దిన ధ్యానము(Telugu) 22.05.2021
దిన ధ్యానము(Telugu) 22.05.2021
మార్పు అవసరమే:-
"...మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి." - రోమీయులకు 12:2
అల్లరి చేస్తున్న బాలుడు వీధుల్లో తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు దాగుకొనుటకు మంచి స్థలం వెతికాడు వాడి కంటిలో పక్కనే ఉన్న దేవాలయం కనబడింది. ఓహ్! క్రిస్మస్ రోజున మనం వెళ్లిన చర్చే కదా అని ఆలోచించి గబగబా లోపలికి వెళ్ళి దాగుకొనుటకు ప్రయత్నం చేసాడు. అక్కడ ఉన్న బోధకుడు తనని చూచి కూర్చోపెట్టి దేవుడు ఎక్కడ అని ప్రశ్నించారు.ఆ బాలునికి జవాబు ఏమి చెప్పాలో తెలియట్లేదు, మరలా దేవుడు ఎక్కడ అని స్వరాన్ని పెంచి గట్టిగా ఆడిగేసరికి తనకి భయం వేసి చమట్లు కారాయి . 3వ సారి కూడా బోధకుడు అతనివైపు చూచి మేజా మీద బలంగా కొట్టి కోపంతో దేవుడు ఎక్కడ అని అడిగేసరికి. ఆ బాలుడు భయపడిపోయి పరుగు పరుగున బయటికి వెళ్ళిపోయాడు. దానిని చూచిన తన యొక్క అన్నయ్య తమ్ముడు ఇలా చమట కారుతుంది ఎక్కడ నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నావ్? అని అడిగాడు అందుకు ఆ బాలుడు అన్నయ్య మనం చాలా సమస్యల్లో ఇరుక్కుపోయాం, ఈ సారి దేవుడు కనబడలేదంట మనమే దొంగిలించామని అనుమానిస్తున్నారు అని అన్నాడు.
ఇది ఒక హాస్యాస్పదమైన కధ వంటిదిగా ఉండినప్పటికి ఆలోచించ వలసినదే మన జీవితంలో దేవుడు ఎప్పుడైనా కనబడకుండాపోయాడా? మన నడవడికలలో, మాటలలో, జీవితాన్ని చూస్తున్న ఎంతమంది మనలో క్రీస్తుని చూస్తున్నారు? క్రీస్తు శఖము, క్రీస్తు పూర్వము, అనే లోక చరిత్ర రెండు బాగములుగా చేసింది. మన జీవితంలో కూడా క్రీస్తుని అంగీకరించడానికి ముందు, క్రీస్తుని అంగీకరించిన తరువాత అనే వ్యత్యాసము కనబడాలికదా! యేసు క్రీస్తు ని రక్షకుడిగా అంగీకరించడం మాత్రమే కాక మన గుణాతిశయములోను, జీవితంలోను మార్పు కనబడవలసినది అవసరమే కదా!
ఐగుప్తు భవనంలో పెరిగిన మోషే కోపము చేత ఒకడిని చంపినందున భయపడిపోయి దేశాన్ని విడచి పారిపోయాడు, అదే మోషే ముళ్ళపొదల్లో దేవున్ని చూచిన తరువాత ధైర్యం తెచ్చుకున్న వాడుగా మరలా ఐగుప్తు దేశమునకు వచ్చి బానిసత్వములో ఉండిన ప్రజలను రక్షించుటకు వాళ్లను నడిపించే నాయకుడుగా మారాడు. అది మాత్రమే కాక ఆయన యొక్క గుణాతిశయము మార్చబడి భూలోకం అందరిలోనూ మిక్కిలి సాత్వీకుడు అని బైబిల్ ఆయన గురించి సాక్ష్యం చెప్తుంది. (సంఖ్యా కాండం 12:3) క్రీస్తుతో కూడిన ఒక కలయిక ఆయన జీవితాన్నే మార్చివేసింది. మారుమనస్సు అన్నది మనకు చెందినదే ఒకడు క్రీస్తున్నందున్నయెడల నూతన సృష్టిగా ఉంటున్నాడు. పాతవి గెతించి పోయి సమస్తము క్రొత్తవిఆయెను మన జీవితంలో దేవుణ్ణి దుఖ్ఖః పరుస్తున్న పాత చేదు, కోపము, పౌరుషము, శరీరేచ్చలను విడచి క్రీస్తు పోలికను ప్రతిబింబింప చేసేవారిగా మనం కనబడుదాం.
- శ్రీమతి. వసంతి రాజమోహన్
ప్రార్థనా అంశం:-
మోక్ష ప్రయాణము,(మాస పత్రిక), అనే ధ్యానము అనేకులకు ప్రయోజనకరంగా ఉండేటట్లు దీని ద్వారా అనేకులకు భక్తి వృత్తి కలిగేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250