దిన ధ్యానము(Telugu) 23.05.2021 (Kids Special)
దిన ధ్యానము(Telugu) 23.05.2021 (Kids Special)
సిలువ అనే మార్గదర్శి.
"నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును" - యోబు 23: 10
షాలిని ఉదయం లేచిన వెంటనే చాలా సంతోషంగా జాలీగా బయలు దేరుతుంది, అటు ఇటు పరిగెడుతూ ఏ డ్రెస్ వేసుకోవాలో దానిని సెలెక్ట్ చేస్తుంది. అమ్మ నేను ఎంత త్వరగా బయలుదేరానో చూసారా? మీరు ఇంకా బయలు దేరలేదు త్వరగా బయలుదేరండి అని తొందరపెట్టింది షాలిని. టూర్ కు వెళ్తున్నాము అన్నదే ఆ సంతోషమునకు గల కారణం. అందులోను జూ కి వెళ్ళడం అంటే ఇంకా సంతోషం మరి మీకు కూడా సంతోషమే కదా పిల్లలు. ఏ ఏ జంతువులు జూ లో ఉంటయో చెప్పండీ పిల్లలు! ఏనుగు, పులి, సింహము, జింక ఇలా చాలా ఉంటాయి కదా!. మీరు కూడా జూ కి వెళ్లారా? ఓహ్! స్కూల్ నుండి తీసుకు వెళ్ళారా. సింహాన్ని నేరుగా చూడాలి అంటే భయము వేస్తుంది కదా!
అలాగే షాలిని ని జూ లో అన్ని తిరిగి చూసింది. ప్రతి జంతువును చూసినప్పుడు ఆమెకు ఆశ్చర్యం అనిపించేది. ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నా చెయ్యి పట్టుకొని నడవమని నాన్న చెప్పారు. జంతువులు ఉన్న కంచెను ముట్టుకోవద్దు అని నాన్న చెప్పారు. అందుకు సరే నాన్న అని చెప్పింది షాలిని. జంతువులను చూచుటకు చాలా విచిత్రంగా ఉన్నందున ఆ స్థలం విడిచిపెట్టి వచ్చుటకు షాలినికి ఎంత మాత్రం ఇష్టం లేదు. నాన్న మీరు నా చెయ్యి విడిచిపెట్టండి నేను మీ వెనక వస్తాను అని చెయ్యి విడిపించుకుంది. అమ్మానాన్న షాలినిని వెనక వైపు తిరిగి చూస్తూనే వస్తున్నారు. కొంచం దూరం తరువాత షాలిని కనపడకుండా పోయింది. అమ్మ నాన్న బయపడిపోయారు. షాలిని షాలిని అని పిలవడం ప్రారంభించారు. షాలిని దారి తప్పిపోయి వేరే చోటుకు వెళ్ళిపోయింది. దారిలో కనబడుతున్న వారిని మా అమ్మాను చూసారా? మా నాన్న చూసారా? అని ఏడుస్తూ అడిగింది. ఎవ్వరు అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో చెప్పలేక పోయారు. చుట్టూ చూడ సాగింది వెంటనే ఆమెకు ఒక సిలువ కనబడింది. ఆ సిలువను చూస్తూ నడవ సాగింది ఆమె ఆ చర్చ్ దగ్గరకు వెళ్ళింది. ఆ చర్చ్ ను చూడగానే ఆమె హృదయంలో ఉన్న భయం అంతా పోయింది. ఆ చర్చ్ పాస్టర్ గారు షాలినిని చూసి ప్రేమతో పిలిచి ఆమె గురించి అడిగారు. జరిగింది తెలుసుకొని అడ్రస్ తెలుసుకొని ఆయన షాలినిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. షాలినిని చూసిన తల్లిదండ్రులు యేసయ్యకు వందనములు చెప్పారు. అలానే సహాయం చేసిన ఆ పాస్టర్ గారికి కుండా ధన్యవాదాలు చెప్పారు.
ప్రియ తమ్ముడు, చెల్లి మీ జీవితంలో కూడా మార్గం తెలియక ధన ఆర్థిక ఇబ్బందులు, వ్యాధి, పేదరికం అని కలతతో ఉండవచ్చు. సిలువ వైపు చూడండి. మీరు మంచిగా ఉండాలి అనే సిలువలో యేసయ్య రక్తం కార్చి మరణించారు. మిమల్ని సరైన మార్గంలో నడిపించి మీ ఆవసరతలు తీర్చుటకు ఆయన శక్తిమంతుడై యున్నారు. మీరు ఆయన సిలువను వెంబడిస్తారా? ఆమెన్!
- సిస్టర్. దేబోరా
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250