Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 21.05.2021

దిన ధ్యానము(Telugu) 21.05.2021

తోట వేయుటకు సలహాలు.

"మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలు గాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను" - మార్కు 4: 20

తోట వేయుటకు సలహాలతో కూడిన ఒక పుస్తకాన్ని చదువుతున్న ఒక అతనికి ఒక మంచి పాయింట్ దొరికింది. నేలను గురించి శ్రద్ధ తీసుకోండి, మొక్కల గురించి చింతించ వలసిన అవసరం లేదు. నేల మంచిది అయితే విత్తనములు వాటంతట అవే చక్కటి ఫలితాన్ని ఇస్తాయి అన్నదే ఆ సలహా. 

దేవుని మాట విని దానిని అంగీకరించి దాని ప్రకారం నడిచి ఫలించే వాళ్ళను యేసుక్రీస్తు మంచి నేలతో పోలుస్తున్నారు. మంచి నేల వంటి హృదయంలో వేయబడిన మాట క్రీస్తు పోలికలో మనం తయారయ్యే వరకు పని చేస్తుంది. మనము బైబిల్ వాక్యాన్ని అంగీకరించిన యెడల అది ఎదిగి ఫలించేటట్లు పరిశుదాత్మ దేవుడు సహాయం చేస్తున్నారు. ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు వాక్యాన్ని అంగీకరించి దానికి లోబడి ఫలించే నేలగా మన హృదయాన్ని సిద్ద పరుచుకోవాలి. అప్పుడే నీతి గల పంట ఇవ్వగలము. 

మన హృదయము ఎలాంటి నేలగా కనబడుతుంది అని ఆలోచించి చూద్దాం. మన హృదయము కఠినంగా ఉండిన యెడల క్రింద ఉన్న ప్రార్ధనను మనము యదార్థముగా చేస్తాం. ప్రభువా మీరు నా హృదయాన్ని మంచి నేలగా మార్చుటకు నేను ఉన్నది ఉన్నట్లుగా మీ సన్నిధికి వచ్చి నన్ను సమర్పించు కుంటున్నాను. ఎలాంటి వ్యక్తినైనా మార్చగలిగిన సర్వ శక్తి గలిగిన మీ మాటలను నా హృదయంలో విత్తండి. వాక్యమైన విత్తనాలు వేరు పారి ఎదిగేటట్లు చేయండి. వాక్యాన్ని లోబడుటకు నన్ను నేను సమర్పిస్తున్నాను ఆమెన్. విశ్వాసముతో ఈ ప్రార్ధన చేయండి ఖచ్చితంగా హృదయము అనే నేలలో కనబడుతున్న కఠినమైన రాళ్ళ వంటి గుణలక్షణాలను పరిశుద్ధాత్ముడు తీసివేస్తాడు. లోతుగా వేరుపారియున్న పురుగులను ఆయన పురుగువంటి శరీరానుసారమైన గుణాతిశయాలను పీకిపడేస్తారు. గర్వము, అసూయ వంటి రాయిలను పగలగొడతారు. పరిశుద్ధాత్ముడు మంచువాలె దిగి తడుపుతారు. ఆయన కృపవంటి వర్షాన్ని కురిపిస్తారు. నీతి గల సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడు. మనము ఎదిగి ఫలించే వారిగా మారదాం.

ప్రియమైన వారలారా! 1వ కీర్తనలో చదువుతున్నట్లు రాత్రిమ్ బవళ్ళు దివారాత్రము ఆయన ధర్మ శాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు ఆయన నీటికాలువల యోరన నాటబడిన చెట్టువలె ఉండును ఆయన చేసిన వన్నీ కూడా సఫలమగును ఈ వాగ్దానము మీకు వర్తిస్తుంది హల్లెలూయ! 
-    శ్రీమతి. గీతా రిచ్చర్డ్
 
ప్రార్థనా అంశం:-
7000 మిషనరీలను సపోర్ట్ చేసే సపోర్టస్ , 7000 ప్రార్ధనా గుంపులు ప్రారంభించబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)