దిన ధ్యానము(Telugu) 26.05.2021
దిన ధ్యానము(Telugu) 26.05.2021
చిన్న చూపు చూడకుము.
"ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి" - మత్తయి 18:10
సాధారణముగా మనము మనకంటే తక్కువ అంతస్తు గల వారిని చూచి వారికి ప్రాముఖ్యత ఇచ్చుటకు మన శరీర స్వభావము అంగీకరించదు. సాధారణంగా వాళ్ళను నమ్మి ఎలాంటి బాధ్యతను అప్పగించము. నిన్న వర్షానికి మొలిచిన పుట్ట గొడుడుగులు అని చెప్పి వాళ్ళ సామర్ధ్యాన్ని చూడకుండా సులువుగా తక్కువ చేసి మాట్లాడేస్తాం. కాని బైబిల్ ఏ ఒక్కరిని కూడా అశ్రద్ధ చేసి చిన్న చూపు చూడకండి అని మనల్ని హెచ్చరిస్తుంది. 18 సంవత్సరాలు కూడా నిండని యవ్వనుస్తుడు ఒకరు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డి.యల్ మోడీ యొక్క చికాగో నగర దేవాలయములో ప్రసంగిచుటకు ఆశిస్తూనట్లు చెప్పారు. మోడీ అయితే ఆ యవ్వనస్తుడ్ని అంగీకరించుటకు ఆలోచించి మాట దాటివేసి వచ్చేసారు. కాని దేవుని ప్రణాళిక ప్రకారము అనేక నెలలు తరువాత మోడీ సంఘంలో ఆ యవ్వనస్తుడు ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని విన్న అనేకులు తమ యొక్క వెనకబడిన ఆత్మీయ జీవితం నుండి మారు మనస్సు పొందారు. డి.యల్. మోడీ కన్నీటితో ఆ ప్రసంగాన్ని విన్నారు. దాని తరువాత ఇంకా ఎవరిని కూడా చిన్న చూపు చూడను అని నిర్ణయించు కున్నారు.
బైబిల్లో కూడా ఇలాంటి కొందరు యవ్వనస్తులను దగ్గర బంధువులే చిన్న చూపు చూసిన దానిని మనం బైబిల్లో చూస్తున్నాం. యోసేపు కల ఆయన మాటలు ఆయన సహోదరుల చేత అశ్రద్ధ చేయబడింది. దావీదు యుద్ధములో తన సహోదరులు చేత అశ్రద్ధ చేయబడ్డాడు. కాని దేవుడు విళ్ళను చూచి వీళ్ళ ద్వారా గొప్ప కార్యములు చేశారు అనేది మనం గ్రహించ వలసిన సత్యం. అ దినము పరిసయ్యుడు సుంకరివాడిని కూడా అశ్రద్ధ చేసాడు. నేను విడి వలె కాకుండా మంచి వాడిగా వున్నాను అని తనలో తాను మెచ్చుకున్నాడు. కాని దేవుని దృష్టిలో సుంకరియే విశేషమైన వాడిగా ఎంచబడ్డాడు.
ఈ దినము మన అఫిసులో, సంఘంలో, కుటుంబంలో ఇతరులను మనము చిన్న చూపు చూడ వచ్చు. మన క్రియల ద్వారా చూపుల ద్వారా, మాటల ద్వారా నేనే మీకంటే గొప్ప వాడను అని చూపిస్తున్నమా? అయితే అది దేవుని దృష్టిలో పాపమే. దినత్వం వలన ఒకరిని ఒకరు తమ కంటే గొప్ప వారిగా తలంచుడి (ఫిలిప్పి 2:3) అని బైబిల్ చెబుతుంది. నేను తప్ప దీనిని చేయుటకు ఎవ్వరము లేము అని ఆలోచిస్తున్నామా? దేవుడు గాడిదను కూడా నిలవబెట్టి మాట్లాడించ గలరు అనే దాన్ని గ్రహించాలి.
స్నేహితులరా! క్రీస్తు యేసులో ఉండిన ఆలోచనయే మన ప్రతి ఒక్కరికి ఉండిన యెడల మనం ఎవ్వరిని కూడా అశ్రద్ధ చెయ్యము. చదువు లేని మన తల్లిదండ్రులను మనము అశ్రద్ధ చెయ్యకుండా ఉంటాం. మన కంటే సామర్థ్యం తక్కువ ఉన్న సహోదరి సహోదరులును చిన్న చూపు చూడకుండా ఉంటాం. సంఘంలో ఆత్మీయ జీవితంలో తక్కువ ఉన్న విశ్వాసులను ఆశ్రద్ద చెయ్య కుండా ఉంటాం. క్రీస్తు మనస్సు మనలో ఉండనివ్వండి. ఇతరులను మన కంటే గొప్ప వారిగా తలంచుదాం. అప్పుడు ప్రభువు మనలను హెచ్చిస్తారు.
- బ్రదర్. హానిస్ శామ్యూల్
ప్రార్థన అంశం:-
మోక్ష ప్రయాణము, దిన ధ్యానము ముద్రించుటకు అవసరమైన ధన సహాయం అందేటట్లు ప్రార్థిద్దాం..
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250