Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 29.05.2021

దిన ధ్యానము(Telugu) 29.05.2021

ఫలము లేదు.

"...ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు" - లూకా 13:7

1990లో ఉండిన విద్యావిధానం, విద్యార్థుల యొక్క ఆలోచన విధానము ఇప్పుడు గుర్తుకు వస్తుంది. సంవత్సరం అంత చదివిన చదువుకు అకరిలో పరీక్షలు పెడతారు. దాంట్లో ప్రతి సబ్జెక్ట్ కు 35 మార్కులు రావాలి. ఒక వేళ అలా రాని యెడల అదే తరగతిలో అదే ఉపాద్యాయుని యొద్ద మరొక సంవత్సరం చదవాలి. అది ఒక కఠినమైన కాలం. అన్ని సంవత్సరాలు చదివి 35 మార్కులు రాకపోతే మళ్ళీ చదవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తోటి విద్యార్థులను ఫెయిల్ అయిన విద్యార్థులతో కలవనివ్వరు. వాళ్ళతో కలిస్తే వీళ్ళు కూడా చెడిపోతారు అని భయం. 35 మార్కులు తెచ్చుకోలేని వారు ఇంట్లో కూడా కష్టాలు పడతారు. 2 లేదా 3 సంవత్సరాలు ఒకే తరగతి గదిలో మరల మరల చదువుట మిక్కిలి దుఃఖ కరమైనది. 

పరిశుద్ధ బైబిల్లో కూడా లుకా సువార్త 13వ అధ్యాయం 6 - 9వరకు గల వాక్యంలో యేసు క్రీస్తు ఒక ఉపమానమును చెప్పారు. ఒకడు తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడు. ఆయన ప్రతి సంవత్సరం దాంట్లో పండ్లను వెతుకుతూ వచ్చెను . కాని ఏమి దొరకలేదు. తరుచుగా 3 సంవత్సరాలుగా ఫలము లేదు ఎంత దుఃఖము ఎదుగుతూ ఎదుగుతూ ఏ ఫలము ఇవ్వకపోతే ఎలావుంటుంది. అది మాత్రమే కాదు ఇది నేలను కూడా పాడు చేస్తుంది. దీనిని నరికి వేయుము అని తోట యజమాని చెప్పినప్పుడు ఆ తోట మాలి ఆ అంజూరపు చెట్టు కొరకు బ్రతిమాలడుకున్నాడు. ఈ ఉపమానమునకు ముగింపు వ్రాయబడలేదు. 

దీనిని చదువుతున్న స్నేహితులారా! దేవుడు మనకు ఈ దినము అనేక సదుపాయాలు, మంచి ఆత్మీయ పరిస్థితులు అని అనేకమైన అనుకూలమైన పరిస్థితులు ఇచ్చియున్నారు. కాని మనము వీటన్నింటిని అనుభవించి దేవుడు ఎదురు చూస్తున్న ఎలాంటి ఫలము లేని జీవితం జీవించిన యెడల ఎంత దుఃఖము. మనము మనకు అవసరమైన వాటన్నింటిని దేవుని యెద్ద నుండి పొందుకొని ఫలించ కుండా సంవత్సరాలు దాటుతూ ఉంటే మనలను మనమే అలోచిద్దాం. దేవుడు మనకు పెట్టియున్న, తీసుకు వెళ్ళబోతున్న స్థలములో మనము చేయగలిగిన కార్యాన్ని దేవుని కొరకు చేద్దాం. ఈ ఉపమానమునకు ముగింపు లేదు అలాగే మన జీవితాలు కూడా ఇంకను ముగించలేదు. కాబట్టి అవకాశములను వాడుకుందాం ఫలములతో నిండిన జీవితం జీవించి మన యజమానునికి సంతోష పరుద్దం.
-    బ్రదర్. టి. శంకర్ రాజ్

ప్రార్థన అంశం.
లక్ష గ్రామాలకు 2000 రూపాయలు ఇచ్చి దత్తతు తీసుకొనే లక్ష మంది వ్యక్తులు లేచే టట్లు ప్రార్దిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)