Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 18.05.2021

దిన ధ్యానము(Telugu) 18.05.2021

ఊపిరి సమస్య.

"వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను" - లూకా 18:1

మిషనరీ జాన్ హైడ్ ఒక ప్రార్థన యోధుడు. భారతదేశంలో పరిచర్య చెయ్యడానికి వచ్చిన ఈయన తన జీవితం అంత కూడా ప్రార్థన లొనే గడిపేవారు. ఒక సారి పది దినములు ఆహారం లేకుండా ఎడతెగక ప్రార్థిస్తున్నారంట. కొన్ని దినములు రాత్రి అంత కూడా ప్రార్దిస్తుండేవారు. ఆయనతో ఉండే వాళ్ళు ఈయన ప్రార్ధనను చూసి ఆశ్చర్యపడి ఆడిగేవారంట. క్రీస్తుకి దగ్గరగా చేరుటకు ప్రార్థన ఒకటే మార్గం అని చెప్పేవారు. మోకాళ్ళ ప్రార్థన ఆయన శ్వాసగా ఉండేది. ప్రతి దినము ఇంకా కొంచం సేపు ప్రార్ధించడానికి సమయం దొరకదా అని ఆయన హృదయం అల్లాడుతు ఉంటుంది. 

యేసుక్రీస్తు కూడా బలమైన స్వరముతోను, కన్నీటితోను ప్రార్థన చేసేవారు. ఆయన యొక్క చమట రక్తపు బిందువుల వలె నేలపైన పడేది. రాత్రి అంత అరణ్య ప్రాంతంలోనికి వెళ్లి ఎంకతా ప్రార్థన చేసేవారు. ఆవిధంగా ప్రార్థన చేయుట ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది. మనం టూర్ వెళ్ళినప్పుడు మంచి దృశ్యాలు చూడటానికి మన కనులు ఎలాగు ఇష్టపడతాయో ఆలాగు యేసుక్రీస్తు కూడా తాను ఏకాంతంగా ప్రార్ధించడానికి వెళ్ళిన ప్రాంతంలో ఒక ప్రశాంతమైన చోటును ఆయన కనులు వెతికేవి అని ఒక పరిశుద్ధుడు చెబుతున్నారు. 

ఆయనే అంత ప్రార్ధించ వలసి ఉంటే మీరు నేను ఎంత ప్రార్ధించాలి. అవును ప్రార్థన మనకు ఊపిరి వంటిది. మనం ఊపిరి పీల్చుటకు కష్టపడిన యెడల మన ఊపిరితిత్తులలో ఏదో సమస్య ఉంది అని మనము గ్రహించు కుంటున్నాం. అలాగే మనం ప్రార్ధించుటకు కష్టంగా ఉంది అంటే సమస్య ఏదో మనలో ఉంది అదే కారణము అని గ్రహించవచ్చు. 

దేవుని పిల్లలారా! మన అనుదిన జీవితంలో ప్రతి విషయాన్ని దేవునికి తెలియజేసీ ఆయనతో బంధం పెట్టుకొని ప్రార్ధించుట మంచి అలవాటు. ఈ అనుభవము మన అనుదిన వాడుకలో వచ్చిన యెడల ఆ దినము అంత ప్రార్థన ఆత్మతో నిండిన వాళ్ళుగా ఉంటాం. ప్రార్థన ఒక పరంపర్యాముగా లేక కఠినమైన కార్యముగా ఉండదు. దేవుడు మన హృదయంలో పెడుతున్న చిన్న చిన్న కార్యముల కొరకు నిజముగా ప్రార్దించిన యెడల దేవుడు ఇంకా ఎక్కువ కార్యములను మనకు ఇచ్చి ప్రార్ధించే భారాన్ని ఇచ్చి గోప్ప ప్రార్థన యోధుడుగా, ప్రార్థన యోధురాలిగా మనలను మార్చగలరు. 
-    శ్రీమతి. సుసన్నల్ మ్యాత్యూ 

ప్రార్థన అంశం:-
రాష్ట్రాలు అన్నింటిలోనుండి 12 మిషనరీలను దేవుడు తీసుకొచ్చేటట్లు వారిని పరిచర్యలో బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)