దిన ధ్యానము(Telugu) 28.05.2021
దిన ధ్యానము(Telugu) 28.05.2021
దినత్వము.
"నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును" - మత్తయి 11:29
వరల్డ్ కప్ ఫూట్ బాల్ ఆకరి మ్యాచ్ లో ఆర్జంటిన పైన గెలిచి వరల్డ్ కప్ తన సొంతం చేసుకుంది జర్మనీ. ఇరు జట్లు ఆటగాళ్లు చాలా చక్కగా ఆడారు. కాని జర్మనీ ఆటగాడు మారియో గోల్ వేసి విజయాన్ని తమ దేశమునకు అందించాడు. తన ఫేసుబుక్ లో దేవునికి కృతజ్ఞతలు అని మెసేజ్ పెట్టారు. తన విజయాన్ని దేవుని పాదముల చెంత పెట్టి దీనత్వాన్ని ధరించుకొన్న ఈయన ఒక చక్కని విశ్వాసి. అధికముగా దేవున్ని ప్రేమిస్తున్నా ఈయన ప్రపంచ చరిత్రలో చోటు దక్కించుకున్నప్పటికి ప్రభువా నేను ఏమి అడగలేదు కాని మీరు నాకు ఇచ్చిన అన్నింటి కొరకు వందనములు చెల్లిస్తున్నాను అని తగ్గింపుతో చెప్పియుండుట ఆశ్చర్యమే.
మన ప్రభువైన యేసుక్రీస్తు నేను సాత్వికుడును, దినమనస్సు గల వాడను అని చెబుతున్నారు. ఆయన సిలువలో మరణము పొందే వరకు తన్ను తాను తగ్గించుకున్నారు అని బైబిల్ చెబుతుంది. ఈ భూలోకంలో జీవించిన దినాల్లో ఆయన పరిచర్య మార్గంలో తనతో ఉండిన శిష్యులకు తగ్గింపును నేర్పించారు. శిష్యుల యొక్క పాదములను కడిగి తన దినత్వాన్ని వ్యక్తపరిచి దిన మనస్సు కలిగిన వారిగా జీవించి వెళ్లారు. ఇలాగు మన అందరికి ఒక మాదిరి కరమైన జీవితాన్ని ముందు పెట్టి వెళ్ళియున్నారు.
ప్రియమైన వారలారా! ఘనతకు ముందు ఉన్నది దినత్వం. మనము తగ్గించుకొనుట నేర్చుకొని ఉంటే దేవుడు హెచ్చించే జీవితానికి మార్గం చూపుతారు. ఎవరు కావాలన్న ప్రయత్నిస్తే తెలివిని పొందుకోవచ్చు. కాని దినత్వము గలవారిగా ఉంటేనే కృపను పొందుకోగలరు. ఒక దేవుని దాసుడు చెబుతున్న మాట మంచం పైన పడుకొని యుంటేనే క్రింద పడే పరిస్థితి కలదు కాని క్రింద పడుకుంటే క్రింద పడే అవసరం లేదు అన్నారు. అవును ఎక్కడైనా, ఎప్పుడైనా, దేంట్లో అయిన మనము దిన మనస్సు కలిగి ఉంటాం. మన జీవితంలో ఎదురైన కార్యాలలో, ఆలోచనల్లో యేసుక్రీస్తు వలె దినమనస్సును దరించుకుందాం. దిన మనస్సు గల వారు హేస్చింపబడుట నిశ్చయము. కాబట్టి తగ్గింపుతో ఉండి కృపను దేవుని చేత వచ్చే హెచ్చింపును పొందుకొని ఈ లోకంలో దీవెన కరముగా జీవిద్దాం.
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్
ప్రార్థన అంశం:-
మన మిషనరీ కుటుంబాలలో గల యవ్వన బిడ్డలకు మంచి జీవిత భాగస్వాములు దేవుడు దయచేసేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250