దిన ధ్యానము(Telugu) 27.05.2021
దిన ధ్యానము(Telugu) 27.05.2021
తేరిచుడుము.
"వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును" - కీర్తనలు 34: 5
ఆయన పక్కన గల తోటలో పొద్దు తిరుగుడు పువ్వులు చాలా ఎక్కువగా పూయడం వలన అది నాకు అతియాస్పదముగా అనిపించింది. ఆ పొద్దు తిరుగుడు పువ్వు పూసిన వెంటనే ఉదయం సూర్యుడు ఉన్న దిశ వైపు ఉంటుంది. సూర్యుడు సూర్యుడు కదులుతూ మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆ పువ్వుకుడా నేరుగా సూర్యన్నే చూస్తున్నట్లు ఉంటుంది. సాయంకాలము సూర్యుడు అస్తమించినప్పుడు పువ్వులన్ని కూడా సూర్యుడు అస్తమించిన వైపే తిరిగి ఉంటాయి. ఎంత ఆశ్చర్యం చూసారా? ప్రకృతి ద్వారా దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నారు. అదేమిటంటే మనము కూడా మారుతున్న లోకపు రంగుల వైపు చూడకుండా ప్రభువు వైపే చూచి జీవించుటకు నేర్చుకోవాలి.
దీన్ని బాగా గ్రహించిన కీర్తన కారుడు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం మీ యొద్ద నుండే వచ్చును అని చెబుతున్నాడు. అది మాత్రమే కాక ఇంకను తనను తగ్గించుకొని ప్రభువు వైపు చూచి దాసుల కన్నులు తన యజమానుని వైపును దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచునట్ల మన దేవుడైన యెహోవా కరుణించు వరకు నా కన్నులు ఆయన తట్టు చుచు చున్నవి (కీర్తన 123:2) అని చెబుతున్నారు. ఆయన యొక్క కడలించబడని నిరీక్షణ నా దేవున్ని చూస్తే నేను ఎన్నడూ సిగ్గుపడను అన్నదే. దేవున్ని చూచుట అంటే ఏమిటి ప్రతి రోజు ప్రార్ధించుట అవును ప్రతి దినము ఉదయాన్నే తెరిచే తాళం చెవిగాను, రాత్రి తలుపు వేసే తాళం గాను రాత్రి ప్రార్థన ఉండాలి.( Prayer is the key for the day Lock for the night). ఇలాగు మనం దేవున్ని చూచి నప్పుడల్లా మనము హెచ్చింప బడతాం. దానియేలు సింహల బోనులో వున్నప్పుడు కూడా దేవుని వైపు చూసాడు మూడు పూటలా ప్రార్థిస్తున్నాడు. అందువలన తన జీవితం హెచ్చింప బడింది.
దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా! ఈ పొద్దు తిరుగుడు పువ్వు వలె మనం కూడా నీతి సూర్యుడైన యేసయ్య వైపు చూద్దాం అదే మనకు సంరక్షణ. అది మన జీవితమునకు దీవెన తీసుకు వచ్చే మార్గం. ప్రార్థన పైకి వెళ్తున్న కొలది దీవెన క్రిందకు దిగును (prayer goes up and blessings come down) .
- శ్రీమతి. రూడి జయ రాజ్.
ప్రార్థన అంశం:-
గాడిదల గ్రంధము అనే మాస పత్రిక ముద్రించబడుటకు అది సేవకులకు దీవెన కరముగా ఉండేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250