దిన ధ్యానము(Telugu) 24.05.2021
దిన ధ్యానము(Telugu) 24.05.2021
పరిచయం చేస్తాము.
"వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు" - రోమీయులకు 10:14
సినిమా హీరోలను రోల్ మోడల్ గా పెట్టుకొని జీవించాడు ఆ యవ్వనస్తుడు. లోకపు మాయను వెంబడించి, అవే తన జీవితానికి సంతోషము అని, అవే తన జీవితానికి తుది మెట్టుకు తీసుకు వెళ్తుంది అని దృఢముగా నమ్మాడు ఆ యవ్వనస్తుడు. కళాశాలలో చదివేటప్పుడు ఆయనతో చదువుతున్న ఆయన స్నేహితుడు నీవు వెతుకుతూ వెళ్తున్నవి అన్ని కూడా మాయవంటివి ఎన్నడూ మారని యేసయ్య వెతుకు ఆయనే నిత్యమైన వాడు అని చెప్పాడు. కాని ఆ యవ్వనస్తుడు అయితే ప్రారంభంలో తన స్నేహితున్ని హేళన చేసి తిరస్కరించాడు. అయిన గాని ఆ స్నేహితుడు యేసయ్య గురించి చెబుతూ వచ్చాడు. ఒక రోజు ఆ యవ్వనస్తుడు ఈయన చెబుతున్నది నిజమో కాదో అని ఆలోచించి ఆకాశం వైపు చూసి యేసయ్య మీరే నిజమైన దేవుడు అయితే మీరు నాకు ప్రత్యక్ష పరచండి అని ప్రార్ధించాడు. అ దినము రాత్రే దేవుడు కలలో ఆ యవ్వనస్తునికి కనబడ్డారు. తరువాత ఆ యవ్వనస్తుడు ప్రభువుని సంతోషముతో అంగీకరించి శ్రమలు పోరాటాలు వచ్చినప్పటికీ దేవుని కొరకు పౌరుషముతో నిలబడ్డాడు. తరువాత దేవుని పిలుపుని అందుకొని ఈ దినము వరకు సంపూర్ణంగా పరిచర్య చేస్తూన్నాడు.
అపోస్తూలుడైన ఫిలిప్పు తనకు తెలిసిన వ్యక్తి అయిన నతానియేలును యేసయ్యకు పరిచయం చేశాడు. నతానియేలు యేసయ్య యొద్ద తనకు ఉండిన ప్రశ్నలు అన్నింటిని చిన్న పిల్లవాడి వలె అడిగి తెలుసుకున్నాడు. యేసయ్య గురించి తన హృదయంలో ఉండిన సమస్త ప్రశ్నలకు జవాబును పొందుకున్నాడు. చివరికి యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని చెప్పి ఆయనను విస్వసించాడు. దీనికి ప్రధాన కారకుడిగా దేవుని చేత వాడబడిన పాత్ర ఫిలిప్పు.
ప్రియమైన వారలారా! ఈ దినము మన చుట్టూ వున్న ప్రజలకు యేసయ్యను గూర్చిన సందేహలను, ప్రశ్నలను తీసివేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. దేవుడు వాళ్ళ మధ్యలో మనలను వెలుగుగాను, జవాబుగాను, మాదిరిగాను పెట్టియున్నారు. మొదట యేసయ్యను వాళ్లకు పరిచయం చేద్దాం. ఒక వేళ ఈ దినము వారు మనలను హేళన చేసి యేసయ్యను అంగీకరించక పోయినను ఏదో ఒక రోజు వాళ్ళ జీవితంలో యేసయ్య కచ్చితంగా అవసరమై ఉంటారు. అప్పుడు మీరు చెప్పిన యేసయ్య ప్రేమ వాళ్లకు ఉపయోగ పడుతుంది అది కచ్చితం. ఆమెన్!
- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్.
ప్రార్థన అంశం:-
ప్రతి దినము దినధ్యాన సందేశాన్ని వాట్సాప్, ఈ మెయిల్, ట్విట్టర్ ద్వారా చదువుతున్న వారు దివించబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250