Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 16.05.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 16.05.2021 (Kids Special)

ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం:-

స్నేహితునిగా వచ్చిన జీసస్

"నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు" - యోహాను 15:14

హాయ్ పిల్లలు! మీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమే కదా! ఫ్రెండ్స్ తో మంచిగా అడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, నవ్వుకొవచ్చు అలా సమయం కూడా తెలియకుండా అయిపోతుంది కదా! స్కూల్లో, వీధిలో, పక్కఇంటిలో, ఎదిరింట్లో ఇలా అనేక మంది స్నేహితులు మీకు ఉంటున్నారు కదా? వాళ్ళందరూ కూడా యేసయ్యను తేలుసుకొనుటకు మీరేమి చేస్తున్నారు? రాజేశ్వరి ఏమి చేసిందో కధ విందమా? 

ఒక గ్రామంలో కోమలి అనే ఒక పాప ఉండేది. ఆమెతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి పక్కింటి దివ్యను ఆడుకోవడానికి పిలుస్తాను అని వెళ్తే దివ్య చెప్పింది మా అమ్మా,నాన్న మార్కెట్ కి వెళ్లారు తమ్ముడిని నేనే చూసుకోవాలి కాబట్టి నేను ఆడుకోవడానికి రాలేను అని చెప్పింది. సరే పక్క వీధిలో గల మారేశ్వరి ఇంటికి వెళ్తాను అని ఆలోచించి కోమలి అక్కడికి వెళ్ళింది. మీరు కూడా ఒంటరిగా ఉంటే బోరు కొడుతోంది అని ఫ్రెండ్స్ ని వెతుకుతారు కదా? మీ వలె. కోమలి కి కూడా బోరు కొట్టింది. సరే కోమలి ఎవరింటికి వెళ్లిందో చెప్పండి చూద్దాం అవును కరెక్టుగా చెప్పారు.

మారేశ్వరి ఇంటికి వెళ్లి మారేశ్వరి నాతో ఆడుకోవడానికి వస్తావా అని అడిగింది కోమలి. మా అమ్మానాన్నతో కలిసి టౌన్ కు వెళ్తున్నాము అని చెప్పింది మారేశ్వరి. తనతో ఆడుకోవడానికి ఎవ్వరు లేక దీనంగా నడుస్తూ వెళ్తుంది కోమలి. ఈలోగా ఎదురుగా వచ్చిన రాజేశ్వరి కోమలి ఎక్కడకు వెళ్తున్నావు? ఈ రోజు శుభ అక్క వస్తున్నారు పాటలు, కథలు నేర్పిస్తారు, మంచి ఆటలు ఆడిస్తారు చాలా బాగుంటాయి వస్తావా అని అడిగిన వెంటనే సంతోషంతో వెళ్ళింది కోమలి. అక్కడ చూస్తే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. శుభ అక్క మంచిగా పాటలు, కథలు నేర్పించారు. మీ బెస్ట్ ఫ్రెండ్ జీసస్ ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటారు. ఎంత మందికి యేసయ్యతో స్నేహం చెయ్యడం ఇష్టం అని ఆడిగినప్పుడు కోమలి మొట్టమొదటగా చెయ్యి పైకి లేపింది. తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించు కున్నది. కొత్తగా మంచి ఫ్రెండ్స్ కోమలికి దొరికారు. నేర్పించిన పాటలను పాడుతూ సంతోషంగా నడుస్తూ ఇంటికి వెళ్ళింది కోమలి. ఆడుకోవడానికి ఎవ్వరు లేరు అని బాధపడుతున్న కోమలికి అనేక మంది ఫ్రెండ్స్ దొరికారు అది మాత్రమే కాదు జీసస్ ఆమె బెస్ట్ ఫ్రెండ్ గా వచ్చారు. వీటన్నింటికి ఎవరు కారణము అని అనుకుంటున్నారు? అవును రాజేశ్వరియే కదా!

తాను మాత్రం సండే స్కూల్ కి వెళ్తే చాలదు తన గ్రామంలో ఉన్న పిల్లలు అందరూ కూడా యేసయ్యను తెలుసుకోవాలి అని ఆశించి ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలను పిలిచింది. యేసయ్యే మనకు మంచి ఫ్రెండ్ అని అందరికి పరిచయం చేయడానికి రాజేశ్వరి సహాయం చేసింది. మరి మీరు కూడా యేసయ్యను పరిచయం చేయుటకు మంచి ఫ్రెండ్ గా ఉంటారా? ఒకే నా!
-    సిస్టర్. ఏ. బ్యూలా

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)