దిన ధ్యానము(Telugu) 13.05.2021
దిన ధ్యానము(Telugu) 13.05.2021
చూచే ముందు మరణం లేదు.
"ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందవు" - లూకా 2: 26
1985వ సంవత్సరం ఫోర్చుగల్ దేశంలో మధిరా అని చిన్న ధీవిలో ఒక తల్లి నివసించేది. తన కడుపులో పెరుగుతున్న 4నెలల గర్భాన్ని తీసేయాలి అని ఆమె ఆలోచించారు. జీవితంపై విరక్తి, ఆర్థిక ఇబ్బందులు వీటి మద్యలో శిశువును కనడం చాలా కష్టమని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది ఆమె. కాని జరిగనది ఏమిటి అంటే ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఆమె గర్భం పోలేదు. 1985 వ సంవత్సరం ఒక మగ బిడ్డను జన్మనిచ్చింది. దేవుని భక్తిగల ఆ తల్లి తన తప్పును ఒప్పుకొని క్రిస్టియనో రోనాల్డో అని పేరు పెట్టింది. ఈ దినము ఆయనే ఫుట్ బాల్ ల్లో స్టార్ ఆటగాడు. అతడు గోల్ వేసిన విధానములను చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మిక్కిలి చిన్న దేశమైన పొర్చ్ గల్ నుండి వచ్చి ఆసియా ఐరోపా అని ప్రపంచ దేశాలను వనికిస్తున్నాడు. దేవుడు ఇంకను ఎన్నో కార్యములు ఇతని ద్వారా చేయుటకు సిద్ధంగా ఉన్నారు.
బైబిల్లో లుకా సువార్త 2వ అధ్యాయంలో అద్భుతమైన ఒక వ్యక్తిని చూడగలం. రక్షకుడైన యేసయ్యను నువ్వు చూడక ముందు మరణము నొందవు అని పరిశుద్దాత్ముని చేత షిమ్యోనుకు చెప్పబడింది. అది ఎంత గొప్ప మాట. తన జీవితంలో దేవుడు తనకు చెప్పినది నెరవేరే వరకు ఆయన మరణించలేదు. ప్రాణం పోయిన స్థితిలో ఉన్నప్పటికీ రక్షకుని జన్మ చూడకుండా నీవు మరణము నొందవు అని చెప్పుట ఎంత గొప్ప సంరక్షణ. ఆ దినము వచ్చింది యేసుక్రీస్తుని ఎత్తుకొని ప్రార్ధించారు.
దీనిని చదువుతున్న ప్రియమైన స్నేహితులారా! ఈ సమయంలో ఇదే నా సువార్త దేవుడు మీ గురించి పెట్టుకున్న ప్రణాళికలు, దర్శనాలు నెరవేరే వరకు మీరు మరణించారు. మార్పు లేని నిలకడ లేని ఈ లోకంలో ప్రాణం కొరకు గ్యారెంటీ లేని జీవితం జీవిస్తున్న మనకు కలత అవసరం లేదు. దేవుడు మీ ద్వారా ఈ లోకంలో చేయాలి అనుకున్న కార్యాన్ని ప్రణాళిక వేసి పెట్టియున్నారు. అందుకొరకై ఈ క్షణం వరకు మీకు వాగ్దానాలు ఇచ్చి సంరక్షించి వాగ్దానాలు ఇచ్చి నడిపిస్తూ వస్తున్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానము, ప్రణాళికలను మీ కనులు కచ్చితంగా చూస్తాయి. దానిని చూచే ముందు మీకు ఎలాంటి భయము, దిగులు, మరణము అనే పరిస్థితి వచ్చినా మీరు నిరీక్షణతో ఉండండి. దుర్వార్త వినుటలో మీరు కలత చెందకండి. మీ హృదయము దేవున్ని నమ్మి దృఢముగా ఉండనివ్వండి. కాబట్టి ధైర్యముతో దేవుని మీద నిరీక్షణతో ఈ లోకాన్ని విశేషముగా ఈ కరోనా దినాలను ఎదుర్కొందాం.
- బ్రదర్. పి.శంకర్ రాజ్
ప్రార్థన అంశం:-
గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న ప్రార్థన గుడారపు కట్టడ పనులు త్వరగా పూర్తి అవ్వడానికి వాటికి అవసరమైన ధన సహాయం అందేటట్లు ప్రార్థన చేద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250