Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 17.05.2021

దిన ధ్యానము(Telugu) 17.05.2021

"మీకు మరుగుగా"

"...మీ దేవు డైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను" - ద్వితియోపదేశకాండము 27:10

ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉండేవారు. ముగ్గురికి ఒక్కొక్క ఆపిల్ ఇచ్చి మీరు దీనిని ఎవ్వరికీ కనబడకుండా తినాలి నేను సాయంత్రం వచ్చి ఎలా తిన్నారు మీరూ నాకు చెప్పాలి అని అమ్మ పంపించారు. ఆ ఆపిల్స్ తీసుకొని వాళ్ళు సంతోషంతో వెళ్లారు. పెద్దవాడు తోటలోకి వెళ్లి చుట్టూ తిరిగి చూసాడు ఎవ్వరు లేరు కాబట్టి ఆపిల్ తినడం ప్రారంభించాడు. రెండవ కుమార్తె స్టోర్ రూమ్ లోనికి వెళ్లి ఎవ్వరు నన్ను ఇక్కడ చూడలేరు అని ఆ ఆపిల్ తినేసింది. చివరి వాడికి ఎక్కడ దాక్కోడానికి చోటు లేదు కాబట్టి తినలేక పోయాడు. సాయంత్రం ముగ్గురు తల్లి దగ్గరకు వచ్చారు. మొదట ఆపిల్ తిన్న ఇద్దరు కూడా వారు తిన్న విధానాన్ని తల్లికి వివరించారు. చివరి వాడైతే అమ్మ అన్నిచోట్ల యేసయ్య నన్ను చూస్తున్నారు కాబట్టి యేసయ్య కనుల ఎదుట దాగి నేను ఆ ఆపిల్ తినలేకపోయాను అన్నాడు. 

ఈ చిన్న వాడికి ఉండిన గ్రహింపు ఎవ్వరికీ లేకపోయింది. ఆదాము మొదలుకొని ఈ దినము వరకు ఉన్న మానవ జాతికి లేకుండా పోయింది. ఆదామా నీవెక్కడ ఉన్నావు అని దేవుని స్వరం వినబడింది. ఆదాము ఎక్కడ ఉండవలసిన వాడు పగటి పూట చల్లని సమయంలో దేవునితో సమయం గడప వలసిన వాడు. కాని వాడియొక్క పరిస్థితి ఏమిటి? హెబ్రీ 2:7 ప్రకారం మహిమతోను, ఘనతతోను  కిరీటం దరించిన వాడు. ఆయన చేసిన వాటన్నింటి మీద అధికారిగా నియమించబడినవాడు. సమస్తము ఆయన అధికారంలో ఉంచబడింది. కాని దేవుని స్వరము విని దాక్కున్నాను అని అంటున్నాడు. ఎంత దుఃఖకరము ఇలాగు దేవుని అజ్ఞను విడిచి వెళ్లిపోవుట పాపమే.

ప్రియమైన వారలారా! దేవుడు మనకు ఇచ్చిన ఘనత ఎంత గొప్పది అని ఎపుడైనా గ్రహించారా? ఈ దినము క్రీస్తు యేసుతో మహోన్నతమైన చోటులో కూర్చొని యున్నాము అని ఎఫెస్సి 2:7 లో చెప్పబడుతోంది. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఇంత గొప్ప ఘనతను గ్రహించ కుండా ఆదాము హవ్వ వలె లోకాశ, నేత్రాశ, జీవపుడంబము వీటి మీద ఆశ పెట్టుకొని దేవుని విడిచి దూరముగా వెళ్లిపోతున్నామా? అలాగైతే వెంటనే మారుమనస్సు పొందుదాం. ఆయనతో సమాధానపడి ఎప్పుడు ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలుయా! 
-    సిస్టర్. ఏ. బ్యూలా

ప్రార్థన అంశం:-
చత్తీస్ ఘర్, ఆంధ్రా, ఒడిస్సా రాష్ట్రల నుండి బైబిల్ కాలేజీకి వచ్చిన విద్యార్దులు ఉత్సహంగా క్లాసుల్లో పాల్గొనేటట్లు, ఆత్మీయ జీవితంలో ఏదిగేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)