 నిమిషాలు ప్రార్ధన చేస్తే సంవత్సరానికి ఒకే ఒక దినము ప్రార్ధించినట్లు అవుతుంది అన్నారు. ప్రతి కార్యానికి గంటల కొలది సమయం కేటాయిస్తున్న మనకు ప్రార్ధించుటకు ఎందుకు సమయం దొరకటం లేదు. మనం చేస్తున్న ప్రార్థనబట్టే మనం చేస్తున్న పనిలో జయం పొందుకుంటాం. ఒక దినమునకు గంట సేపు కూడా ప్రార్ధించలేకుండా ఉంటే సాతానును మనము ఎలా జయించగలము? మనలను మనం ఒక్కసారి పరీక్షించి చూద్దాం. జయించుటకు మనలను దేవునికి సమర్పించు కుందాం.

- బ్రదర్. హానిస్ శామ్యూల్

 

 

ప్రార్థన అంశం:-

మన గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనులలో దేవుని హస్తం తోడుగా ఉండి నడిపించేటట్లు ప్రార్థిద్దాం.

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)