దిన ధ్యానము(Telugu) 30.05.2021 (Kids Special)
దిన ధ్యానము(Telugu) 30.05.2021 (Kids Special)
గొప్ప ఆయుదము:-
"ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును" - కీర్తనలు 121: 7
జోసఫ్ అన్నయ్య థియోలజి చదువుటకు తన స్వదేశమును విడిచిపెట్టి వేరే దేశానికి చదవడానికి వెళ్ళారు. చదువు ముగించుకొని 5సంవత్సరాల తరువాత స్వంత దేశమునకు తిరుగు ప్రయాణం అయ్యారు. నావ ప్రయాణము చాలా జాలీగా ప్రారంభమైయింది. కఠినమైన మంచు కురవడం చేత నావ ప్రయాణము ఆలస్యమైంది. అధికమైన మంచు కురవడం వలన నావ ముందుకు వెళ్లలేకపోయింది. అందరికి చాలా భయం కాని జోసఫ్ అన్నయ్య మాత్రం ఎలాంటి భయం లేకుండా ఉన్నాడు. ఏమి జరిగినా యేసయ్య నాతోనే ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. మంచు ఎక్కువ అవుతుంది తప్ప తగ్గడం లేదు నీటి మీద వెళ్తున్న నావ కు హఠాత్తుగా పెద్ద బండరాయి గుద్ది విరిగిపోయింది. ఈత వచ్చిన వారందరు కూడా ఈదుకుంటూ వడ్డుకు చేరుకున్నారు. జోసఫ్ అన్నయ్య కి ఈత కొట్టడం రాదు. కీర్తన 121 ని చెబుతూనే ఉన్నారు.
మరుసటి దినము కళ్ళు తెరచి చూసేసరికి వేడిగా ఉన్న ఇసుకలో పడుకొని ఉండుట గ్రహించారు. కళ్ళు తెరచి చూసేసరికి తన చుట్టూ అడవి మనుషులు వాయిద్యాలు వాయించుకుంటూ ఆట పాటలతో సంతోషంగా ఉన్నారు.భాష ఏమి అర్ధం కాలేదు. మరల కీర్తనలు 121వ అధ్యాయాన్ని మరల నెమరువేసుకుంటున్నాడు మీరుకుడా ఈ అధ్యాయాన్ని కఠస్థం చేసుకోవచ్చు ఓకెన! ఆపత్కాలములో వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది. తరువాత జోసఫ్ అన్నయ్యని ఏమి చేశారో తెలుసా? అక్కడ ఉన్న చెట్టుకి కట్టేశారు ఈదినం మంచి విందు దొరికింది అని తలంచారు ఆ చెట్టు పైన రెండు పక్షులు తిరుగుతూ , ఎగురుతూ ఉన్నాయి. తరువాత ఆ చెట్టు మీద కూర్చున్నాయి. వీటన్నింటిని గమనించిన నాయకుడు వీడి దగ్గర ఏదోఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అని తలంచి మోకరించి నమస్కరించడం ప్రారంభించారు. జోసెఫ్ అన్నయ్య కు కట్టి ఉన్న ఆ తాడును విప్పారు.
భాషలు అర్ధం కాక పోయిన యేసుక్రీస్తు యొక్క సిలువని పఠముగా కింద గీసి సైగ చేసి వాళ్ళ తో మాట్లాడారు.అడవి మనుష్యులకు మంచి పద్దతులను నేర్పించారు. వంట చేయుట, వ్యవసాయం చేయుట నేర్పించారు. ఈయన యొక్క మంచి నడవడిక వలన ఆ గ్రామాన్నే యేసయ్యకు ఇష్టమైన గ్రామంగా మార్చారు. వీటన్నింటికి కారణము ఆయన హృదయంలో దేవుని యొక్క వాక్యము గొప్ప ఆయుడముగా ఉండుటయే. ఆ వాక్యమే జోసఫ్ అన్నయ్య ని సంరక్షించి సాక్షిగా నిలబెట్టింది. భయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు హృదయములో, వాక్యం ఉంటేనే చెప్పడానికి అవుతుంది. కాబట్టి మీరు ప్రతి రోజు వాక్యాన్ని కంటస్తం చేయాలి. ఆన్లైన్ క్లాస్, పరీక్షలు ఏమి లేవు కదా! సెలవులే కదా! వాక్యాన్ని రోజు కంటస్థ పెట్టండి. ఏంటి పిల్లలు జోసఫ్ అన్నయ్య 121వ కీర్తన చెప్పి విజయవంతంగా జీవించాడు. చూచారా మీరుకుడా బైబిల్ చదివి కంటస్థం చేసి దాని ప్రకారం నడిచి, యేసయ్యకు ప్రియమైన పిల్లలుగా జీవించాలి. ఓకేనా!
- శ్రీమతి. లీబనోన్ రాజ కుమారి
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250