దిన ధ్యానము(Telugu) 11.05.2021
దిన ధ్యానము(Telugu) 11.05.2021
ప్రార్ధించే తల్లి:-
"మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమా నుడు" - సామెతలు 26: 6
ఇంగ్లాండ్ దేశంలో గల జాన్ వెస్లీ మెతడిస్టు సంఘములను స్థాపించారు. ఇంగ్లాండ్ దేశములో అన్ని వైపులా ఉజ్జీవం ప్రారంభమైంది. ఆ దినాల్లో ఆ దేశములో అంతటి ఉజ్జీవమునకు గల కారణం జాన్ వెస్లీ యే. జాన్ వెస్లీ పరిచర్య విజయవంతముగా జరగడానికి గల కారణం ఆయన తల్లి అయిన సుసన్న. ఆయన పసి ప్రాయంలో ఒక దినము వాళ్ళ ఇంట్లో ఏర్పడిన అగ్ని ప్రమాదంలో సుసన్న యొక్క పిల్లలు ఆమె యొక్క ప్రార్థన వలన కాపడబడ్డారు. అందులోనూ జాన్ వెస్లీ మిక్కిలి ప్రమాదకరమైన స్థితిలో వున్నప్పుడు ఆమె యొక్క ప్రార్థన వలన కాపడబడ్డాడు. అప్పటి నుండి ఆమె తల్లి అతనిని దేవుని పరిచర్య చేయుటకు ప్రోత్సహించారు. సుసన్న తన కుమారుడు జాన్ వెస్లీకి విద్య, క్రమశిక్షణ, దేవుని మీద భక్తిని అతనికి నేర్పించింది. సుసన్న ఇంట్లో పిల్లలు మాట్లాడడం ప్రారంభించిన వెంటనే ఆమె తన పిల్లలకు పరలోక ప్రార్థన నేర్పించింది. ఆ ప్రార్థన ఉదయము, సాయంత్రం చెప్పే విధముగా నేర్పించింది. ప్రతి వారము ఒక గంట ఆత్మీయ కార్యములను గూర్చి. మాట్లాడుతు ఉండేవారు. ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆమె నేర్పిన క్రమశిక్షణ తరువాత కాలంలో ఇంగ్లాండ్ దేశంలో గొప్ప దీవెన కరమైన సేవకున్ని తయారు చేసింది.
బైబిల్లో 1 సమూయేలు 1వ అధ్యాయంలో హన్నా గురించి చదువుతున్నాం. హన్నా యొక్క ప్రార్థన, భయభక్తులు, విశ్వాసముతో కూడిన జీవితం తరువాత దినాల్లో సమూయేలు అనే గొప్ప ప్రవక్తను తీసుకువచ్చింది. హన్నా దేవుని యొద్ద ప్రార్ధించి సమూయేలును పొందుకున్నది. ఆమె అతనికి చిన్న ప్రాయంలోనే ఇచ్చిన తర్ఫీదు అతను దేవాలయంలో పనిచేయుటకు తన్నుతాను సమర్పించేటట్లు చేసింది.
క్రీస్తునందు ప్రియమైన వారలారా! మీ యొక్క పిల్లలను దేవునిలో పెంచుటకు ఎలా ప్రయత్నం చేస్తున్నారు. నీవు నీ దేవుని ధర్మ శాస్త్రం మరచితివి గనుక నేను నీ పిల్లలను మరచితిని అని హోషేయా 4:6లో చదువుతున్నాం. బైబిల్ చదువుటకు, వాటిని పిల్లలుకు నేర్పించుటకు, ఉత్సాహా పరచుటకు మీరు ప్రార్ధించి ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను చివరికాల ఉజ్జీవమునకు గొప్ప ఆయుధంగా వాడుకుంటారు. ఆమెన్.
- బ్రదర్. పి. శివ
ప్రార్థన అంశం:-
అనారోగ్యంతో ఉన్న మన మిషనరీలకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయ చేయులాగున ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250