దిన ధ్యానము(Telugu) 15.05.2021
దిన ధ్యానము(Telugu) 15.05.2021
విత్తనము మోలుచును.
"కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు" - 1కోరింథీయులకు 3: 7
ప్రార్థన అపోస్తులుడు అని పిలవబడుతున్న జాన్ హైడ్ పంజాబ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో తన స్నేహితులతో కలిసి పరిచర్యను ప్రారంభించారు. అందరూ రాత్రి, పగలు ప్రజలను దర్శించి దేవుని మాటలను చెప్పేవారు. కాని ఎలాంటి ఫలితము లేదు ఎందుకు ఇలాగు అని ఇద్దరుకూడా నిరుత్సాహ పడ్డారు. మనం చేస్తున్న పరిచర్య సరిగా లేదా అని మాట్లాడుకున్నారు. పరిచర్యలో ఆఖరి దినము అని చెప్పి పాట ఒకటి దేవుని మాటలను ప్రకటించారు. కొంత సేపు తరువాత ఒక యవ్వనస్తుడు వచ్చి వారు పాడిన పాట తనను ఆకర్షించినట్లు చెప్పాడు. తరువాత ఒకరు ఒకరుగా వచ్చి బాప్తిస్మము తీసుకొనుటకు ముందుకు వచ్చారు. దానిని చూసిన జాన్ హైడ్ ఆశ్చర్యపోయారు.
అపోస్తులుడైన పౌలు మంచిగా వాక్యం విత్తడం నేర్చుకున్న వ్యక్తి. వాక్యపు విత్తనములు ప్రజల అందరి హృదయాల్లో పడేటట్లు సమయం దొరికిన దొరకకపోయిన ప్రకటించేవారు. కాని దేవుడే దానికి ఫలితాన్ని ఇచ్చారు అనే దాంట్లో ఆయన నిరీక్షణ కలిగి ఉన్నారు. అందుకే నేను నాటాను, అపోల్లో నీరు పోశాడు, దేవుడే దానికి ఫలితాన్ని ఇచ్చారు అని చెప్పారు. ఈ సత్యం గ్రహించి నందున పౌలు తన పరిచర్యను నెరవేర్చారు.
దీనిని చదువుతున్న స్నేహితులారా! మీరొక సంఘాన్ని నడిపించవచ్చు లేదా సువార్త ప్రకటించ వచ్చు. సంవత్సరాలు తరబడి పరిచర్య చేసిన ఆత్మలు సంపాదించలేక ఇబ్బంది పడుతున్నారా? ఏలాంటి కదలిక లేక నిరుత్సాహ పడిపోతున్నారా? విత్తడం మన ప్రార్థనతో దేవుడు మీకు ఇచ్చిన పనిని చేస్తూ ఉండండి. దేవుడు మనలను ఉత్సాహ పరిచే విధముగా అప్పుడప్పుడు కొన్ని ఫలితాలను ఇస్తూవుంటారు. అందుకే అలా లేకుండా మనం చేసిన పరిచర్య వ్యర్థము అని తలంచకండి. నీటి మీద ఆహారమును వేయుము అనేక దినముల తరువాత నీవు దాని ఫలితాన్ని చూస్తావు అన్నది వాక్యం. హల్లెలుయా!
- శ్రీమతి. జ్యోతి ఆనంద్
ప్రార్థన అంశం:-
నూతనముగా మనతో కలిసియున్న మిషనరీలను దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250