Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 20.05.2021

దిన ధ్యానము(Telugu) 20.05.2021

కాళీగా ఉన్న సమాధి.

"యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అనెను" - యోహాను 20:15

యేసు ప్రభువు సిలువలో మరణించిన తరువాత ఆయనను ఒక నూతన సమాధిలో పెట్టారు. మూడవ దినము యేసుక్రీస్తు యొక్క శరీరమునకు పరిమళ ద్రవ్యమును పూయుటకు మగ్దలేనే మరియ, మరి కొందరు స్త్రీలు సమాధి యొద్దకు వెళ్లారు. సమాధికి అడ్డుగా ఉన్న రాయి దొరలింపబడి యుండుట చూచి యేసుక్రీస్తు శరీరమును లేకుండా సమాధి కాళీగా యుండుట చూచి డిక్బ్రాంతికి గురి అయ్యారు. మిగిలిన వారు ఇంటికి తిరిగి వెళ్లిపోయినను మగ్దలేనే మరియ మాత్రం ఇంటికి వెళ్లకుండా సమాధి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమై అమ్మ నీవెందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఆమె అతనును తోట మాలి అని అనుకోని అయ్యా యేసుక్రీస్తును దాచి పెట్టిన స్థలం తెలిసి యుంటే చెప్పండి నేను వెళ్లి ఆయానను తీసుకుంటాను అని అంటుంది. ఎంత ప్రేమ చూడండి. ఈమె ఒక స్త్రీ యవ్వన ప్రాయంలో మరణించిన యేసయ్య శరీరాన్ని ఎలాగు ఒంటరిగా తీసుకోగలదు? అయినప్పటికీ ఆయన మీద వున్న అపరిమితమైన ప్రేమ వలన నేనే వెళ్లి ఆయనను తీసుకుంటాను అని అంటుంది. వెంటనే యేసుక్రీస్తు తనను ఆమెకు ప్రత్యక్ష పరచడానికి సిద్ధం అయ్యారు. ప్రాణంతో లేచిన యేసయ్యను మొట్ట మొదటగా చూచిన భాగ్యము మగ్దలేనే మరియకే దొరికింది. పేద్ద శిష్యుడైన పేతురుకు గాని, ప్రేమించిన శిష్యుడైన యోహానుకు గాని ఈ అవకాసం దొరకలేదు. యేసయ్యను మొదటిగా దర్శించే అంతగా ఆమె యేసయ్యను ప్రేమించింది. ఆ క్షణము వరకు నిరీక్షణ లేకుండా ఉండిన ఆమె ఆలోచనలో నూతన నిరీక్షణ వచ్చి ఆమె జీవితం వెలుగు కరముగా మారింది. 

ఆయన సమాధి ఇంకను కాళీగానే ఉంది. అందుకే ఆయన బలముతో తిరిగి లేచిన దానికి అది సాక్షిగా నిలబడుతుంది. అనేక సమస్యల చేత, మనో దుఃఖము చేత ఏడుస్తూ ఉన్నారా? ఆయన మరల తిరిగి లేచి తండ్రి కుడి పార్శమున ఉండుట నిజమైతే నాకెందుకు ఈ శ్రమలు, నా కేందుకు ఈ కలతలు అని కన్నీరు కారుస్తున్నారా? మీ యొక్క కన్నీరును దేవుడు చూస్తున్నాడు. అమ్మ  నీ వెందుకు ఏడుస్తున్నావు అని మగ్దలేని మరియను పిలిచి అడిగిన దేవుడు ఈ దినము మన పక్కనే నిలబడుతున్నాడు. ఆయన మనలను ఆదరిస్తున్నారు, సంతోషాన్ని ఇస్తున్నారు. మనము మగ్దలేనే మరియ వలె పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయనను వెతికిన యెడల తిరిగి లేచిన యేసుక్రీస్తు మన కన్నీరును కూడా తుడుస్తారు.

యేసుక్రీస్తు తిరిగి లేచిన ఈస్టర్ దినాన్ని గుర్తు చేసుకొనుట ప్రాముఖ్యం కాదు ఆయన ప్రతి దినము మన ఎండిపోయిన జీవితాన్ని బ్రతికింప చేయుటకు జీవము గల వారిగా ఉన్నారు. అదే మనము గ్రహించ వలసినది, ఇతరులకు చెప్ప వలసిన సందేశం. 
-    శ్రీమతి. భువన ధన బాలన్

ప్రార్థన అంశం:-
12 మంది మిషనరీల ద్వారా ఆయా రాష్ట్రల్లో సమర్పించబడిన 500 మంది మిషనరీలను దేవుడు మనకు దయ చేసేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)