Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 18.05.2021

దిన ధ్యానము(Telugu) 18.05.2021

కరెంటు తీగ, పక్షి.

"నేను లోకసంబంధిని కానట్టువారును లోకసంబంధులు కారు" - యోహాను 17:16

ఆట్లాడుకొని మరల ఇంటికి వచ్చిన జోయెల్ మేడ పైన గల కరెంటు తీగ పై కొన్ని పక్షులు కూర్చొని యుండుట చూచి వాటిలో ఒక దానిని పట్టుకొనుటకు చెయ్యి చాపాడు. జోయెల్ యొక్క చెయ్యి ఆ కరెంటు తీగకు తగిలినందున కరెంటు షాక్ కొట్టి జోయెల్ క్రింద పడిపోయాడు. వెంటనే ఆ పక్షలు అక్కనుండి ఎగిరిపోయాయి. దానిని చూచిన జోయెల్ కు ఒక ప్రశ్న వచ్చింది. ఆ పక్షులకు ఏమి కాలేదు కాని నేను ఆ కరెంటు తీగపైన చెయ్యి వేస్తే నా కేందుకు కరెంటు షాక్ కొట్టింది అని ఆ ప్రశ్న తల్లి యొద్ద అడిగాడు. అందుకు అమ్మ పక్షులు కరెంటు తీగ పైన కూర్చున్నప్పుడు ఈ నేలతో ఎంలాంటి సంబంధం ఉండదు. కాని నీ చేతులు కరెంటు తీగెను తాకినప్పుడు నీ కాళ్ళు నేలను తాకడం వలన ఆ కరెంటు తీగ నిన్ను షాక్ కొట్టింది అన్నారు. 

అవును ఈ పక్షులు భూమి మీద ఉండినప్పటికి నేలతో వాటికి ఎలాంటి సంబంధం లేనందున సాధారణంగా భయము లేని జీవితం జీవిస్తూ చుట్టూ తిరుగుతున్నాయి. మనము కూడా అలాంటి జీవితం జీవించడానికి పిలవబడుతున్నాం. అది ఎలాగు సాధ్యం అని ఆలోచిస్తున్నారా? మనము లోకములో జీవించి నప్పటికి మనము లోకానికి చెందిన వాళ్ళముకాము అని బైబిల్ చెబుతుంది. అనగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అని లోకము వలన కలిగిన వీటి మీద వాంఛ పెట్టుకొని మనుష్యుని యొక్క ఆత్మ ఈ లోకంలో జీవిస్తుంది. ఉదాహరణకు హవ్వ తన కంటితో ఫలమును చూచింది. దానిని రుచి చూడాలి అని శరీరాశ ఏర్పడింది. ఎందుకొరకు అంటే దేవుని వలె అయిపోవాలి అని అది జీవపు దంబమే కదా! కాని యేసుక్రీస్తు అరణ్యంలో సాతాను వలన శోధించబడినప్పుడు ఈ మూడింటిని జయించారు. 

ప్రియమైన వారలారా! నేను ఈ లోకానికి చెందిన వాడిని కానట్టు మీరు కూడా ఈ లోకస్తులు కారు అని యేసుక్రీస్తు చెప్పిన మాటలను ఎప్పుడు గుర్తుంచుకుందాం. మనం ఈ లోకంలో జీవించిన గాని ఈ లోకస్తులు జీవించిన జీవితపు విధానము మనలను ఆకర్షించేందుకు, మనలను కదిలించుటకు చోటు ఇవ్వకూడదు. మరియు లోకములోను, లోకంలో ఉన్న వాటి మీద దృష్టి ఉంచి వాటిని ప్రేమించకండి అని బైబిల్ చెబుతుంది. అవును మనము లోకంలో ఉండినప్పటికి మన జీవితం లోకాన్ని సంతోష పెట్టే విధముగా ఉండకుండ దేవున్ని సంతోష పెట్టే విధముగా ఉండనివ్వండి. అలాంటి జీవితం  జీవించుటకు ప్రభువు మనకు సహాయం చేయును గాక! 
-    శ్రీమతి. జాస్మిన్ శామ్యూల్

ప్రార్థన అంశం:-
ఈ నెల 14,15,16 తారీఖుల్లో మిషనరీ పిల్లల కొరకు ఏర్పటు చేసిన యెహోషువ క్యాంపుకు అనేక మంది మిషనరీ పిల్లలు పాల్గొనేటట్లు ప్రార్ధించండి.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)