Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 25.05.2021

దిన ధ్యానము(Telugu) 25.05.2021

అదిగో చూడుము విమానం.

"క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను." - రోమీయులకు 8:2

సర్ ఐసాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టిన వారు అని మనము యెరుగుదుము. ఒక మారు ఆయన ఒక ఆపిల్ చెట్టు క్రింద కూర్చున్నప్పుడు ఆపిల్ క్రింద పడటానికి గల కారణం ఏమిటి ఆలోచిస్తూ ఉంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని గ్రహించారు. దాని ప్రకారం ఒక వస్తువును ఆకాశంలో విసిరి వేసిన యెడల భూమి తన ఆకర్షణ శక్తి వలన తన వైపు లాగేసుకుంటుంది. కాని అనేకమంది ప్రజలను మరియు వాళ్ళ యొక్క బరువులను మోసుకొని వెళ్తున్న విమానం భూమి యొక్క ఆకర్షణ శక్తి చేత ఆకర్షణ పొందకుండా ఎలాగు ఎగర గలుగుతుంది? విమానంలో గల జెట్ యంత్రం విమానం ముందుకు వెళ్ళడానికి మరియు విమానం పైకి లేవడానికి భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా గొప్ప బలమును కలిగి ఉంది  కాబట్టి భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన విమానం క్రిందకు లాగబడకుండా ఉంది. 

బైబిల్లో కూడా రెండు విధములైన చట్టములు చెప్పబడుతున్నాయి. ఒకటి పాపపు విధి, మరియొకటి ఆత్మీయ విధి. పాపపు విధి ఒక మనుష్యున్నీ తన వైపునకు లాగేసుకుంటుంది. కాని ఆత్మీయ విధి అయితే పాపములో కొట్టి మిట్లాడుతున్న మనుష్యున్నీ పాపము నుండి విడుదల చేస్తుంది. పాపము మనము కోరుకున్న దానిని చేయుటకు ప్రేరేపిస్తుంది ఏవిధముగా అంటే మనము చేస్తున్నది మనకే ఇష్టం లేదు. నేను ఆశించింది చేయకుండా తిరస్కతిస్తున్న వాటినే చేస్తున్నాను. ఇలాగు నేనుకోరుకుంటున్న వాటిని చేయకుండా ఉండుటకు నాలో ఒక వ్యతిరేకత పని చేస్తున్నది అని ఒప్పుకుంటున్నాను. నేను కాదు నాలో ఉన్న పాపమే అలా చేస్తున్నది అని అపోస్తూలుడైన పౌలు అంగలార్చుతున్నారు. 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! మీరు అను దినము పాపముతో పోరాడుతువున్నారా? మీరు చేయ వలసిన కార్యాన్ని చేయకుండా పాపము మిమ్మల్ని ఆదికమిస్తుందా? చింతించకండి కచ్చితంగా విమోచన కలదు. ఆత్మతో శరీరనుసారమైన కార్యములను పతనం చేస్తే మీరు బ్రతుకుదురు అని వ్రాయబడిన వాక్యనుసారంగా పాపము కంటే బలమైన పరిశుద్ధాత్ముడు మనలో పాపపు క్రియలను పతనం చేసి పరిశుద్ధముగా జీవించుటకు సహాయం చేస్తారు. ఎలాగు విమానం క్రింద పడకుండా దాంట్లో ఉన్న మిక్కిలి బలమైన యంత్రం వలన అది ఆకాశంలో ఎగురుతుందో అలాగే మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముని యొక్క బలముతో మనము కూడా పరలోకానికి నేరుగా మనము నడిపించబడతాం. ఎలాగు చిన్న పిల్లలు ఆకాశంలో ఎగిరే విమానం చూచి ఆశ్చర్యపోతున్నారో అలాగే మన పరిశుద్ధ జీవితమును చూచి కొన్ని సార్లు మనమే ఆశ్చర్యపోతాం. హల్లెలుయా!
-    బ్రదర్. పి. శివ.

ప్రార్థన అంశం:-
తమిళ్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడం, మలయాళం ఒడియా, పంజాబీ అనే 8 భాషల్లో వస్తున్నా మన దిన ధ్యాన సందేశం అనేకులను బలపరిచేటట్లు ప్రార్దిద్ధాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)