Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 31.05.2021

దిన ధ్యానము(Telugu) 31.05.2021

 

ఎరుగని గడియ.

 

"కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి" - మత్తయి 24: 42

 

పూర్వపు అమెరికా రాష్ట్రపతి అయిన డ్వాయిట్. డి. ఐసన్ ఓవర్ ఒక మారు సెలవులో ఉండినప్పుడు ఆమెకు ఒక లెటర్ వచ్చింది. దాంట్లో 6 సంవత్సరాలు వయస్సు గల బాలుడు కేన్సర్ తో పీడింపబడి మరణ కరమైన పరిస్థితుల్లో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు అమెరికా ప్రెసిడెంట్ ను కలవాలి అని ఆశిస్తున్నాడు అన్నదే ఆ లెటర్. ఇది ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్లబడినప్పుడు ఆ బాలుని చూచుటకు నిర్ణయించుకొని ఆ బాలుని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. ఆ బాలుని యొక్క తండ్రి డోనాల్డ్ తలుపు తీసినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ని చూచి ఆశ్చర్య పోయారు. ప్రెసిడెంట్ రాకడను ఎదురు చూడలేదు కాబట్టి బాలుని యొక్క తండ్రి సిద్ధపాటు వస్త్రము ధరించకుండ ముఖము సవరము చేసుకోకుండా, ఇంటి వస్తువులన్నీ కూడా అక్కడక్కడ ఉండటం వలన అతనిని బాధపరచింది. అయినప్పటికీ ఆయన ప్రెసిడెంట్ ని లోపలికి పిలిపించి ఆ బాలుని యొద్దకు తీసుకు వెళ్లారు. ఆ ప్రెసిడెంట్ కొంతసేపు ఆ బాలునితో మాట్లాడేసి బయలుదేరారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరు ఆ విషయం గురించి మాట్లాడుకునేవారు. కాని డోనాల్డ్ కైతే కొంత దుఖ్ఖః మే ఉండేది. ఎందుకంటే ఆయన వ్రాసిన లెటర్ ప్రెసిడెంట్ కి చేరుకుంటాదో లేదో ఆయన వస్తారోలేదో అని ఎదురు చూడకుండ ఉండేటప్పుడు ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి ఆ దుఖ్ఖనికి కారణం.

 

10మంది కన్యకల ఉపమానంలో 5గురు బుద్ధి గలవారు 5గురు బుద్ధి లేనివారు ఉన్నారు. బుద్ధి లేనివారు తన ధివిటీలను తీసుకొని వెళ్లారు. నూనెని తీసుకొని వెళ్లడం మరిచిపోయారు. బుద్ధి కలిగిన కన్యకలు తమ ధివిటీలతో పాటు తమ పాత్రలో నూనెని తీసుకొని వెళ్ళారు. ఎరుగని ఘడియాలలో వరుడు వచ్చేసరికి బుద్ధికలిగిన కన్యకలు తమ ధివిటీలను సిద్ధపరచుకున్నారు. వరుడైన యేసుక్రీస్తు వివహపు ఇంటిలో ప్రవేశించారు. బుద్ధి లేనివారైతే ఆ అవకాశాన్ని కోల్పోయారు. 

 

మన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నారు అన్నది మనందరం ఎరిగిన సత్యమే కాని మనమెంతవరకు దానికి సిద్ధపడి ఉన్నాము అన్నది అనుమానాస్పద ముగానే ఉన్నది. ఎందుకనగా ఎన్నో సంవత్సరాలుగా దీనినే చెబుతున్నారు ఇంకా రాలేదు అనే తలంపు అనేకమంది మనసులో ఉంటుంది. కాబట్టి సిద్ధపాటు లేకుండా జీవిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలి. అవును ప్రియమైన వారలారా! మన ప్రభువు మనము ఎదురు చూడని పరిస్థితులలో వస్తారు మనము సిద్ధమేనా? మరకలు లేని రక్షణ వస్త్రం ధరించుకొని ఉన్నామా లేదా అనేక పాపపు మరకలతో కనబడుతున్నామా? యేసుక్రీస్తు రాకడ కొరకు మనము త్వరగా సిద్ధపడదాం. మనము ఎరుగని ఘడియాలో ఆయన వస్తారు అప్పుడు ఆయానను దర్శించుటకు సిద్ధంగా ఉందాం అనేకులను సిద్ధపరుద్ధాం. 

- శ్రీమతి. జీవా విజయ్

 

ప్రార్ధనా అంశం:-

ఆఫీసు పని కొరకు అత్యవసరమైన జిరాక్స్ మిషన్ కొనబడేటట్లు ప్రార్థిద్దాం.

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)