దిన ధ్యానము(Telugu) 12.05.2021
దిన ధ్యానము(Telugu) 12.05.2021
ఇంటిని తెరవండి.
"...కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కని పెట్టుకొని యుండెను" - అపో.కార్యము 10:24
"పరలోక మనిషి " అని పిలవబడుతున్న యూన్ అనే ఒక చైనా మిషనరీ. రక్షింపబడిన ప్రారంభ దినాల్లో ఆయన తండ్రి మరణ కరమైన రోగముతో ఇబ్బంది పడ్డారు. ఆయన ఆరోగ్యం కొరకు కుటుంబం కలిసి ప్రార్ధించింది. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థత ఇచ్చారు. ఆ దినాల్లో చైనా దేశములో కమ్యూనిస్ట్ సిద్ధాంతము ఎక్కువగా ఉండేది. ఆ పరిస్థితుల్లో కూడా యూన్ మరియు స్నేహితులు, బంధువులు, పొరిగింటి వాళ్ళందరిని ఇంటికి పిలిపించారు. వాళ్ళందరూ యూన్ యొక్క తండ్రి మరణించారేమో అతని యొక్క సమాధికి వెళ్తున్నాము అనుకొని వచ్చారు. కాని వాళ్ళ తండ్రిగారు బ్రతికి యుండుట చూచి అందరూ ఆశ్చర్య పోయారు. అప్పుడు యూన్ మరియు అతని కుటుంభం యేసుక్రీస్తు చేసిన అద్భుతాలను వాళ్లకు వివరించారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దానిని విని కన్నీటితో ప్రార్ధించి విశ్వాసులయ్యారు.
కొర్నేలి అనే దేవుని దాసుడు తన ఇంటికి పేతురు రాబోతున్నారు అని తెలుసుకొని తన స్నేహితులను, బంధువులను తన ఇంటికి పిలిపించి పేతురు కొరకు వేచియున్నారు. పేతురు వచ్చి వాళ్లకు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడే పరిశుద్దాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. అప్పుడు కొర్నేలి ని చూసి పరలోకమే సంతోషించి ఉంటుంది అందుకు గల కారణం కొర్నేలి హృదయంలో బంధువులు, స్నేహితులు ప్రభువుని అంగీకరించాలి అన్న భారమే. కాబట్టి తన ఇంటిని తెరిచారు గొప్ప దీవెన కలిగింది.
ప్రియమైన వారలారా! కొర్నేలి వలె, యోన్ వలె ఇలాంటి కోరిక ఉన్నదా? మనం పిలిచిన యెడల మన ఇంటికి ఆశక్తిగా వచ్చేటట్లు మన గురించి మంచి సాక్ష్యం మన చుట్టూ వున్న వాళ్ళ దగ్గర ఉన్నదా? మన స్నేహితులు, పొరుగింటి వారు చర్చ్ కి వెళ్లలేని పరిస్థితిలో ఉండవచ్చు కాని వాళ్ళను మన ఇంటికి పిలవగలం. వాళ్ళను మన ఇంటికి పిలిచి ఒక అవకాశాన్ని ఏర్పరచి అనగా పిల్లల పుట్టినరోజు, వివాహ దినము అని వాళ్లను పిలిచి ప్రభువు చేసిన మేలులు మనము వాళ్ళతో పంచుకొనిన యెడల ప్రభువు వాళ్ళ హృదయంలోను కార్యము చేస్తారు. తరువాత దినములు గడుస్తున్న కొలది ఒక ఇంటిలో ప్రార్ధన గుంపును ఏర్పరచి దాని ద్వారా ఎరుగని అనేకులను సంఘంలో చేర్చగలము. దాని ద్వారా పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది.
- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్.
ప్రార్థన అంశం:-
ఈ దినము తేనీలో జరగబోతున్న మన మిషనరీ వివాహము వాయిదా పడింది దాని కొరకు ప్రార్ధించండి.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250